జడ్ఎస్ ఎస్‌యూవీని భారత్‌ కోసం సిద్దం చేసిన ఎమ్‌జి మోటార్స్

By Anil
Recommended Video - Watch Now!
Andhra Pradesh State Transport Bus Crashes Into Bike Showroom - DriveSpark

చైనా కార్ల తయారీ దిగ్గజం ఎస్ఏఐసి(SAIC) సంస్థను కొనుగోలు చేసిన బ్రిటన్ దిగ్గజం ఎమ్‌జి మోటార్స్ 2018లో ఇండియన్ మార్కెట్లో ప్రవేశించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, భారత్‌లో కంపెనీ యొక్క మొదటి మోడల్ జడ్ఎస్ ఎస్‌యూవీని తెలిసింది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఇండియాలోకి ప్రవేశిస్తున్న ఎమ్‌జి మోటార్స్ ప్రవేశపెట్టే మొదటి మోడల్ గురించి వచ్చిన రిపోర్ట్స్ మేరకు, విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి గట్టి పోటీనిచ్చే విధంగా జడ్ఎస్ లేదా జిఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఎమ్‌జి మోటార్స్ అంతర్జాతీయంగా చివరగా లాంచ్ చేసిన మోడల్ ఎమ్‌జి జడ్ఎస్. ఈ ఎస్‌యూవీ నాలుగు మీటర్ల కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. విపణిలో ఉన్న క్రెటాకు సరాసరి పోటీనివ్వనుంది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

అంతర్జాతీయ మార్కెట్లో ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.5-లీటర్ కెపాసిటి గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు 1.0-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

118బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తోంది. అదే విధంగా 1-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 123బిహెచ్‌పి పవర్ మరియు 170ఎమ్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తోంది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

రిపోర్ట్స్ ప్రకారం, ఎమ్‌జి మోటార్స్ జడ్ఎస్ లేదా జిఎస్ ఎస్‌యూవీలో ఒక మోడల్‌తో విపణిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం క్రెటా ఎస్‌యూవీకి సరైన పోటీ లేకపోవడంతో 2016 నుండి భారీ విక్రయాలు సాధిస్తోంది. అయితే, క్రెటాను క్లీన్ స్వీప్ చేసేందుకు జడ్ఎస్ లేదా జిఎస్ లలో ఒక దానిని ఖాయం చేసే ఛాన్స్ ఉంది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

జడ్ఎస్ తరువాత, వరుసగా ఉన్న రెండవ మోడల్ జిఎస్. ఎమ్‌జి మోటార్స్ జిఎస్ ఎస్‌యూవీని 2015లో అంతర్జాయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. సి-సెగ్మెంట్‌కు చెందిన జిఎస్ ఎస్‌యూవీ దేశీయంగా ఉన్న జీప్ కంపాస్‌‌ మరియు హ్యుందాయ్ టుసాన్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ప్రపంచ విపణిలో లభించే ఎమ్‌జి జిఎస్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ మరియు 2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌లు ఉన్నాయి. వీటిలో 1.5-లీటర్ ఇంజన్ 165బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1.5-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో మరియు 2-లీటర్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ అనుసంధానంతో లభ్యమవుతోంది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

ఎమ్‌జి మోటార్స్ దేశీయంగా తమ కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించింది. గుజరాత్‌లోని జనరల్ మోటార్స్‌కు చెందిన హలోల్ ప్రొడక్షన్ ప్లాంటును 2017 సెప్టెంబరులో ఎమ్‌జి మోటార్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రొడక్షన్‌కు సంభందించి పనులను పూర్తి చేసుకుంటోంది. 2018-2019 ఆర్థిక సంవత్సరం నుండి తయారీని ప్రారంభించనుంది.

ఎమ్‌జి జడ్ఎస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయంగా ఎస్‌యూవీ మార్కెట్ శరవేగంగా వృద్ది చెందుతోంది. అందుకే పలు అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలు ఇండియాలో ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నాయి. అందులో ఒకటి జపాన్-చైనా భాగస్వామ్యపు దిగ్గజం ఎమ్‌జి మోటార్స్. ఎమ్‌జి తమ ఉత్పత్తులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ఆటోమొబైల్ న్యూస్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

Trending DriveSpark YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: ET Auto

Most Read Articles

English summary
Read In Telugu: MG Motors ZS SUV India Launch Details Revealed — To Rival Hyundai Creta
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X