మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 - తుది ఫలితాలు

దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి మరియు అంతర్జాతీయ ముడి చమురు మరియు గ్యాస్ సంస్థ ఎగ్జాన్ మొబిల్ సంయుక్తంగా నిర్వహించిన 16 ఎడిషన్ డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ ఎట్టకేలకు విజయవంతంగా పూర

By Anil Kumar

దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి మరియు అంతర్జాతీయ ముడి చమురు మరియు గ్యాస్ సంస్థ ఎగ్జాన్ మొబిల్ సంయుక్తంగా నిర్వహించిన 16 ఎడిషన్ డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ ఎట్టకేలకు విజయవంతంగా పూర్తయ్యింది.

డెసర్ట్ స్టార్మ్ 2018 ఐదవ స్టేజ్ మొత్తం 105 కిలోమీటర్ల మేర కుచ్రి మరియు అసుటార్ ప్రాంతాల మధ్య జరిగింది. స్టేజ్ 5 ర్యాలీ అనంతరం నిర్వాహకులు విజేతలను ప్రకటించారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

ఎక్స్‌ట్రీమ్ కెటగిరీలో అభిషేక్ మిశ్రా మరియు కో-డ్రైవర్ వేణు రామస్వామి టీమ్ గెలుపొందింది. సెకండ్ స్టేజ్ ర్యాలీలో సురేష్ రాణా నిష్క్రమించినప్పటి నుండి అభిషేక్ మిశ్రానే ఆధిక్యంలో కొనసాగాడు. రాజ్ సింగ్ రాథోర్ మరియు కో-డ్రైవర్ సాగర్ మల్లప్ప రన్నరప్‌గా నిలవగా, నిజు పాడియా మరియు కో-డ్రైవర్ నిరవ్ మెహ్తా ఫైనల్ పోడియమ్ వద్ద నిలిచారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

మోటో శ్రేణిలో, అంగాటా రేసింగ్ బృందానికి చెందిన అరోనే మరే విజేతగా నిలవగా, టీవీఎస్ రేసింగ్ రైడర్ లోరెంజో శాంటోలినో ద్వితీయ స్థానానికి పరిమితమయ్యాడు. థార్ ఎడారిలో విజయం కోసం ఇరు రైడర్ల మధ్య పోటీ ముమ్మరంగానే సాగింది. మూడవ స్థానం అంగాటా రేసింగ్ టీమ్ రేసర్ సంజయ్ కుమార్‌కు దక్కింది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

ఎన్‌డ్యూర్ శ్రేణిలో ఆశిష్ బుదియా కో-డ్రైవర్ అరిందమ్ ఘోష్ దిగ్విజయం సాధించారు. మరియు ఎక్స్‌ప్లోర్ కెటగిరీలో నిపున్ అగర్వాల్ కో-డ్రైవర్ కబీర్ మనషర్మణి మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. మొత్తానికి అత్యంత ఉష్ణోగ్రతతో కూడా వాతావరణంలో చాలా ఆశ్చర్యకరంగా ర్యాలీ ముగిసింది.

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 తుది ఫలితాలు:

ఎక్స్‌ట్రీమ్

1. అభిషేక్ మిశ్రా, వి వేణు రమేష్‌కుమార్ (#103)

2. రాజ్ సింగ్ రాథోర్, సాగర్ మల్లప్ప (#102)

3. నిజు పాడియా, నిరవ్ మెహ్తా (#106)

మోటో

1. అరోన్ మరేరా (#3)

2. లొరెంజో శాంటోలినో (#2)

3. సంజయ్ కుమార్ (#6)

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

ఎక్స్‌ప్లోర్

1. నిపున్ అగర్వాల్, కబీర్ మనషర్మణి (#301)

2. సురేంద్ర గోపు, హర్దీప్ సింగ్ (#307)

3. మనోజ్ వైద్య, సుక్రితి గోయెల్ (#317)

ఎన్‌డ్యూర్

1. ఆశిష్ బుధియా, అరిందమ్ ఘోష్

2. రుచిత్ జాడ్వా, ఆదిత్య గర్గ్

3. గుర్పిందర్ సింగ్, మ్రిన్మోయ్ సాహ

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ ఇండియాలో అత్యంత కఠినమైన మరియు అతి పెద్ద ర్యాలీ. అత్యధిక ఉష్ణోగ్రతలు మరియు ఇసుకతో కూడిన భూబాగాల్లో మీదుగా సాగే డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీ 16 ఎడిషన్ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఎన్నో ఆశలతో వచ్చిన పోటీదారుల మధ్య ఐదు దశలలో జరిగిన ర్యాలీ ఎన్నో అనుభవాలను మరెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ర్యాలీ అనుభవజ్ఞులైన డకార్ ర్యాలీ

ఛాంపియన్ సిఎస్ సంతోష్ మరియు 2016 డెసర్ట్ స్టార్మ్ ర్యాలీ విజేత సురేష్ రాణా ర్యాలీ నుండి అనూహ్యంగా నిష్క్రమించినప్పటికీ ఇతర పోటీదారులతో ఎంతో రసవత్తరంగా ముగిసింది. డ్రైవ్‌స్పార్క్ బృందం మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ర్యాలీని రాజస్థాన్‌లోని థార్ ఎడారులో ప్రత్యేక కవరేజ్ చేసింది. ర్యాలీ ఫోటోలను క్రింది గ్యాలరీ ద్వారా వీక్షించగలరు...

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Desert Storm 2018 Powered By ExxonMobil: Final Results
Story first published: Monday, March 26, 2018, 18:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X