మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

By Anil Kumar

దేశీయ వాహన పరిశ్రమ అద్భుతమైన పురోగతి సాధిస్తోంది అనడానికి ప్రతి నెలా నమోదవుతున్న ప్యాసింజర్ కార్ల సేల్స్ ఇందుకు నిదర్శనం. ఇటీవల విడుదలైన సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఏడాది టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఉన్న సేల్స్ మరియు గత ఏడాది నెలలో 10 బెస్ట్ సెల్లింగ్ కార్లతో పోల్చుకుంటే కార్ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

వీటిలో మారుతి సుజుకి కంపెనీదే పైచేయి. అవును ఏప్రిల్ 2018లో ఉన్న టాప్ కార్లలో ఏడు మారుతి కార్లే ఉన్నాయి. వాటిలో వరుసగా ఐదు స్థానాల్లోను మారుతి కార్లు స్థానం సంపాదించుకున్నాయి. ఏయే కార్లు ఎంత సంఖ్యలో అమ్ముడయ్యాయో ఓ లుక్కేసుకుందాం రండి....

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

10. హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీ ఏప్రిల్ 2018లో 9,390 యూనిట్ల సేల్స్ సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో 9,312 యూనిట్ల సేల్స్ సాధించిన హ్యుందాయ్ క్రెటా ఏడాదైనా కూడా నిలకడైన ఫలితాలు నమోదు చేసుకుంది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

హ్యుందాయ్ మోటార్స్ క్రెటా ఎస్‌యూవీని ఇటీవల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. మూడు రకాల ఇంజన్ ఆప్షన్లు మరియు రెండు విభిన్న ట్రాన్స్‌మిషన్‌లతో లభ్యమవుతోంది. 2018 క్రెటా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 9.48 లక్షలుగా ఉంది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

09. మారుతి సుజుకి సెలెరియో

మారుతి ఆల్టో మరియు స్విఫ్ట్ కార్ల మధ్య ఉన్న దూరాన్ని భర్తీ చేసేందుకు మారుతి ప్రవేశపెట్టిన సెలెరియో విడుదైలనప్పటి నుండి అత్యుత్తమ సేల్స్ సాధిస్తోంది. గత ఏడాది ఏప్రిల్ మాసంలో 8,425 యూనిట్ల సెలెరియో కార్లను విక్రయించిన మారుతి ఈ యేడు అదే నెలలో 9,631 యూనిట్ల విక్రయించింది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

మారుతి సెలెరియో 1000సీసీ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతోంది. భారతదేశపు మొట్టమొదటి ఆటోమేటిక్ కారు సెలెరియో. అయితే, టియాగో విడుదలతో సెలెరియో సేల్స్ కాస్త తగ్గుముఖం పట్టాయి.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

08. మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి సుజుకి రెండేళ్ల క్రితం విడుదల చేసిన వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీ భారీ సక్సెస్ అందుకుంది. ఏప్రిల్ 2017లో 10,818 యూనిట్ల మేర అమ్ముడైన బ్రిజా ఈ యేడు అదే కాలంలో 10,653 యూనిట్ల సేల్స్ సాధించి 8 వ స్థానంలో నిలిచింది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

మారుతి వితారా బ్రిజా సాంకేతికంగా 1.3-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమయ్యేది. అయితే, ఆటోమేటిక్ వెర్షన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఇటీవల బ్రిజా ఎస్‌యూవీని ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో విడుదల చేసింది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

07. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో తన స్థానాన్ని మళ్లీ పధిలం చేసుకున్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఈ ఏప్రిల్ 2018లో 12,174 యూనిట్ల విక్రయాలు జరిపి 7 వ స్థానంలో నిలిచింది. అయితే, గత ఏడాది ఇదే నెలలో 12,001 గ్రాండ్ ఐ10 కార్లు అమ్ముడయ్యాయి.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ విపణిలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్, నిస్సాన్ మైక్రా మరియు ఫోర్డ్ ఫిగో వంటి మోడళ్లకు పోటీనిస్తోంది. సాంకేతికంగా ఇది 1.2-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభ్యమవుతోంది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

06. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

హ్యుందాయ్ ఇండియా ఈ ఏప్రిల్ 2018లో 12,369 యూనిట్ల ఎలైట్ ఐ20 కార్లను విక్రయించింది. అయితే, గత ఏడాది ఏప్రిల్‌లో 12,668 యూనిట్లను విక్రయించింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న మారుతి బాలెనో మరియు హోండా జాజ్ నుండి ఎదురవుతున్న తీవ్ర పోటీని ఎదుర్కుంటూనే అద్భుతమైన సేల్స్ సాధిస్తోంది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అయితే కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో మాత్రమే లభించే ఎలైట్ ఐ20లో ఇటీవల సివిటి గేర్‌బాక్స్‌ను పరిచయం చేసింది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

05. మారుతి సుజుకి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఈ ఏప్రిల్ 2018లో 16,561 యూనిట్ల సేల్స్ సాధించి 5 వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇదే బాక్సీ స్టైల్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ గత ఏడాది ఏప్రిల్ నెలలో 16,348 యూనిట్లను విక్రయించింది. టాటా టియాగో విడుదలతో పోటీ ఎక్కువైనప్పటికీ సేల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

మారుతి వ్యాగన్ఆర్ 1-లీటర్ పెట్రోల్ మరియు సిఎన్‌జీ ఇంజన్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది. 20కిమీలకు పైగా మైలేజ్ ఇస్తున్న వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

04. మారుతి సుజుకి బాలెనో

ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి మారుతి సుజుకి లాంచ్ చేసిన మారుతి బాలెనో భారీ విజయాన్ని అందుకుంది. ఏప్రిల్ 2017లో 17,350 యూనిట్ల బాలెనో కార్లు అమ్ముడవ్వగా, ఇదే ఏప్రిల్ 2018లో 20,412 యూనిట్ల సేల్స్ సాధించింది ఈ టాప్ 10 జాబితాలో 4 వ స్థానంలో నిలిచింది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

మారుతి సుజుకి బాలెనో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో లభ్యమవుతోంది. వీటితో పాటు 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ గల బాలెనో ఆర్ఎస్ మోడల్‌కు అందుబాటులో ఉంది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

03. మారుతి సుజుకి ఆల్టో

మారుతి ఆల్టో హ్యాచ్‌బ్యాక్ గత ఏడాది ఏప్రిల్ నెలలో 22,549 యూనిట్ల విక్రయాలతో రెండవ స్థానంలో ఉండేది. అయితే, తాజాగా విడుదలైన డిజైర్ మరియు స్విఫ్ట్ కారణంగా 21,233 సేల్స్‌తో మూడవ స్థానానికి పడిపోయింది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

మారుతి సుజుకి తొలినాళ్లలో విడుదల చేసిన భారతదేశపు అత్యంత పురాతణ మోడల్ ఆల్టోకు దాదాపు 20 ఏళ్లు కావస్తున్నాయి. ఈ కాలంలో సుమారుగా 30 లక్షలకు పైగా ఆల్టో కార్లు అమ్ముడయ్యాయి. ఆల్టో హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం 800సీసీ మరియు 1000సీసీ ఇంజన్‌లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యమవుతోంది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

02. మారుతి సుజుకి డిజైర్

గత ఏడాది ఏప్రిల్ నెలలో 8,606 యూనిట్ల డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. అయితే, అదే ఏప్రిల్ 2018లో ఏకంగా 23,802 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతి సుజుకి గత ఏడాది సెకండ్ జనరేషన్ డిజైర్ స్థానంలోకి థర్డ్ జనరేషన్ డిజైర్‌ను లాంచ్ చేసింది. భారీ మార్పులు చేర్పులతో విడుదలైన మారుతి డిజైర్ అనతి కాలంలోనే భారీ విజయాన్ని అందుకుంది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

మారుతి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ సాంకేతికంగా 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో లభిస్తోంది. కొత్త తరం మారుతి డిజైర్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో ఎంచుకోవ్చచు.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

01. మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి ఇండియా లైనప్‌లో స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ బెస్ట్ సెల్లింగ్ మోడల్. గత ఏడాది మార్కెట్లో అందుబాటులో ఉన్న సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ 22,776 యూనిట్ల సేల్స్ సాధించింది. అయితే, అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై స్విఫ్ట్ 23,802 యూనిట్ల సేల్స్ సాధించి భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కారుగా మొదటి స్థానంలో నిలిచింది.

మార్కెట్‌ను శాసిస్తున్న మారుతి: టాప్ 10 లో మారుతి కార్లే ఏడు

మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లతో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో లభిస్తోంది. సేఫ్టీ పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ఎన్నో ఫీచర్లు తప్పనిసరిగా వచ్చాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Swift tops the sales chart in India for 2018
Story first published: Thursday, May 24, 2018, 18:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X