మెర్సిడెస్ నుండి లిమిటెడ్ ఎడిషన్ కూపే మరియు కన్వర్టిబుల్ విడుదల

మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి రెండు సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. మెర్సిడెస్-ఏఎమ్‌జి జిఎల్ఇ 43 4మ్యాటిక్ కూపే మరియు ఎస్ఎల్‌సి 43 మోడళ్లను "ఆరేంజ్ఆర్ట్" మరియు "రెడ్ఆర్ట్" ఎడ

By Anil Kumar

మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి రెండు సరికొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. మెర్సిడెస్-ఏఎమ్‌జి జిఎల్ఇ 43 4మ్యాటిక్ కూపే మరియు ఎస్ఎల్‌సి 43 మోడళ్లను "ఆరేంజ్ఆర్ట్" మరియు "రెడ్ఆర్ట్" ఎడిషన్‌లో పరిమిత సంఖ్యలో లాంచ్ చేసింది. ఈ రెండు లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లలో ఎక్ట్సీరియర్ మీద పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి.

లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను లాంచ్ చేసిన మెర్సిడెస్

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్ఇ 43 4మ్యాటిక్ కూపే ఆరేంజ్ఆర్ట్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 1.02 కోట్లు మరియు ఎల్ఎస్43 రెడ్ఆర్ట్ ధర రూ. 87.48 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి. ఈ రెండు లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను కేవలం 25 యూనిట్ల వరకు మాత్రమే ఇండియన్ మార్కెట్‌కు కేటాయించింది.

లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను లాంచ్ చేసిన మెర్సిడెస్

మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్ఇ 43 4మ్యాటిక్ కూపే ఆరేంజ్ఆర్ట్ ఎడిషన్‌లో కారు క్రింది వైపున బాడీ అంచుల వద్ద, ఫ్రంట్ మరియు రియర్ బంపర్ మీద ఆరేంజ్ కలర్ హైలైట్స్ ఉన్నాయి. 21-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ మీద కూడా ఆరేంజ్ సొబగులు ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులో బ్లాక్ ఎల్ఇడి రింగ్స్ గల ఎల్ఇడి హెడ్‌లైట్లు ఉన్నాయి.

లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను లాంచ్ చేసిన మెర్సిడెస్

జిఎల్ఇ 43 4మ్యాటిక్ కూపే ఆరేంజ్ఆర్ట్ ఎడిషన్ లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌లో ఆరేంజ్ మేళవింపులు గల బ్లాక్ నప్పా లెథర్ సీట్లు మరియు అప్‌హోల్‌స్ట్రే కలదు. సీట్లు అన్నింటినీ ప్రత్యేకమైన ఆరేంజ్ కలర్ దారంతో స్టిచ్చింగ్ చేసారు. ఫ్లోర్ మ్యాట్లు మరియు డోర్ ప్యానళ్ల మీద కూడా ఆరేంజ్ కలర్‌లో ఉన్న ఏఎమ్‌జి బ్యాడ్జింగ్ కలదు.

లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను లాంచ్ చేసిన మెర్సిడెస్

అరేంజ్ఆర్ట్ ఎడిషన్ తరహాలోనే, ఎల్ఎస్ 43 రెడ్ఆర్ట్ ఎడిషన్ మోడల్‌లో ఫ్రంట్ మరియు రియర్ బంపర్ అదే విధంగా 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ మీద రెడ్ కలర్ ఫినిషింగ్ గమనించవచ్చు. బ్రేక్ కాలిపర్లను కూడా ఎరుపు రంగులోనే అందించారు. క్యాబిన్ మొత్తం లెథర్ తరహా కార్బన్ ఫైబర్ ఇంటీరియర్ రెడ్ హైలైట్స్ కలిగి ఉన్నాయి.

లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను లాంచ్ చేసిన మెర్సిడెస్

రెండు లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ కార్లలో 3-లీటర్ కెపాసిటి గల వి6 టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 361బిహెచ్‌పి పవర్ మరియు 520ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కూపే కారులో ఫోర్-వీల్-డ్రైవ్ మరియు ఎల్ఎస్‌సి 43 కారులో రియర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఉంది.

లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను లాంచ్ చేసిన మెర్సిడెస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మెర్సిడెస్ బెంజ్ ఇండియా విపణిలోకి సరికొత్త మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్ఇ 43 4మ్యాటిక్ కూపే మరియు ఎస్ఎల్‌సి 43 కన్వర్టిబుల్ కార్లను రెగ్యులర్ మోడళ్లతో పోల్చితే విభిన్నంగా ఉండేందుకు పలు ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్ నిర్వహించి ప్రవేశపెట్టింది. రెండింటిలో వచ్చిన ఆరేంజ్ఆర్ట్ మరియు రెడ్ఆర్ట్ డిజైన్ ఎలిమెంట్స్ స్పోర్టివ్ ఫీల్‌ను మరింత పెంచాయి. మెర్సిడెస్ ఇ 63 ఎ 4మ్యాటిక్ తరువాత మెర్సిడెస్ ఏఎమ్‌జి చేసిన రెండవ లాంచ్ ఇది.

Most Read Articles

English summary
Read In Telugu: Mercedes-AMG Launches GLE 43 4MATIC Coupe And SLC 43 Limited Edition Models
Story first published: Tuesday, May 22, 2018, 13:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X