కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీకి ట్రెజోర్ పేరును ఖరారు

కియా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఎల్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అయితే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీ యొక్క ప్రొడక్షన్ వెర్షన్‌కు ట్రెజోర

By Anil Kumar

కియా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఎల్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అయితే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎస్‌యూవీ యొక్క ప్రొడక్షన్ వెర్షన్‌కు ట్రెజోర్ పేరును ఖరారు చేసింది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీకి ట్రెజోర్ పేరును ఖరారు

ఈ ఎస్‍‌‌యూవీకి అఫీషియల్‌గా పేరును ఖరారు చేసేందుకు ఫేమ్ ఫర్ నేమ్ అనే పోటీని నిర్వహించింది. అయితే, చివరగా ట్రెజోర్ పేరును ఖాయం చేసారు. మొదటి నాలుగు పేర్లను సేకరించి వెబ్‌పోల్ ద్వారా ఓటింగ్ నిర్వహించారు.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీకి ట్రెజోర్ పేరును ఖరారు

అందులో కియా కస్టమర్లు మరియు కియా కార్ల ప్రేమికులు అత్యధికంగా పాల్గొన్నారు. కస్టమర్లకు వారికి తోచిన పేర్లకు ఓటు వేశారు. నాలుగు పేర్లలో ట్రెజోర్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో కియా మోటార్స్ వారి అప్ కమింగ్ కాన్సెప్ట్ వెర్షన్ కియా ఎస్‌యూవీకి ట్రెజోర్ పేరును ఖరారు చేశారు.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీకి ట్రెజోర్ పేరును ఖరారు

జాబితాలో ఉన్న నాలుగు పేర్లలో టస్కర్, ట్రెజోర్, ఎస్‌పి-జడ్ మరియు ట్రయలిస్టర్. ఓటింగ్ ప్రారంభమైనపుడు ట్రెజోర్ మరియు టస్కర్ పేర్లకు వరుసగా 61 శాతం మరియు 25 శాతం ఓట్లు వచ్చాయి. అదే విధంగా ఎస్‌పి-జడ్ మరియు ట్రయలిస్టర్ పేర్లకు 10 శాతానికంటే తక్కువ మంది వోట్ చేశారు.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీకి ట్రెజోర్ పేరును ఖరారు

ఇండియన్ ఆటో ఎక్స్ పో ద్వారా పరిచయమైన కియా ఎస్‌పి కాన్సెప్ట్ వచ్చే ఏడాది ప్రొడక్షన్ దశకు చేరుకోనుంది. కియా ట్రెజోర్ ఎస్‌యూవీని 2019 మధ్య భాగానికి పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీకి ట్రెజోర్ పేరును ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో నిర్మిస్తున్న కియా ప్రొడక్షన్ ప్లాంటులో ఈ ట్రెజోర్ ఎస్‌యూవీ తయారీ చేపట్టనుంది. ఈ ప్లాంటు 2019 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది మరియు దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3,00,000 యూనిట్లుగా ఉంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీకి ట్రెజోర్ పేరును ఖరారు

కియా ట్రెజోర్ ఎస్‌యూవీ గురించి మరెలాంటి సమాచారం లేదు, అయితే ఇండియన్ మార్కెట్లో పోటీగా ఉన్న ఇతర మోడళ్ల కంటే మెరుగైన ఫీచర్లతో వచ్చే అవకాశం ఉంది. కియా ట్రెజోర్ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ మరియు రెనో క్యాప్చర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

కియా ఎస్‌పి కాన్సెప్ట్ ఎస్‌యూవీకి ట్రెజోర్ పేరును ఖరారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కియా మోటార్స్ 2019 ప్రారంభం నాటికి దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనితో పాటు కేవలం18 నెలల వ్యవధిలోనే పలు ఇతర మోడళ్లను ప్రవేశపెట్టనుంది. అంతే కాకుండా, స్టోనిక్ క్రాసోవర్ మరియు గ్రాండ్ కార్నివాల్ 11 సీటర్ ఎమ్‌పీవీ వాహనాన్ని కూడా సిద్దం చేస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Kia Trazor Name For Production-Spec SP-Concept SUV
Story first published: Thursday, May 24, 2018, 14:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X