సరికొత్త వై1కెహ్యాచ్‌బ్యాక్ ఖరారు చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి త్వరలో అతి చిన్న స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును విపణిలోకి ప్రవేశపెట్టనుంది. వైకె1 (YK1) కోడ్ పేరుతో అభివృద్ది చేస్తున్న ఈ హ్యాచ్‌బ్యాక్ కారును 2019 నాటికి పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లో

By Anil Kumar

మారుతి సుజుకి త్వరలో అతి చిన్న స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారును విపణిలోకి ప్రవేశపెట్టనుంది. వై1కె (Y1K) కోడ్ పేరుతో అభివృద్ది చేస్తున్న ఈ హ్యాచ్‌బ్యాక్ కారును 2019 నాటికి పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది.

మారుతి సుజుకి కార్ల జాబితాలోని ఆల్టో కారు పై స్థానాన్ని భర్తీ చేయనుంది. బహుశా దీనిని వచ్చే ఏడాది పండుగ సీజన్‌లో దీపావళి పర్వదినాన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

మారుతి నుండి సరికొత్త వై1కె స్మాల్ కారు

సమాచార వర్గాల కథనం మేరకు, మారుతి వై1కె మోడల్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన ఫ్యూచర్ ఎస్-కాన్సెప్ట్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ అని తెలుస్తోంది.

మారుతి నుండి సరికొత్త వై1కె స్మాల్ కారు

మారుతి వై1కె హ్యాచ్‌బ్యాక్ ఎస్‌యూవీ డిజైన్ తరహా అంశాలతో రానుంది. అంటే, ప్రస్తుతం విపణిలో ఉన్న రెనో క్విడ్ కారు శైలిలో. ఇది చెప్పుకోవడానికి స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు అయినప్పటికీ ఎస్‌యూవీ లుక్ కలిగి ఉంటుంది.

మారుతి నుండి సరికొత్త వై1కె స్మాల్ కారు

ఆల్టో మరియు ఇగ్నిస్ మధ్య స్థానాన్ని భర్తీ చేయనున్న మారుతి వై1కె మోడల్ దేశీయంగా మారుతి సుజుకి ఉత్పత్తుల మధ్యనున్న దూరాన్ని భర్తీ చేస్తుంది. మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఉన్న ఆల్టో మరియు స్విఫ్ట్ నుండి సేకరించిన పలు డిజైన్ అంశాలను వై1కె మోడల్‌లో అందించే అవకాశం ఉంది.

మారుతి నుండి సరికొత్త వై1కె స్మాల్ కారు

సాంకేతికంగా మారుతి వై1కె హ్యాచ్‌బ్యాక్‌లో 1.0-లీటర్ సామర్థ్యం గల కె10 సిరీస్ పెట్రోల్ ఇంజన్ రానుంది. ఏదేమైనప్పటికీ, ఈ ఇంజన్ రాబోయే బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించనుంది. అంతే కాకుండా 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌లతో రానుంది.

మారుతి నుండి సరికొత్త వై1కె స్మాల్ కారు

మారుతి సుజుకి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్ల జాబితాలో ఉన్నటువంటి 1.0-లీటర్ ఇంజన్ గరిష్టంగా 68బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అత్యుత్తమ మైలేజ్‌కు ఈ ఇంజన్ పెట్టింది పేరు.

మారుతి నుండి సరికొత్త వై1కె స్మాల్ కారు

సరికొత్త మారుతి వై1కె హ్యాచ్‌బ్యాక్‌లో భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లు తప్పనిసరిగా రానున్నాయి. భారత్‌లో అతి త్వరలో అమల్లోకి రానున్న నూతన భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఫీచర్లను అందవ్వనుంది.

మారుతి నుండి సరికొత్త వై1కె స్మాల్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి కంపెనీకి దేశవ్యాప్తంగా విస్తృతమైన డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఉండటంతో మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి కారు మంచి విజయాన్ని అందుకుంటోంది. అయితే, గతంలో ప్రవేశపెట్టిన జెన్ పేరుతో వై1కె హ్యాచ్‌బ్యాక్ కారును విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి సుజుకి ఇండియాకు మరో సంచలనాత్మక ఉత్పత్తి అవ్వడం ఖాయం.

మారుతి నుండి సరికొత్త వైకె1 స్మాల్ కారు

మారుతి సుజుకి వైకె1 హ్యాచ్‌బ్యాక్ పూర్తి స్థాయిలో విడుదలైతే, ప్రస్తుతం ఉన్న రెనో క్విడ్ మరియు హ్యుందాయ్ అతి త్వరలో విడుదల చేయనున్న స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారుకు గట్టి పోటీనివ్వనుంది.

Source: Economic Times

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Y1K Hatchback Launch Confirmed — To Bring Back The Zen Nameplate
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X