మారుతి సుజుకి డెసర్ట్ స్టార్ట్ 2018 అప్‌డేట్స్: స్టేజ్ 3లో ర్యాలీ నుండి వైదొలగిన సిఎస్ సంతోష్

భారతదేశపు అతి పెద్ద ర్యాలీ మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 మూడవ స్టేజ్ ర్యాలీ పూర్తి చేసుకుంది. దేశీయ అత్యంత పొడవైన క్రాస్-కంట్రీ ర్యాలీ డెసర్ట్ స్టార్మ్ 2018ని మారుతి సుజుకి మరియు ఎగ్జాన్ మొబిల్

By Anil Kumar

భారతదేశపు అతి పెద్ద ర్యాలీ మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 మూడవ స్టేజ్ ర్యాలీ పూర్తి చేసుకుంది. దేశీయ అత్యంత పొడవైన క్రాస్-కంట్రీ ర్యాలీ డెసర్ట్ స్టార్మ్ 2018ని మారుతి సుజుకి మరియు ఎగ్జాన్ మొబిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. జైసల్మీర్ నుండి ప్రారంభమైన ర్యాలీ స్టేజ్ 3 పూర్తి చేసుకుని అసుటార్‌ ప్రదేశాన్ని చేరుకుంది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

డెసర్ట్ స్టార్మ్ 2018లో ఇసుకు దిబ్బలు మరియు అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన 200కిలోమీటర్ల ప్రత్యేక మారథాన్ కూడా ఉంది. మూడవ స్టేజ్ జరిగిన ఇదే రోజున ఓవరాల్ లీడర్‌బోర్డ్ పొజిషన్ విషయంలో పెద్ద తతంగమే సాగింది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

ర్యాలీ ప్రియులు ఊహించని విధంగా డకార్ ర్యాలీలో పాల్గొన్న సిఎస్ సంతోష్ అనూహ్యంగా ఈ స్టేజ్ 3 ర్యాలీతో డెసర్ట్ స్టార్మ్ 2018 నుండి నిష్క్రమించాడు. అనుకోకుండా ఎదురైన పెద్ద ఇసుక దిబ్బను గుర్తించలేకపోయాడు, దీంతో తాను రైడ్ చేస్తున్న బైక్ పెద్ద ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో మెడ దగ్గర గాయమై ర్యాలీ నుండి వైదొలిగాడు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

ఎక్స్‌ట్రీమ్ కెటగిరీలో, మారుతి సుజుకి మోటార్‌స్పోర్ట్స్ మరియు డిఫెండింగ్ ఛాంపియన్ సురేశ్ రాణా (కో-డ్రైవర్ పి.వి శ్రీనివాస్ మూర్తి) బృందానికి చెందిన ఇంజన్ ఫెయిల్ కావడంతో ర్యాలీ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ ఘటనతో ర్యాలీ లీడర్ అభిషేక్ మిశ్రా (కో-డ్రైవర్ వేణు రామ్‌కుమార్) మరియు సురేశ్ రాణా మధ్య ఉన్న ఉద్వేగభరితమైన యుద్దానికి తెర పడింది.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

రాణా మరియు మిశ్రా టీమ్‌లు ర్యాలీ నుండి వైదొలగడంతో 25 నిమిషాల ఆధిక్యంతో రాజ్ సింగ్ రాథోర్ (కో-డ్రైవర్ సాగర్ మల్లప్ప) ముందంజలో ఉన్నారు. మారుతి సుజకి మోటార్‌స్పోర్ట్స్ బృందానికి చెందిన ధర్మపాల్ జాంగ్రా (కో-డ్రైవర్ హరికృష్ణన్) మూడవ స్థానానికి చేరుకున్నారు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

మోటో కెటగిరీలో, సిఎస్ సంతోష్ ప్రమాదానికి గురికావడంతో అంగాటా రేసింగ్ బృందానికి చెందిన ఆరోన్ మారె ఆధిక్యంలోకి వచ్చాడు. మొదటి మరియు రెండవ స్టేజ్ ర్యాలీలో సిఎస్ సంతోష్ మరియు అరోన్‌ల మధ్య పోటీ తారా స్థాయిలో ఉండేది.

టీవీఎస్ రేసింగ్ రైడర్ లొరెంజో శాంటోలిన్ రెండవ స్థానానికి చేరుకున్నాడు. అంతే కాకుండా, థర్డ్ స్టేజ్ ర్యాలీలో లొరేంజో ఫాస్టెస్ట్ రైడర్‌గా నిలిచాడు. అంగాటా రేసింగ్ రైడర్ సంజయ్ కుమార్ ర్యాలీలో మూడవ స్థానంలో నిలిచాడు.

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018 ఫలితాలు

మోటో కెటగిరీలో:

1. అరోనే మారె (#3) 05:29:39

2. శాంటోలిన్ లొరెంజో (#2) 05:42:49

3. సంజయ్ కుమార్ (#6) 05:51:05

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

ఎక్స్‌ట్రీమ్ కెటగిరీలో:

1. అభిషేక్ మిశ్రా, వి వేణు రమేష్ కుమార్ (#103) 06:55:38

2. రాజ్ సింగ్ రాథోర్, సాగర్ మల్లప్ప (#2) 05:42:49

3. ధర్మపాల్ జాంగ్రా, హరికృష్ణన్ (#6) 05:51:05

మారుతి సుజుకి డెసర్ట్ స్టార్మ్ 2018

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి మరియు ఎగ్జాన్ మొబిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డెసర్ట్ స్టార్మ్ 2018 స్టేజ్ 3 ర్యాలీ డ్రామాను తలపించింది. అనుకోకుండా జరిగిన సంఘటనల కారణంగా ఎక్స్‌ట్రీమ్ మరియు మోటో కెటగెరిలీలోని కీలకమైన పోటీదారులు ర్యాలీ నుండి తప్పుకోవాల్సి వచ్చంది. మూడవ స్టేజ్ ర్యాలీ మొత్తం విపరీతమైన ఉష్ణోగ్రతా వాతావరణంలో జరిగింది.

నాలుగవ స్టేజ్ ర్యాలీ రెండు భాగాలుగా విభజించి నిర్వహించనున్నారు. భువాన్, అసుటార్ మరియు మజిద్ కి బస్తి ప్రాంతాల్లో సుమారుగా 452కిలోమీటర్ల మేర ర్యాలీ సాగనుంది.స్టేజ్ 4 ర్యాలీ ఫలితాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి....

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Desert Storm 2018 Powered By ExxonMobil: Stage 3 Results
Story first published: Saturday, March 24, 2018, 10:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X