ఆటో ఎక్స్‌పో 2018: ఎలక్ట్రిక్ వెర్షన్ కెయువి100 ప్రవేశపెట్టిన మహీంద్రా

ఆటో ఎక్స్‌పో 2018: దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఢిల్లీలో జరుగుతున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో తమ యంగ్ ఎస్‌యూవీ కెయువి100 ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఆవిష్కరించింది.

By Anil

ఆటో ఎక్స్‌పో 2018: దేశీయ దిగ్గజ ఎస్‌యూవీల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఢిల్లీలో జరుగుతున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో తమ యంగ్ ఎస్‌యూవీ కెయువి100 ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఆవిష్కరించింది.

Recommended Video

Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark
మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

మహీంద్రా కెయువి100 మైక్రో ఎస్‌యూవీ మహీంద్రా యొక్క తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. అంతే కాకుండా భారత్‌లో విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూడా ఇదే. మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ గురించి మరిన్ని వివరాలు...

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

మహీంద్రా ఎలక్ట్రిక్ లైనప్‌లో తమ ఉత్పత్తుల సంఖ్యను పెంచుకునే క్రమంలో కెయువి100 ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అభివృద్ది చేసింది. 2018 చివరి నాటికి లేదా, 2019 ప్రారంభంలో విపణిలోకి విడుదల చేయనుంది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ కారుకు వెనుక వైపున ఎలక్ట్రిక్ అనే బ్యాడ్జ్ మినహాయిస్తే, వెహికల్ మొత్తం చూడటానికి సాధారణ కెయువి100 ఎస్‌యూవీనే పోలి ఉంటుంది. ఇంటీరియర్ కూడా రెగ్యులర్ మోడల్ తరహాలోనే ఉంటుంది. అయితే, గేర్ నాబ్ ఉండదు.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ కెయువి100లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటి, రిమోట్ డయోగ్నస్టిక్స్, క్యాబిన్ ప్రి-కూలింగ్, రియల్-టైమ్ లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా డ్రైవర్ డ్రైవింగ్ శైలి మరియు బ్యాటరీ పరిస్థితిని పరిశీలించే ప్రత్యేకమైన వ్యవస్థ కలదు.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్‍‌లో 30కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. దీనికి లిథియం-అయాన్ బ్యాటరీ నుండి పవర్ అందుతుంది. ప్రస్తుతం ఇవెరిటో కారులో ఉన్న అదే బ్యాటరీ సిస్టమ్ ఇందులో అందించారు.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సింగల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 140కిలోమీటర్లు ప్రయాణిస్తుంది మరియు గంట వ్యవధిలోపే బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అవుతుంది. విడుదల చేసే సమయానికి సరికొత్త కెయువి100 ఎలక్ట్రిక్‌లో నూతన ఎలక్ట్రిక్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ అప్‌డేట్ ఉంటుందని మహీంద్రా పేర్కొంది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే మహీంద్రా అధికారిక భాగస్వామి మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం, ఇండియన్ మార్కెట్ కోసం పలు విభిన్న ఎలక్ట్రిక్ మోడళ్లను మరియు పవర్ డ్రైవ్ ట్రైన్‌లను అభివృద్ది చేస్తోంది. కంపెనీ ఇది వరకే, ఇ2ఒ మరియు ఇవెరిటో ప్యాసింజర్ వాహనాలతో పాటు ఇ-సుప్రో కమర్షియల్ వెహికల్‌ను అందుబాటులో ఉంచింది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం గణనీయంగా పెరగనుంది. అందుకు ఇప్పటి నుండి మంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకుని, తనదైన ముద్ర వేసుకోవడానికి పలు విభిన్న ఎలక్ట్రిక్ వాహనాలను మహీంద్రా ప్రవేశపెడుతూ వస్తోంది. అందులో భాగంగానే భారతదేశపు తొల ఎలక్ట్రిక్ వెర్షన్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

మహీంద్రా కెయువి100 ఎలక్ట్రిక్

చిన్న సైజు హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ కాకుండా ఎస్‌యూవీ వెర్షన్ ఎలక్ట్రిక్ కారును ఎంచుకోవాలనుకునే ఔత్సాహిక కస్టమర్ల కోసం మహీంద్రా దీనిని ప్రవేశపెట్టింది. మరిన్ని తాజా ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

2018 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా సరికొత్త టియువి స్టింగర్ అనే భారతదేశపు మొట్టమొదటి కన్వర్టిబుల్ ఎస్‌యూవీని రివీల్ చేసింది. క్రింది ఫోటో గ్యాలరీ మీద ఓ లుక్కేసుకోండి!!

Most Read Articles

English summary
Read In Telugu: Auto Expo 2018: Mahindra eKUV100 (EV) Showcased; Expected Launch Date & Price, Specs & More
Story first published: Monday, February 12, 2018, 18:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X