భారతదేశపు ఫాస్టెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఖాతాలో మరో రికార్డ్

మారుతి వితారా బ్రిజా మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి ఎన్నో రికార్డులు నెలకొల్పింది. తాజాగా మరో అరుదైన మెలురాయిని ఛేదించింది. వితారా బ్రిజా విడుదలైన కేవలం 28 నెలల్లోనే ఏకంగా 3 లక్షల యూనిట్లకు పైగా అమ్

By Anil Kumar

ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి వితారా బ్రిజా ఎస్‌యూవీతో కాస్త ఆలస్యంగా ప్రవేశించిన మారుతి సుజుకి ఊహించని విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మారుతి వితారా బ్రిజా విడుదలైన అనతి కాలంలోనే భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ మరియు ఫాస్టెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా మొదటి స్థానంలో నిలిచింది.

మరో కొత్త రికార్డ్ నెలకొల్పిన మారుతి వితారా బ్రిజా

మారుతి వితారా బ్రిజా మార్కెట్లోకి విడుదలైనప్పటి నుండి ఎన్నో రికార్డులు నెలకొల్పింది. తాజాగా మరో అరుదైన మెలురాయిని ఛేదించింది. వితారా బ్రిజా విడుదలైన కేవలం 28 నెలల్లోనే ఏకంగా 3 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యింది.

మరో కొత్త రికార్డ్ నెలకొల్పిన మారుతి వితారా బ్రిజా

మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్చి 2016లో తొలిసారిగా లాంచ్ చేసింది. ఆ తరువాత ఇటీవల ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వితారా బ్రిజాను అప్‌డేట్ చేసింది. మారుతి కథనం మేరకు, మే 2018 నెలలో జరిపిన వితారా బ్రిజా విక్రయాల్లో 23 శాతం బ్రిజా ఆటోమేటిక్ వేరియంట్ నుండి నమోదైనట్లు తెలిసింది.

మరో కొత్త రికార్డ్ నెలకొల్పిన మారుతి వితారా బ్రిజా

చివరి ఐదు నెలల్లో మారుతి వితారా బ్రిజా సగటు నెలసరి విక్రయాలు 12,600 యూనిట్లు. గత ఏడాది విక్రయాలతో పోల్చితో 25 శాతం సేల్స్ పెరిగాయి. వితారా బ్రిజా టాప్ ఎండ్ వేరియంట్లయిన జడ్ మరియు జడ్ + విక్రయాలే అధికం. మొత్తం విక్రయాల్లో ఈ రెండు వేరియంట్ల వాటా 56 శాతంగా నమోదైంది.

మరో కొత్త రికార్డ్ నెలకొల్పిన మారుతి వితారా బ్రిజా

మారుతి సుజుకి మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎక్జ్సిక్యూటిల్ ఆర్ఎస్ కల్సి మాట్లాడుతూ, " వితారా బ్రిజా అద్భుతమైన పురోగతి సాధించిన మోడల్, కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఓ సంచలనం సృష్టించింది. స్పోర్టివ్ మరియు స్టైలిష్ డిజైన్‌లో ఉన్న వితారా బ్రిజా ఇండియన్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోందని చెప్పుకొచ్చాడు."

మరో కొత్త రికార్డ్ నెలకొల్పిన మారుతి వితారా బ్రిజా

"వితారా బ్రిజామొత్తం విక్రయాల్లో టాప్ ఎండ్ వేరియంట్ల వాటా 56 శాతం నమోదయ్యింది. అంటే, మారుతి సుజుకి ఆవిష్కరణలు మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అందించిన ఫీచర్లను కస్టమర్లు స్వాగతిస్తున్నారు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. బ్రిజా ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీ కస్టమర్ల ఆకాంక్షను నెరవేర్చుతోందని తెలిపాడు."

మరో కొత్త రికార్డ్ నెలకొల్పిన మారుతి వితారా బ్రిజా

భారతదేశపు అతి పెద్ద యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రాను అధిగమించడానికి మారుతి వితారా బ్రిజా సాధిస్తున్న సేల్స్ ఎంతగానో దోహదమయ్యాయి. కంపెనీ గత 2018 ఆర్థిక సంవత్సరంలో 2,53,759 యూనిట్లను విక్రయించింది. మార్కెట్లో వితారా బ్రిజా మార్కెట్ వాటా 25.69 నుండి 27.53 శాతానికి పెరిగింది.

మరో కొత్త రికార్డ్ నెలకొల్పిన మారుతి వితారా బ్రిజా

మారుతి సుజుకి వితారా బ్రిజా ఇప్పుడు భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యూవీ 7.52 లక్షల రుపాయల ప్రారంభ ధరతో లభ్యమవుతోంది. మారుతి వితారా బ్రిజా విపణిలో ఉన్న ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు టాటా నెక్సాన్ మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki Vitara Brezza Sales Cross Three Lakh Units — Fastest-Selling SUV In India
Story first published: Wednesday, July 4, 2018, 19:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X