మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

కియా మోటార్స్ 2019 నుండి ఇండియన్ మార్కెట్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో పలు మోడళ్లను ఆవిష్కరించింది.

By Anil Kumar

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ 2019 నుండి ఇండియన్ మార్కెట్లో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో పలు మోడళ్లను ఆవిష్కరించింది. దేశీయ విపణిలోకి విడుదల చేయనున్న ఆ మోడళ్లను ఇప్పుడు ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షించడం మొదలుపెట్టింది.

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

తొలిసారిగా పరీక్షల కోసం రోడ్డెక్కిన ఈ కియా గ్రాండ్ కార్నివాల్ 11 సీటర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీకి సరాసరి పోటీనిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, కియా మోటార్స్ ఇండియన్ ఎమ్‌పీవీ మార్కెట్లోకి కియా గ్రాండ్ కార్నివాల్ మరియు క్రాసోవర్ మార్కెట్లోకి స్టోనిక్ కార్లను దేశీయ మార్కెట్ కోసం ఖరారు చేసింది. అందులో గ్రాండ్ కార్నివాల్ మోడల్‌కు రహదారి పరీక్షలు నిర్వహింస్తుండగా మీడియా కంటబడింది.

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

తొలిసారి పట్టుబడిన కియా గ్రాండ్ కార్నివాల్ 11 సీటర్ పూర్తిగా తెలుపు రంగులో పట్టుబడింది. అదే విధంగా ముందు మరియు వెనుక వైపున ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేటును గుర్తించవచ్చు. ఈ మోడల్ ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించిన మోడల్‌నే పోలి ఉంది.

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

కియా గ్రాండ్ కార్నివాల్ ఒక లగ్జరీ ఎమ్‌పీవీ, ఉత్తర అమెరికా మార్కెట్లో దీనిని సెడోనా అని పిలుస్తారు. కియా గ్రాండ్ కార్నివాల్ 5-డోర్ ఎమ్‌పీవీ మరియు అంతర్జాతీయ మార్కెట్లో ఇది 7, 8 మరియు 11-సీటింగ్ లేఔట్లో లభ్యమవుతుంది. అయితే, ఇండియన్ మార్కెట్లోకి 11-సీటర్ వెర్షన్ లాంచ్ చేసే అవకాశం ఉంది.

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

కియా గ్రాండ్ కార్నివాల్ ఎమ్‌పీవీలో అత్యంత విలాసవంతమైన లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. అందులో, డ్యూయల్-సన్‌రూఫ్, పవర్ స్లైడింగ్ రియర్ డోర్లు మరియు త్రీ-జోన్ ఎయిర్ కండీషనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

డిజైన్ పరంగా గ్రాండ్ కార్నివాల్ ఫ్రంట్ డిజైన్‌లో టైగర్ నోస్ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ ఉంది. ఎక్ట్సీరియర్ ఓవరాల్ డిజైన్ లగ్జరీగా కనిపిస్తుంది మరియు ఎమ్‌పీవీలో స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీనిని తక్కువ ధరలో అందించేందుకు పూర్తి స్థాయిలో ఇండియాలోనే తయారు చేయనుంది.

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

సాంకేతికంగా కియా గ్రాండ్ కార్నివాల్ ఎమ్‌పీవీలో 2.2-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే ఇది గరిష్టంగా 200బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

కియా గ్రాండ్ కార్నివాల్ ఎమ్‌పీవీ ఒక్కసారి పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ అయితే, మార్కెట్లో ఉన్న సెగ్మెంట్-లీడర్ టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీకి గట్టి పోటీనివ్వనుంది. గ్రాండ్ కార్నివాల్ ఎమ్‌పీవీలోని మూడవ వరుస సీటింగ్ అత్యంత విశాలంగా, సౌకర్యవంతంగా ఉండవచ్చు.

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

కియా మోటార్స్ గ్రాండ్ కార్నివాల్‌తో పాటు స్టోనిక్ క్రాసోవర్ కారును కూడా ఖరారు చేసింది. అదే విధంగా ఇటీవల బెంగళూరులో సెరాటో ప్రమియం సెడాన్ కారును రహస్యంగా పరీక్షిస్తుండగా డ్రైవ్‍స్పార్క్ బృందం గుర్తించింది. 2019 కోసం పలు విభిన్న మోడళ్లను సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్: ఇన్నోవా క్రిస్టాకు ఇక చుక్కలే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా గ్రాండ్ కార్నివాల్ ఖచ్చితంగా టయోటా ఇన్నోవా క్రిస్టా స్థానాన్ని భర్తీ చేస్తుంది. పలు రకాల సీటింగ్ ఆప్షన్స్ దీనిని సక్సెస్‌కు బాగా కలిసిరానుంది. అయితే, ధరలను మాత్రం ఇన్నోవా క్రిస్టా పోటీగా అత్యంత చాకచక్యంగా నిర్ణయించాల్సి ఉంటుంది. కియా గ్రాండ్ కార్నివాల్ ధరల శ్రేణి రూ. 18 లక్షల నుండి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

మొదటిసారి రోడ్డెక్కిన కియా గ్రాండ్ కార్నివాల్

1. మొదటిసారి రోడ్డెక్కిన మేడిన్ ఆంధ్రా కియా కారు

2.విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలకు శాశ్వత పరిష్కారం

3.టియువి300 ప్లస్ ధరలు ప్రకటించిన మహీంద్రా

4.ప్యాసింజర్ కార్ల మార్కెట్ మొత్తం ఇప్పుడు మారుతి గుప్పిట్లో

5.సుయాజ్ కెనాల్: ఇదొక మానవ నిర్మిత అద్భుతం!!

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
Read In Telugu: Kia Grand Carnival MPV Spotted Testing In India — To Rival Toyota Innova Crysta
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X