రాజస్థాన్ ఎడారుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700కు రహస్య పరీక్షలు

మహీంద్రా తమ సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ఎస్‌యూవీని రాజస్థాన్ ఎడారుల్లో అత్యంత రహస్యంగా పరీక్షిస్తోంది.

By Anil Kumar

దేశీయ దిగ్గజ ఎస్‌యూవీ వాహన తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా తమ సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని ఆటో ఎక్స్ పో 2018లో ఆవిష్కరించింది. విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ఎస్‌యూవీని రాజస్థాన్ ఎడారుల్లో అత్యంత రహస్యంగా పరీక్షిస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా అండ్ మహీంద్రా సిద్దం ఈ ఎక్స్‌యీవీ700 వాహనం మార్కెట్లో ఉన్న ఎక్స్‌యూవీ500 పై స్థానాన్ని భర్తీ చేస్తుంది. దీనిని లాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా నిర్మించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా ఎక్స్‌యూవీ700 పొడవు 4,850ఎమ్ఎమ్, వెడల్పు 1,960ఎమ్ఎమ్ మరియు ఎత్తు 1,825ఎమ్ఎమ్‌గా ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 వీల్ బేస్ ఇదే సెగ్మెంట్లో పోటీగా ఉన్న టయోటా ఫార్చ్యూనర్ కంటే అధికంగా ఉండనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా ఎక్స్‌యూవీ700లో ముందు మరియు వెనుక వైపున పెద్ద పరిమాణంలో ఉన్న బంపర్లు, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న సరికొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, అధునాతన ఫ్రంట్ గ్రిల్ మరియు క్రోమ్ డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

ఎక్స్‌యూవీ700లో పెద్ద పరిమాణంలో ఉన్న వీల్ ఆర్చెస్, అల్లాయ్ వీల్స్, పదునైన క్యారెక్టర్ లైన్స్ మరియు స్లోపింగ్ రూఫ్‌‌లైన్ వంటివి ఉన్నాయి. అదే విధంగా ఎస్‌యూవీ రియర్ డిజైన్‌లో ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ మరియు ఎల్ఇడి స్టాప్ లైట్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఇంటీరియర్‌లో నప్పా లెథర్ వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, జీపీఎస్ న్యావిగేషన్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌‍యూవీలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి అప్లికేష్లను సపోర్ట్ చేయగల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

భద్రత పరంగా మహీంద్రా ఎక్స్‌యూవీ700లో తొమ్మిది ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, 360-డిగ్గీ కెమెరా మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లతో రానుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా నుండి వస్తోన్న సరికొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ఎస్‌యూవీలో ఉన్న అదే మునుపటి డీజల్ ఇంజన్‌తో రానుంది. సాంకేతికంగా ఇందులోని 2.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్బో-డీజల్ ఇంజన్ గరిష్టంగా 178బిహెచ్‌పి పవర్ మరియు 480ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

స్పోర్టివ్ మరియు సులభతరమైన రైడింగ్ అనుభవం కల్పించేందుకు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో ఈ ఎస్‌యూవీని ఎంచుకోవచ్చు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎత్తైన సీటింగ్ పొజిషన్ మరియు కండలు తిరిగిన శరీరాకృతిని కలిగి ఉంటుంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు హ్యుందాయ్ టుసాన్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Source: 4x4 India

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra XUV700 Spied Testing In Desert Heat — Will Rival The Toyota Fortuner
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X