మహీంద్రా టియువి300 ప్లస్ విడుదల: ధర మరియు ఇతర వివరాలు

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి టియువి300 ప్లస్ ఎస్‌యూవీని లాంచ్ చేసినట్లు ప్రకటించింది. మహీంద్రా 9-సీటర్ టియువి300 ప్లస్ మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

By Anil Kumar

దేశీయ అగ్రగామి ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి టియువి300 ప్లస్ ఎస్‌యూవీని లాంచ్ చేసినట్లు ప్రకటించింది. మహీంద్రా 9-సీటర్ టియువి300 ప్లస్ మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి, పి4, పి6 మరియు పి8.

కుటుంబ సమేతంగా గరిష్టంగా తొమ్మిది మంది వరకు ప్రయాణించే అవకాశం ఉన్న టియువి300 ప్లస్ ధరలు మరియు పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

మహీంద్రా టియువి300 ప్లస్

మహీంద్రా టియువి300 ప్లస్ ధరలు వేరియంట్ల వారీగా...

  • పి4 వేరియంట్ ధర రూ. 9.47 లక్షలు
  • పి6 వేరియంట్ ధర రూ. 9.83 లక్షలు
  • పి8 వేరియంట్ ధర రూ. 10.86 లక్షలు
  • అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ముంబాయ్‍‌)గా ఇవ్వబడ్డాయి.
    మహీంద్రా టియువి300 ప్లస్

    మహీంద్రా టియువి300 ప్లస్ అన్ని వేరియంట్లు కూడా ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతున్నాయి. అవి, మాజెస్టిక్ సిల్వర్, బోల్డ్ బ్లాక్, డైనమో రెడ్, మోల్టన్ ఆరేంజ్ మరియు గ్లేజియర్ వైట్.

    మహీంద్రా టియువి300 ప్లస్

    మహీంద్రా టియువి300 ప్లస్ నిజానికి కొత్త మోడల్ కాదు, ఇది వరకు మహీంద్రా లైనప్‌లో ఉన్న సబ్-4-మీటర్ ఎస్‌యూవీ టియువి300 యొక్క పొడగించబడిన వెర్షన్. ఈ 9-సీటర్ ఎస్‌యూవీ టియువి300 యొక్క ఫ్రంట్ డిజైన్, బాడీ ప్యానల్స్ మరియు ఎన్నో డిజైన్ అంశాలను పంచుకుంది.

    మహీంద్రా టియువి300 ప్లస్

    మహీంద్రా టియువి300 ప్లస్ ఎస్‌యూవీలో సాంకేతికంగా 2.2-లీటర్ కెపాసిటి గల ఎమ్‌హాక్ డి120 డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    మహీంద్రా టియువి300 ప్లస్

    మహీంద్రా తమ టియువి300 ప్లస్ 9-సీటర్ ఎస్‌యూవీలో మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీ మరియు బ్రేక్ పవర్ రీజనరేషన్ సాంకేతికతను కూడా అందించింది. అంతే కాకుండా, అత్యుత్తమ మైలేజ్ పొందడానికి ఇకో డ్రైవింగ్ మోడ్ జోడించింది.

    మహీంద్రా టియువి300 ప్లస్

    ఇటలీకి చెందిన, మహీంద్రా కొనుగోలు చేసిన పినిన్ఫారినా కంపెనీ డిజైన్ బృందం మహీంద్రా టియువి300 ప్లస్ ఇంటీరియర్‌ను డెవలప్ చేసింది. ఇంటీరియర్‌లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ఫాక్స్ లెథర్ సీట్లు, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, జీపీఎస్ మరియు ఇతర కనెక్టివిటి ఫీచర్లు ఉన్నాయి.

    మహీంద్రా టియువి300 ప్లస్

    మహీద్రా టియువి300 ప్లస్ ఎస్‌యూవీలో స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, రియర్ డీఫాగర్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్, రియర్ వైపర్లు,ముందు వరుస సీట్లకు ఆర్మ్ రెస్ట్, ఫాలో-మి-హోమ్ హెడ్‌ల్యాంప్స్ ఇంకా ఎన్నో పీచర్లను గుర్తించవచ్చు.

    మహీంద్రా టియువి300 ప్లస్

    మహీంద్రా ఆటోమోటివ్ సేల్స్ మరియు మార్కెటింగ్ ఛీఫ్ వీజయ్ రామ్ నక్రా మాట్లాడుతూ, "కుటుంబ సమేతంగా ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడే కస్టమర్ల కోసం విశాలమైన, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్‌తో 9-మంది ప్రయాణించే సీటింగ్ లేఔట్లో అత్యంత శక్తివంతమైన మరియు అసలైన ఎస్‌యూవీ టియువి300 ప్లస్‌ను విపణిలోకి ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇది భారతీయుల నూతన జీవనశైలికి అద్దం పడుతుందని వివరించాడు."

    మహీంద్రా టియువి300 ప్లస్

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    మహీంద్రా ఇండియన్ మార్కెట్లోకి పలు నూతన మోడళ్లను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. టియువి300 ప్లస్ ఎస్‌యూవీని మొదటి మోడల్‌గా లాంచ్ చేసి, తర్వాత యు321 కోడ్ పేరుతో డెవలప్ చేసి పరీక్షిస్తున్న ఎమ్‌పీవీని లాంచ్ చేయనుంది.

    మహీంద్రా టియువి300 ప్లస్ మార్కెట్లో ఉన్న రెనో లాజీ మరియు మారుతి సుజుకి ఎర్టిగా మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra TUV300 Plus Launched In India; Prices Start At Rs 9.47 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X