మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఇక మీదట ఇండియాలోనే

మెర్సిడెస్-బెంజ్ తమ ఎలక్ట్రిక్ కార్ల తయారీని ఇండియాలోనే చేపట్టాలని భావిస్తోంది. పూనేలోని కంపెనీ చకన్ ప్రొడక్షన్ ప్లాంటులో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలనే ఆలోనలో ఉంది.

By Anil Kumar

మెర్సిడెస్-బెంజ్ తమ ఎలక్ట్రిక్ కార్ల తయారీని ఇండియాలోనే చేపట్టాలని భావిస్తోంది. పూనేలోని కంపెనీ చకన్ ప్రొడక్షన్ ప్లాంటులో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలనే ఆలోనలో ఉంది.

ఇకో ఫ్రెండ్లీ వాహన వినియోగాన్ని పెంపొందించేందుకు దిశగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ నిర్ణయాలకు అనుగుణంగా, రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఎగుమతి మరియు దేశీయ విక్రయాలకు ఇండియన్ మార్కెట్లో విపరీతమైన అవకాశాలు ఉంటాయని మెర్సిడెస్ భావిస్తోంది.

మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఇక మీదట ఇండియాలోనే

తాజాగా అందుతున్న సమచారం మేరకు, మెర్సిడెస్ బెంజ్ తమ పూనే లోని చకన ప్రొడక్షన్ ప్లాంటులో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఉత్పత్తి చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది.

మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఇక మీదట ఇండియాలోనే

ఏదేమైనప్పటికీ, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ పరంగా కంపెనీ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రధానంగా, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు కీలక సమస్యగా మారనున్నాయి.

మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఇక మీదట ఇండియాలోనే

అంతే కాకుండా, దిగుమతి చేసుకునే ఇకో ఫ్రెండ్లీ వాహనాల మీద కేంద్ర విధించే ఇపోర్ట్ ట్యాక్స్ తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది, దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ మీద కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి సహకరిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద దిగుమతి ట్యాక్స్ తగ్గించడంతో అత్యంత సరసమైన ధరలకే ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయవచ్చు.

మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఇక మీదట ఇండియాలోనే

మెర్సిడెస్ బెంజ్ తమ సబ్-బ్రాడ్ "ఇక్యూ"ను వచ్చే ఏడాది అంతర్జాతీయంగా విడుదల చేయనుంది. మెర్సిడెస్ ఇక్యూ బ్రాండ్ లైనప్‌లో ఇప్పటికే విసృత శ్రేణి ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఇక్యూ పూర్తి స్థాయిలో ప్రారంభమైతే, మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కార్లు ఇక్యూ బ్రాండ్ పేరుతో లభ్యమవుతాయి.

మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఇక మీదట ఇండియాలోనే

మెర్సిడెస్-బెంజ్ కథనం మేరకు, తమ ఇక్యూ లైనప్‌లో అన్ని రకాల బ్యాటరీ-ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. వీటితో పాటు, ఎలక్ట్రిక్ వాహనాల అనుభంద ఉత్పత్తులు కూడా ఇక్యూ ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఇక్యూ ద్వారా లభించే అన్ని ఎలక్ట్రిక్ కార్లను కంపెనీ యొక్క నూతన సింగల్ ఆర్కిటెక్చర్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు.

మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఇక మీదట ఇండియాలోనే

భారతదేశపు అతి పెద్ద లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ బిఎస్-VI ఉద్గార నియమాలను పాటించే తొలి వెహికల్‌ను ఇండియాలోకి లాంచ్ చేసింది. మెర్సిడెస్ కంపెనీ డైమ్లర్ గ్రూపు భాగస్వామ్యంలో ఇటీవల ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్ కారును బిఎస్-VI ఇంజన్‌తో లాంచ్ చేసింది.

మెర్సిడెస్-బెంజ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ ఇక మీదట ఇండియాలోనే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచంలోనే అతి పెద్ద వాహన తయారీ సంస్థల్లో ఒకటైన డైమ్లర్ గ్రూపు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ముందుకు రావడం భవిష్యత్తులో ఇండియాకు బాగా కలిసిరానుంది. దేశీయంగా ఉద్గార రహిత వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మరింత బలం చేకూర్చనుంది. దీనికి తోడు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియాలో భాగంగా పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

Source: TOI

Most Read Articles

English summary
Read In Telugu: Mercedes-Benz Planning To Manufacture Electric Cars In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X