బాలెనో ఫేస్‌లిఫ్ట్ సిద్దం చేస్తున్న మారుతి సుజుకి

మారుతి సుజుకి బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను 2015 అక్టోబరులో విడుదల చేసింది. ఇది విడుదలైనప్పటి నుండి ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మ

By Anil Kumar

మారుతి సుజుకి బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను 2015 అక్టోబరులో విడుదల చేసింది. ఇది విడుదలైనప్పటి నుండి ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మారుతి తమ బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌‌ను ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్

మారుతి సిద్దం చేస్తున్న బాలెనో ప్రీమియం హ్యాచ్‍‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వేరియంట్‌ను 2019 మొదటి త్రైమాసికంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అంతే కాకుండా, సరికొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్‌‌ను నూతన డీజల్ ఇంజన్ కూడా అందించే అవకాశం ఉంది. అయితే, అదే మునుపటి పెట్రోల్ ఇంజన్‌తో రానుంది.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి ఇండియా ఇంజనీరింగ్ బృందం అభివృద్ది చేసిన స్వదేశీ 1.5-లీటర్ డీజల్ ఇంజన్ మునుపటి 1.3-లీటర్ డీజల్ ఇంజన్ స్థానాన్ని భర్తీ చేయనుంది. పెట్రోల్ వెర్షన్ మారుతి బాలెనో అదే 1.2-లీటర్ కె-సిరీస్ ఇంజన్‌‌లో రానుంది.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం ఉన్న 1.3-లీటర్ డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు పెట్రోల్ ఇంజన్ 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, నూతన 1.5-లీటర్ డీజల్ ఇంజన్ పవర్ మరియు టార్క్ వివరాలు ఇంకా వెల్లడవ్వలేదు.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్

మారుతి అభివృద్ది చేస్తున్న 1.5-లీటర్ డీజల్ నూతన బిఎస్-VI ఉద్గార ప్రమాణాలను పాటిస్తుంది. 2020 నాటికి మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో అన్ని ఇంజన్‌లు కూడా ఈ ఇంజన్‌ను వినియోగించుకోనున్నాయి. బాలెనో ఫేస్‌లిఫ్ట్ కంటే ముందుగా సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మరియు ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ కార్లను లాంచ్ చేయనుంది.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్

సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మరియు ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ కార్లలో నూతన 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వస్తుందా... లేదంటే అదే మునుపటి 1.3-లీటర్ ఇంజన్ వస్తుందా... అనేది కాస్త ఆశ్చర్యకరంగా మారింది. అంతే కాకుండా, నూతన 1.5-లీటర్ ఇంజన్‌తో అందించే కార్ల కోసం అదనంగా మరో ప్రొడక్షన్ ప్లాంటును నిర్మించుకోనుంది. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ప్రొడక్షన్ సెప్టెంబర్ 2018 నుండి ప్రారంభ కానుంది.

మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లోని బెస్టె సెల్లింగ్ కార్లలో బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఒకటిగా నిలిచింది. ఇందులో, మార్కెట్ అవసరాల దృష్ట్యా ప్రీమియం ఇంటీరియర్ మరియు అసమానమైన ఇంధన సామర్థ్యం వంటివి బాలెనో సక్సెస్‌కు కారణమయ్యాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీదారులను ఎదుర్కుని నూతన కస్టమర్లను ఆకట్టుకునేందుకు బాలెనో ఫేస్‌లిఫ్ట్ కారును సిద్దం చేస్తోంది. దీనిని 2019 మొదటి త్రైమాసికం నాటికి విడుదల చేసే అవకాశం ఉంది.

Source: TeamBHP

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Baleno Facelift To Get New Diesel Engine — Launch Details Revealed
Story first published: Tuesday, April 17, 2018, 17:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X