Just In
- 4 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విపణిలోకి మాసేరటి లెవంతె ఎస్యూవీ విడుదల: ధర రూ. 1.45 కోట్లు

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ దిగ్గజం మసెరాటి విపణిలోకి సరికొత్త లెవంతె లగ్జరీ ఎస్యూవీని లాంచ్ చేసింది. మసెరాటి లెవంతె ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 1.45 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

మసెరాటి మొట్టమొదటి ఎస్యూవీ రెండు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది అవి, గ్రాన్లుస్సో మరియు గ్రాన్స్పోర్ట్. దేశీయంగా బెంగళూరు, ముంబాయ్ మరియు న్యూ ఢిల్లీలో ఉన్న మసెరాటి విక్రయ కేంద్రాలలో ఈ లెవంతె ఎస్యూవీ అందుబాటులోకి వచ్చింది.

అంతర్జాతీయ విపణిలో ఉన్న మసెరాటి లెవంతె లగ్జరీ ఎస్యూవీ 3.0 లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్లతో లభ్యమవుతోంది. అయితే, ఇండియన్ వెర్షన్ లెవంతె ఎస్యూవీలో కేవలం డీజల్ ఇంజన్ మాత్రమే ఉంది.

మసెరాటి లెవంతె ఎస్యూవీలోని 3.0-లీటర్ కెపాసిటి గల వి6 డీజల్ ఇంజన్ గరిష్టంగా 271బిహెచ్పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మసెరాటి లైనప్లో ఉన్న గిబ్లి మరియు క్వాట్రోపోర్తే కార్లలో కూడా ఇదే ఇంజన్ కలదు. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిటిక్ గేర్బాక్స్ అనుసంధానం కలదు.

లెవంతె లోని వి6 డీజల్ ఇంజన్ కేవలం 6.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్ట వేగం గంటకు 230కిలోమీటర్లుగా ఉంది.

లెవంతె ఎస్యూవీలో ఆప్షనల్ "యాక్టివ్ సౌండ్" ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు. ఇది వివిధ డ్రైవింగ్ మోడ్స్కు అనుగుణంగా ఎగ్జాస్ట్ నుండి వచ్చే శబ్దాన్ని మారుస్తుంది. ఇందులో ఆటో నార్మల్, ఆటో స్పోర్ట్, ఆటో మ్యాన్యువల్ మరియు ఆటో ఆఫ్-రోడ్ అనే విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

మసెరాటి లెవంతె ఎస్యూవీలో మెకానికల్ పరంగా అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అందులో, ట్రెడిషనల్ హైడ్రాలిక్ స్టీరింగ్, టార్క్ వెక్టరింగ్ ఛాసిస్ మరియు క్యూ4 ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్నాయి. లెవంతె ఎస్యూవీని తేలికపాటి పదార్థాలతో నిర్మించబడింది. దీంతో వెయిట్ బ్యాలెన్సింగ్ చక్కగా జరిగి, గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వెహికల్ మీద అతి తక్కువ ఉండేలా చూస్తుంది.

మసెరాటి లెవంతె ఎస్యూవీ ఇంటీరియర్లో మసెరాటి టచ్ కంట్రోల్ సిస్టమ్, 8.4-అంగుళాల హై రిజల్యూషన్ స్క్రీన్ మరియు సెంటర్ టన్నెల్ కన్సోల్ మీద పలు రోటరీ కంట్రోల్స్ ఉన్నాయి.

ఇంటీరియర్ మొత్తం ప్రీమియం లెథర్, ఫైన్ వుడ్స్, ప్లాటినమ్ మరియు ఇతర లోహాలను ఉయోగించి, చేతితో కుట్టబడిన సీట్లు, వంటి వాటితో అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. ఆప్షనల్ అప్గ్రేడ్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంది.

సేఫ్టీ పరంగా మసెరాటి లెవంతె ఎస్యూవీలో అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ కలదు. ఇది, హైవే అసిస్ట్, కీపింగ్ అసిస్ట్, యాక్టివ్ బ్లైండ్ స్పాట్ అసిస్ట్ మరియు ట్రాఫిక్ సిగ్నిల్స్ గుర్తించే సిస్టమ్ వంటి వాటిని నియంత్రిస్తుంది.

మసెరాటి ఇండియా కార్యకలాపాల విభాగాధ్యక్షుడు బొజన్ జాన్కులోస్కి మాట్లాడుతూ, "దేశీయంగా ప్రీమియం ఎస్యూవీలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో లగ్జరీ, ఫీచర్లు, మరియు భద్రత పరంగా కస్టమర్లకు సంతృప్పినిచ్చే విధంగా ఈ 2018లో లెవంతె ఎస్యూవీని లాంచ్ చేసినట్లు తెలిపాడు. డిజైన్, విభిన్నత్వం, పర్ఫామెన్స్ వంటివి సరికొత్త మెసెరాటి లెవంతె ఎస్యూవీ ప్రత్యేకతలని చెప్పుకొచ్చాడు."

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మసెరాటి యొక్క తొలి ఎస్యూవీ లెవంతె. దీని విడుదలతో, ఇప్పుడు ఖరీదైన లగ్జరీ ఎస్యూవీల సెగ్మెంట్లో పోటీ మరింత పెరిగింది. అత్యంత అరుదైన మరియు ఖరీదైన ఉత్పత్తులను విక్రయంచే మసెరాటికి ఇండియాలో ఇది అత్యంత ముఖ్యమైన మోడల్ కానుంది. చాలా వేగంగా వృద్ది చెందుతున్న లగ్జరీ ఎస్యూవీల సెగ్మెంట్లో మసెరాటి సరైన సమయంలో లెవంతె ఎస్యూవీని లాంచ్ చేసిందని చెప్పవచ్చు.
Trending DriveSpark Telugu YouTube Videos