ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్ పోటీని సిద్దం చేసిన మహీంద్రా

మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. రానున్న మూడు నెలల్లోపు ప్రీమియం ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో విడుదలకు చేయనున్నట్

By Anil Kumar

మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. రానున్న మూడు నెలల్లోపు ప్రీమియం ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో విడుదలకు చేయనున్నట్లు సమాచారం. శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ఎస్‌యూవీ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్‌ను తొలుత 2018 ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఆవిష్కరించారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మరియు గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఎక్సిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ వాధేరా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, "అతి త్వరలో మహీంద్రా విడుదల చేయనున్న ఉత్పత్తుల్లో రెక్ట్సాన్ యొక్క జి-4 వెర్షన్ ఒక మోడల్. శాంగ్‌యాంగ్ భాగస్వామ్యంతో ఒక నూతన ఫ్లాట్‌ఫామ్ క్రింద అభివృద్ది చేసినట్లు చెప్పుకొచ్చాడు."

మహీంద్రా ఎక్స్‌యూవీ700

మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ విపణిలో ఉన్న ఎక్స్‌యూవీ500 పై స్థానాన్ని భర్తీ చేస్తుంది. మరియు ఇది పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే, కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన, ప్రీమియం మరియు హై మోడల్‌గా నిలవనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీతో పాటు మరో రెండు మోడళ్లను కూడా విడుదల చేసే ప్రణాళికల్లో ఉంది. ఎస్201 పేరుతో రూపొందించిన కాంపాక్ట్ ఎస్‌‌యూవీ ఇటీవల ఆవిష్కరించిన మరాజొ ఎమ్‌పీవీ. ఈ మూడు మోడళ్లు కూడా 2018లోపే లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో సాంకేతికంగా 2.2-లీటర్ కెపాసిటి గల టుర్భో-డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 180బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 4 వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

ఎక్స్‌యూవీ700 మోడల్‌ను కంపెనీ యొక్క బాడీ-ఆన్-ఫ్రేమ్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. దీని వీల్ బేస్ సుమారు 2,865ఎమ్ఎమ్‌గా ఉంది. ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో ఆటోమేటిక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పగటి పూట వెలిగే లైట్లు మరియు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 5-స్పోక్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు పవర్ టెయిల్ గేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, 9-ఎయిర్ బ్యాగులు ఇంకా ఎన్నో అధునాతన ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

ఆరు నుండి ఏడు మంది ప్రయాణించే విధంగా సౌకర్యవంతమైన మూడు వరుసల సీటింగ్ లేఔట్‌ కలదు. ఇది విపణిలో ఉన్న ఫోర్డ్ ఎండీవర్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు ఇసుజు ఎమ్‌యు-ఎక్స్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది. మరియు సుమారుగా రూ. 20 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ700

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు ఖరీదైన ప్రీమియం ఎస్‌యూవీల విభాగంలోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా, శాంగ్‌యాంగ్ అభివృద్ది చేసిన స్మూత్ డ్రైవింగ్ కల్పించే 2.2-లీటర్ ఇంజన వస్తోంది.

Source: ET Auto

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra XUV700 India Launch Reportedly Scheduled In The Next Three Months
Story first published: Thursday, August 2, 2018, 10:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X