Just In
Don't Miss
- News
Inauguration Day 2021: రేపే బైడెన్, కమల ప్రమాణస్వీకారం -కార్యక్రమ ముఖ్యాంశాలు ఇవే
- Finance
Gold prices today : బంగారం ధరల్ని అక్కడే నిలిపిన వ్యాక్సీన్!
- Sports
భారత్ పోరాటం ముందు నిలవలేకపోయాం: ఆసీస్ కెప్టెన్
- Movies
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
- Lifestyle
ఆర్థిక, రాహు-కేతు సమస్యలా? కర్పూరంలో లవంగాలు వేసి కాల్చండి .. అప్పుడు జరిగే అద్భుతాలను చూడండి .. ఆశ్చర్యపోతారు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్విఫ్ట్ మరియు డిజైర్ కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి
మారుతి సుజుకి తాజాగా విడుదల చేసిన కొత్త తరం డిజైర్ మరియు స్విఫ్ట్ కార్లను తాత్కాలికంగా రీకాల్ చేసింది. ఈ రెండు కార్లలోని ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌లో లోపాన్ని గుర్తించేందుకు రీకాల్ చేసినట్లు మారుతి పేర్కొంది.

మారుతి సుజుకి మొత్తం 1,279 యూనిట్లను రీకాల్ చేసింది. ఇందులో 566 యూనిట్ల స్విఫ్ట్ మరియు 713 యూనిట్ల డిజైర్ కార్లు ఉన్నాయి. మే 7, 2018 నుండి జూలై 5, 2018 మధ్య తయారైన కార్లు రీకాల్‌కు గురయ్యాయి.

రీకాల్‌కు గురైన కార్ల జాబితాలో ఉన్న ఓనర్లను జూలై 25, 2018 న మారుతి సుజుకి డీలర్లు స్వయంగా సంప్రదించనున్నారు. రీకాల్ అయిన కార్లను పరీక్షించి, లోపం ఉన్న విడి భాగాలను గుర్తించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చుతారు. మారుతి ఈ సర్వీస్‌ను పూర్తి ఉచితంగా అందిస్తోంది.

కస్టమర్లు మారుతి సుజుకి అఫీషియల్ వెబ్‌సైట్లో తమ కారు యొక్క ఛాసిస్ నెంబర్ ఎంటర్ చేసి, రీకాల్ జాబితాలో తమ కారు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం కస్టమర్లు తమ డీలర్లను సంప్రదించవచచ్చు.

కొత్త తరం స్విఫ్ట్ కారును మారుతి సుజుకి రీకాల్ చేయడం ఇది రెండవసారి. మే 2018లో బ్రేక్ వాక్యూమ్ హోస్‌లో లోపం కారణంగా సుమారుగా 52,000 స్విఫ్ట్ కార్లను రీకాల్ చేసింది.

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారును ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో లాంచ్ చేసింది. డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును గత ఏడాదే విపణిలోకి ప్రవేశపెట్టింది.

డిజైన్, ఫీచర్లు మరియు సేఫ్టీ పరంగా భారీ మార్పులు చేర్పులతో విడుదలైన రెండు మోడళ్లు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. మారుతి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ ఇప్పుడు ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్. మరియు స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇండియా యొక్క సెకండ్ బెస్ట్ సెల్లింగ్ కారు.

మారుతి సుజుకి 2 కోట్లు కార్లను ఉత్పత్తి చేసిన సందర్భాన్ని ఇటీవల పురస్కరించుకుంది. ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడానికి మారుతి సుజుకి కంపెనీకి సుమారుగా 34 ఏళ్ల సమయం పట్టింది. కస్టమర్ల భద్రతలో భాగంగానే రీకాల్ చేసింది.