మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

లేటెస్ట్ జనరేషన్ సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ కారును జపాన్ దిగ్గజం సుజుకి తొలిసారిగా 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో లో ఆవిష్కరించింది. 2018 మలిసగంలో యూరోపియన్ మార్కెట్లో ఈ హాట్ హ్య

By Anil Kumar

లేటెస్ట్ జనరేషన్ సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ కారును జపాన్ దిగ్గజం సుజుకి తొలిసారిగా 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో లో ఆవిష్కరించింది. 2018 మలిసగంలో యూరోపియన్ మార్కెట్లో ఈ హాట్ హ్యాచ్‌బ్యాక్ విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

అంతర్జాతీయ మార్కెట్లో అతి త్వరలో విడుదల కానున్న సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఇండియా విడుదల కూడా ఖరారైనట్లు సమాచారం. మరి ఇది నిజంగానే దేశీయ విపణిలోకి విడుదలైతే ఎలా ఉంటుందో తెలుసా....? స్విప్ట్ స్పోర్ట్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి స్టోరీలో...

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

2018 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ రెగ్యులర్ స్విఫ్ట్ కారుతో పోల్చుకుంటే అగ్రిసివ్ డిజైన్ శైలిలో ఉంటుంది. పేరులోనే స్పోర్ట్ ఉంది కాబట్టి, స్పోర్టి తత్వం కోసం విభిన్న కొలతల్లో స్విఫ్ట్ స్పోర్ట్‌ను నిర్మించారు. కొత్త తరం స్విఫ్ట్ స్పోర్ట్ పొడవు 3,890ఎమ్ఎమ, వెడల్పు 1,735ఎమ్ఎమ్ మరియు ఎత్తు 1,495ఎమ్ఎమ్.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

అదే విధంగా స్విఫ్ట్ స్పోర్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ రెగ్యులర్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ గ్రౌండ్ క్లియరెన్స్ 163ఎమ్ఎమ్ కంటే తక్కువ 120ఎమ్ఎమ్‌గా ఉంది. కానీ, రెండు హ్యాచ్‌‌బ్యాక్ మోడళ్లలో వీల్ బేస్ 2,450ఎమ్ఎమ్ స్టాండర్డ్‌గా ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

సరికొత్త సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఎక్ట్సీరియర్‌లో డిజైన్ పరంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకర్షణీయమైన స్టైకింగ్ ఫ్రంట్ గ్రిల్, అధునాతన ఫ్రంట్ బంపర్ మరియు పదునైన క్యారెక్టర్ లైన్స్ గుర్తించవచ్చు. ప్రత్యేకించి సూపర్ కార్ల తరహాలో వెనుక వైపున డ్యూయల్ ఎగ్జాస్ పైపులు స్విప్ట్ స్పోర్ట్‌లో ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

సుజుకి స్విఫ్ స్పోర్ట్ ఇంటీరియర్‌లో ఆల్-బ్లాక్ థీమ్ ఇంటీరియర్ థీమ్ మరియు రెడ్ కలర్ హైలెట్స్ ఉన్నాయి. ఎరుపు రంగుతో దారంతో స్టిచ్చింగ్ చేయబడిన సెమీ-బకెట్ సీట్లు ఉన్నాయి. సుజుకి స్పోర్టివ్ హాట్ హ్యాచ్‌బ్యాక్‌ కారులో స్పోర్టివ్ ఫీల్‌ను మరింత పెంచే స్టెయిన్ లెస్ స్టీల్ పెడల్స్ ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇంటీరియర్‌లో డ్యూయల్-టోన్ రెడ్ టాకో మీటర్ మరియు డార్క్ సిల్వర్ స్పీడో మీటర్ ఇంస్ట్రుమెంటల్ క్లస్టర్ కలదు. అంతే కాకుండా 4.2-అంగుళాల పరిమాణంలో ఉన్న కలర్ డిస్ల్పే మరియు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

సాంకేతికంగా సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.4-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు. టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 5,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 138బిహెచ్‌పి పవర్ మరియు 2,500 to 3,500ఆర్‌పిఎమ్ మధ్య 230ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది. సుజుకి కథనం మేరకు, స్విఫ్ట్ స్పోర్ట్ కేవలం 8.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 210కిలోమీటర్లుగా ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ తరహాలోనే సుజుకి స్విప్ట్ స్పోర్ట్ హ్యాచ్‌‌బ్యాక్‌ను కూడా హార్టెక్ డిజైన్ మరియు డెవలప్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. దీంతో సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం బరువు కేవలం 970కిలోలుగా ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

సస్పెన్షన్ పరంగా స్విఫ్ట్ స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్‌లో ముందు వైపున మెక్‌పర్సన్ స్ట్రట్స్ మరియు వెనుక వైపున టార్షన్ బీమ్ ఉన్నాయి. స్విప్ట్ స్పోర్ట్ వేగానికి కళ్లెం వేసేందుకు ముందు మరియు వెనుక వైపున అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులను అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

ఇండియాలో స్పోర్టివ్ వెర్షన్‌కు దగ్గరగా ఉండే బాలెనో ఆర్ఎస్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును మారుతి సుజుకి విక్రయిస్తోంది. బాలెనో ఆర్ఎస్ కారులో కూడా అదే 1.0-లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 100బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బాలెనో కారును కూడా హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీదనే నిర్మించడంతో దీని బరువు కూడా 950కిలోలుగానే ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్: విడుదల తేదీ, ధరలు, స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ విడుదల గురించి మారుతి సుజుకి నుండి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. ఆర్ఎస్ వెర్షన్‌లో వచ్చిన బాలెనో కంపెనీకి ఆశించిన ఫలితాలు సాధించిపెట్టడం లేదు. అంతే కాకుండా బాలెనో ఆర్ఎస్ విపణిలో ఉన్న వోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ మరియు టిడిఐ మోడళ్లకు ఎలాంటి పోటీనివ్వలేకపోతోంది.

అయితే, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారుకు దేశీయ మార్కెట్లో మంచి పాపులారిటీ లభించింది. కాబట్టి, భిన్నత్వాన్ని కోరుకునే స్విఫ్ట్ ప్రేమికులు స్పోర్ట్ వెర్షన్‌ను ఖచ్చితంగా ఆదరిస్తారు.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Swift Sport: Expected Launch Date In India, Prices, Specifications, Features & More
Story first published: Saturday, May 26, 2018, 16:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X