దేశవ్యాప్తంగా మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్న మారుతి

మారుతి సుజుకి దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని సేల్స్ మరియు సర్వీసింగ్ సెంటర్లలో మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న మారుతి నెక్సాన్ మరియు అరెనా షోరూముల్లో జూలై 9,

By Anil Kumar

మారుతి సుజుకి దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని సేల్స్ మరియు సర్వీసింగ్ సెంటర్లలో మాన్‌సూన్ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న మారుతి నెక్సాన్ మరియు అరెనా షోరూముల్లో జూలై 9, 2018 నుండి 30 వరకు ఈ క్యాంప్ నిర్వహిస్తారు.

మారుతి సుజుకి సర్వీస్ క్యాంప్

మాన్‌సూన్ సర్వీస్ క్యాంపులో భాగంగా, పూర్తి వెహికల్ చెక్-అప్ నిర్వహిస్తారు. అంతే కాకుండా, పలు రకాల సర్వీసులను కూడా అందించి మరియు ఈ వర్షాకాలం సీజన్‌ను ఎదుర్కోవడానికి కార్లను పూర్తి స్థాయిలో సంసిద్దంగా ఉన్నాయో లేదో పరీక్షిస్తారు.

మారుతి సుజుకి సర్వీస్ క్యాంప్

బ్రేకులు, మిర్రర్స్, బ్యాటరీస ఎలక్ట్రికల్ సిసట్మ్, టైర్లు ఇంకా మరెన్నో ప్రధాన విభాగాలను మారుతి సుజుకి పరీక్షిస్తుంది. అన్ని కార్లు మాన్‍‌సూన్‌ సీజన్‌ ఎదుర్కునేలా అనుభవజ్ఞులైన నిపుణులు చెక్-అప్స్ నిర్వహిస్తారు.

మారుతి సుజుకి సర్వీస్ క్యాంప్

సర్వీస్ చెక్-అప్ లతో పాటు కంపెనీ వివిధ రకాల విడి భాగాలు మరియు యాక్ససరీల మీద డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ వర్షా కాలంలో రోడ్డెక్కే ప్రతి మారుతి సుజుకి కారు కూడా వీలైనంత వరకు మంచి కండీషన్‌లో ఉండాలనే ఉద్దేశ్యంతో ముందస్తుగా ఈ మాన్‌సూన్ చెక్-అప్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు మారుతి సుజుకి ఓ ప్రకటనలో వెల్లడించింది.

మారుతి సుజుకి సర్వీస్ క్యాంప్

మారుతి సుజుకి భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ. దాదాపు అన్ని సెగ్మెంట్లలో కూడా మారుత ఉత్పత్తులే మొదటి స్థానంలో ఉన్నాయి. గడిచిన జూన్ 2018లో 1,44,981 యూనిట్ల ప్యాసింజర్ కార్లను విక్రయించింది. జూన్ 2017తో పోల్చుకుంటే ఏకంగా 36 శాతం వృద్ది సాధించింది.

మారుతి సుజుకి సర్వీస్ క్యాంప్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 ప్రారంభం నుండి మారుతి సుజుకి మరింత బలమైంది. కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో కొత్త తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును మరియు ఇటీవల బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వితారా బ్రిజాను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదల చేసింది.

మారుతి సుజుకి సర్వీస్ క్యాంప్

మారుతి సుజుకి అతి త్వరలో మరో రెండు కొత్త ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎర్టిగా ఎమ్‌పీవీ మరియు సియాజ్ మిడ్ సైజ్ సెడాన్ కారును ఈ ఏడాది పండుగ సీజన్‌లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Starts Monsoon Service Camp Across All Its Centres In India
Story first published: Tuesday, July 10, 2018, 13:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X