ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

కియా మోటార్స్ దేశీయంగా డిమాండ్ ఉన్న సెగ్మెంట్ల వారీగా నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఇన్నోవా క్రిస్టా మీద వస్తోన్న డిమాండు దృష్ట్యా దీనికి పోటీగా 11 సీటింగ్ కెపాసిటి ఉన్న గ్రాండ్ కా

By Anil Kumar

దక్షిణ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో పలు ఉత్పత్తులను ప్రదర్శించింది. దేశీయంగా డిమాండ్ ఉన్న సెగ్మెంట్ల వారీగా నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్న కియా ఇప్పుడు, ఇన్నోవా క్రిస్టా మీద వస్తోన్న డిమాండు దృష్ట్యా దీనికి పోటీగా 11 మంది ప్రయాణించే సీటింగ్ కెపాసిటి ఉన్న గ్రాండ్ కార్నివాల్ ఎమ్‌పీవీని భారత్‌కు ఖరారు చేసింది.

ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో ఆవిష్కరించిన కియా ఎస్‌పి కాన్సెప్ట్‌తో పాటు 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్ మరియు కియా స్టోనిక్ క్రాసోవర్ మోడళ్లను దేశీయ మార్కెట్ కోసం సిద్దం చేస్తోంది. కియా గ్రాండ్ కార్నివాల్ 11 సీటర్ మరియు కియా స్టోనిక్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి....

ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

కియా మోటార్స్ ఎస్‌పి కాన్సెప్ట్ వెహికల్ ఆధారిత కాంపాక్ట్ ఎస్‌యూవీని తొలి వాహనంగా 2019 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది. అంతే కాకుండా, కియా మోటార్స్ భాగస్వామ్యపు సంస్థ హ్యుందాయ్‌కు చెందిన కార్లినో కాన్సెప్ట్ ఆధారిత సబ్-4 మీటర్ ఎస్‌యూవీని కూడా పరిచయం చేయాలని చూస్తోంది.

ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

కియా స్టోనిక్ మరియు గ్రాండ్ కార్నివాల్ మోడళ్లను ఇండియన్ ఆటో ఎక్స్ పో లో ఆవిష్కించినపుడు సందర్శకుల నుండి మంచి స్పందన లభించింది. దీంతో ఇప్పుడు ఈ రెండు మోడళ్లను దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది.

ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ నిర్మించిన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా కియా స్టోనిక్ క్రాసోవర్‌ను రూపొందించింది. ఇందులో, పులి ముక్కు ఆకారంలో ఉండే ఫ్రంట్ గ్రిల్, పగటిపూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న యాంగులర్ హెడ్‌ల్యాంప్స్, స్లోపింగ్ రూఫ్ డిజైన్, ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్ మరియు అల్లాయ్ వీల్స్ వంటివి స్టోనిక్ క్రాసోవర్‌జకు స్పోర్టివ్ లుక్ తీసుకొచ్చాయి.

ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

అంతర్జాతీయ మార్కెట్లో కియా స్టోనిక్ 1.2-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.6-లీటర్ డీజల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. ఇవి, 5-స్పీడ్ మరియు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అదే విధంగా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లలో ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమవుతోంది.

ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

కియా గ్రాండ్ కార్నివా ఎమ్‌పీవీ ఇండియన్ మార్కెట్లో మంచి కియా మోటార్స్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టనుంది. విపణిలో భారీ విజయాన్ని అందుకున్న టయోటా ఇన్నోవా క్రిస్టాకు పోటీగా కియా మోటార్స్ కియా గ్రాండ్ కార్నివాల్ ఎమ్‌పీవీ వాహనాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమైంది.

ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

ఉత్తర అమెరికాలో కియా గ్రాండ్ కార్నివాల్ ప్రీమియం ఎమ్‌పీవీ సెడోనా అనే పేరుతో లభ్యమవుతోంది. 5-డోర్లు ఉన్న కియా గ్రాండ్ కార్నివాల్ ఎమ్‌పీవీ 7, 8 లేదా 11 మంది ప్రయాణించే సీటింగ్ లేఔట్లో లభ్యమవుతుంది. కియా గ్రాండ్ కార్నివాల్ ప్రీమియం ఎమ్‌పీవీలో డ్యూయల్-సన్‌రూఫ్, పవర్ స్లైడింగ్ రియర్ డోర్లు మరియు త్రీ-జోన్ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

అంతర్జాతీయ విపణిలో కియా గ్రాండ్ కార్నివాల్ ఎమ్‌వీ సాంకేతికంగా 2.2-లీటర్ డీజల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతోంది. బహుశా 11 సీటర్ వాహనాన్నే ఇండియాలోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

ప్రస్తుతం, డిమాండ్ అధికంగా ఉన్న హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఎమ్‌పీవీ మరియు క్రాసోవర్ సెగ్మెంట్లలో కియా కార్లు రానున్నాయి. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలోని పెనుకొండ సమీపంలో ప్రొడక్షన్ ప్లాంటును నిర్మిస్తోంది. ఈ ప్లాంటు అందుబాటులోకి వస్తే, దేశీయ మార్కెట్లో విక్రయించనున్న ఉత్పత్తులను పూర్తి స్థాయిలో ఇక్కడే తయారు చేయనుంది.

ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న 11 సీటర్ కియా గ్రాండ్ కార్నివాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ తమ తొలి ఉత్పత్తిని 2019 ప్రారంభంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు, మరో రెండు కొత్త మోడళ్లను కూడా ఇండియన్ మార్కెట్ కోసం ఖరారు చేసింది. అత్యధిక డిమాండ్ ఉన్న క్రాసోవర్ మరియు ఎమ్‌పీవీ విభాగంలోకి స్టోనిక్ మరియు గ్రాండ్ కార్నివాల్ వాహనాలను సిద్దం చేస్తోంది.

ప్రస్తుతం ఉన్న ట్రెండును పరిశీలిస్తే, కియా గ్రాండ్ కార్నివాల్ ఎమ్‌వీ కియా మోటార్స్ ఇండియాకు భారీ సక్సెస్ సాధించిపెట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా, దీని రాకతో టయోటా ఇన్నోవా క్రిస్టా గట్టిపోటీని ఎదుర్కోంది.

కియా నుండి 11 సీటర్ గ్రాండ్ కార్నివాల్

1. 5-సీటింగ్ కెపాసిటీతో వస్తున్న 9 కొత్త ఎస్‌యూవీలు

2.ఒకప్పుడు రోడ్డు ప్రక్కన గాలిపటాలు అమ్ముకునే వాడు, కానీ ఇప్పుడు....

3. ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్

Source: Autocar India

Most Read Articles

English summary
Read In Telugu: Kia Considering The Stonic And Grand Carnival For India
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X