మహీంద్రా మరాజొ ఇంటీరియర్ రివీల్

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పీవీ టయోటా ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న మరాజొ ఇంటీరియర్ రివీవ్ అయ్యింది. మహీంద్రా మరాజొ ఇంటీరియర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం రండి...

By Anil Kumar

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మరాజొ ఎమ్‌పీవీని ఆవిష్కరించింది. విపణిలో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టాకు పోటీగా యు321 పేరుతో పలుమార్లు పరీక్షించిన ఎమ్‌పీవీకి మరాజొ అనే పేరును ఖరారు చేసింది.

భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ఎమ్‌పీవీ టయోటా ఇన్నోవా క్రిస్టాకు పోటీగా వస్తోన్న మరాజొ ఇంటీరియర్ రివీవ్ అయ్యింది. మహీంద్రా మరాజొ ఇంటీరియర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దాం రండి...

మహీంద్రా మరాజొ ఇంటీరియర్ రివీల్

మరాజొ ఇంటీరియర్‌లోని డ్యాష్‌బోర్డ్ లగ్జరీ కార్లను తలపిస్తోంది. ప్రపంచ శ్రేణి నాణ్యత గల ప్రీమియం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ కంట్రోల్స్ గల త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, బ్లూ బ్యాక్ లైట్ గల పెద్ద పరిమాణంలో ఉన్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్పీడో మీటర్ మరియిు టాకో మీటర్ డయల్స్ ఉన్నాయి.

మహీంద్రా మరాజొ ఇంటీరియర్ రివీల్

ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో కూడా పెద్ద పరిమాణంలో ఉన్న ఎమ్ఐడి డిస్ల్పే కలదు, వెహికల్‌కు సంభందించిన పూర్తి సమాచారాన్ని చూపించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. సెంటర్ కన్సోల్ మీద ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల పెద్ద పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. సెంటర్‌కన్సోల్‌లో క్లైమేంట్ కంట్రోల్ మరియ ఏసి వెంట్స్ కూడా ఉన్నాయి.

మహీంద్రా మరాజొ ఇంటీరియర్ రివీల్

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీని మోనోకోక్యూ ఛాసిస్ మీద నిర్మించారు. అత్యుత్తమ ధృడత్వం మరియు స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ కల్పిస్తుంది. మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని మిచిగావ్‌లోని ట్రాయ్‌లో ఉన్న మహీంద్రా నార్త్ అమెరికా టెక్నికల్ సెంటర్ మరియు చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ సెంటర్ సంయుక్తంగా అభివృద్ది చేసింది.

మహీంద్రా మరాజొ ఇంటీరియర్ రివీల్

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ వాహనాన్ని ప్రీమియం మోడల్‌గా ఈ ఏడాది పండుగ సీజన్ నాటికల్లా విడుదల చేసే అవకాశం ఉంది. మహీంద్రా మరాజొ ప్రారంభ ధర రూ. 10 లక్షల నుండి 15 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉండే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, ఇన్నోవా క్రిస్టా మరియు మారుతి ఎర్టిగా వాహనాలకు గట్టి పోటీనివ్వనుంది.

మహీంద్రా మరాజొ ఇంటీరియర్ రివీల్

మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ ఇంజన్ స్పెసిఫికేషన్స్ వివరించలేదు. అయితే, సాంకేతికంగా ఇందులో 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 121బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా మరాజొ ఇంటీరియర్ రివీల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా మరాజొ కంపెనీ యొక్క ప్రీమియం ఎమ్‌పీవీ. ఇది విపణిలో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పీవీకి సరాసరి పోటీనివ్వనుంది. భద్రత, అత్యాధునిక ఫీచర్లు, విలాసవంతమైన సీటింగ్ అన్నింటికీ మించి ధరను ఆయుధంగా చేసుకుని ఎమ్‌పీవీ సెగ్మెంట్లోకి ప్రవేశించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra Marazzo Interior Revealed Ahead Of Launch
Story first published: Friday, August 10, 2018, 10:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X