ఆర్ఎక్స్5 ఎస్‌యూవీని ఇండియాకు తీసుకొచ్చిన ఎంజీ మోటార్స్

చైనా కార్ల కంపెనీ ఎస్ఏఐసీ సొంతం చేసుకున్న బ్రిటన్ కార్ల తయారీ దిగ్గజం ఎంజీ మోటార్స్ 2019లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది.

By Anil Kumar

చైనా కార్ల కంపెనీ ఎస్ఏఐసీ సొంతం చేసుకున్న బ్రిటన్ కార్ల తయారీ దిగ్గజం ఎంజీ మోటార్స్ 2019లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోంది. తాజాగా, దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టనున్న తమ తొలి మోడల్‌ను ఇండియన్ రోడ్ల మీద పరీక్షలు నిర్వహించడం ప్రారంభించింది.

ఎంజీ ఆర్ఎక్స్5 ఎస్‌యూ

ఎక్ట్సీరియర్‌ను ఏ మాత్రం గుర్తించడానికి వీల్లేకుండా బ్లాక్ అండ్ వైట్ పేపరుతో కప్పేసిన ఎంజీ ఆర్ఎక్స్5 ఎస్‌యూవీకి పూనే రోడ్ల మీద టెస్టింగ్ నిర్వహించింది. ఈ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు ఇవళ్టి కథనంలో...

ఎంజీ ఆర్ఎక్స్5 ఎస్‌యూ

మధ్య-ఆసియా మార్కెట్లో ఆర్ఎక్స్5 ఎస్‌యూవీని ఎంజీ బ్రాండ్ పేరు క్రింద మరియు చైనా మార్కెట్లో రోయ్‌వి బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పరీక్షిస్తున్న మోడల్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ సిస్టమ్ ఉంది. కాబట్టి, ఇండియాలో రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ అవసరాల కోసం దిగుమతి చేసుకొని ఉండవచ్చు.

ఎంజీ ఆర్ఎక్స్5 ఎస్‌యూ

రహస్యంగా పట్టుబడిన ఈ ఎస్‌యూవీని 2018 ఎంజీ ఆర్ఎక్స్5 ఆధారంగా తీసుకొచ్చినట్లు తెలిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇది అప్‌డేటెడ్ మోడల్. ఇందువో వి-ఆకారంలో ఉన్న గ్రిల్, పలుచటి హెడ్‌ ల్యాంప్స్ మరియు సి-ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు తదితర ఎక్ట్సీరియర్ ఫీచర్లు ఉన్నాయి.

ఎంజీ ఆర్ఎక్స్5 ఎస్‌యూ

ఎంజీ ఆర్ఎక్స్5 రియర్ డిజైన్‌లో పదునైన ఆకృతి, రియర్ వైపర్, నిలువుటాకారంలో ఇవ్వబడ్డ టెయిల్ లైట్లు, రూఫ్ రెయిల్స్ మరియు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటి డిజైన్ అంశాలను గుర్తించవచ్చు. అంతే కాకుండా, ఇందులో డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఎంజీ ఆర్ఎక్స్5 ఎస్‌యూ

ఎంజీ ఆర్ఎక్స్5 ఎస్‌యూవీ అంతర్జాతీయ మార్కెట్లో రెండు విభిన్న పెట్రోల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. వీటిలో 1.5-లీటర్ పెట్రోల్ 166బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 2-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 217బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఎంజీ ఆర్ఎక్స్5 ఎస్‌యూ

ట్రాన్స్‌మిషన్ పరంగా ఇది 7-స్పీడ్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అదే విధంగా టాప్ ఎండ్ వేరియంట్ ఎస్‌యూవీలో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది. ఎంజీ ఆర్ఎక్స్ నిజంగానే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయితే, జనరల్స్ మోటార్స్ నుండి సొంతం చేసుకున్న గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.

ఎంజీ ఆర్ఎక్స్5 ఎస్‌యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎంజీ మోటార్స్ 2019లో దేశీయ విపణిలోకి లాంచ్ చేయనున్న ఎంజీ ఆర్ఎక్స్5 ఖరీదైన ప్రీమియం ఎస్‌యూవీ. యుటిలిటి వాహనాల సెగ్మెంట్‌ బాగా వృద్ది చెందుతున్న తరుణంలో హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ కార్ల పరిచయానికి ముందే ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది.

ఎంజీ మోటార్స్ ఎంజీ ఆర్ఎక్స్5 ఎస్‌యూవీని పూర్తి స్థాయిలో లాంచ్ చేస్తే, విపణిలో ఉన్న జీప్ కంపాస్, హ్యుందాయ్ క్రెటా మరియు మహీంద్రా ఎక్స్‌యూవీ500 వంటి మోడళ్లకు గట్టిపోటీనివ్వనుంది.

Source: TeamBHP

Most Read Articles

English summary
Read In Telugu: MG RX5 SUV Spotted Testing In Indi
Story first published: Tuesday, June 26, 2018, 13:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X