Just In
- 17 min ago
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- 22 min ago
భారత్‌లో మూడు కొత్త బైకులను విడుదల చేసిన డుకాటీ; వివరాలు
- 2 hrs ago
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- 3 hrs ago
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
Don't Miss
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- News
అనంత కలెక్టర్‌ను కదిలించిన ఫేస్బుక్ పోస్ట్: 24 గంటల్లోనే బస్సు: స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం
- Finance
బడ్జెట్ కంటే ముందు ఏ స్టాక్స్ కొంటే లాభాలు వస్తాయి..?
- Movies
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్‌కు ఎక్లిప్స్ మరియు ఎక్స్‌ప్యాండర్ ఎస్‌యూవీలను ఖరారు చేసిన మిత్సుబిషి
జపాన్ దిగ్గజం మిత్సుబిషి ఇటీవల విపణిలోకి ఔట్‌ల్యాండర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. మిత్సుబిషి దేశీయంగా ఉన్న తమ ఉత్పత్తుల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది. అవును, తాజాగా అందిన సమాచారం మేరకు మిత్సుబిషి తమ ఎక్లిప్స్ మరియు ఎక్స్‌ప్యాండర్ ఎస్‌యూవీలను ఇండియన్ మార్కెట్‌కు ఖరారు చేసినట్లు తెలిసింది.

మిత్సుబిషి ఇండియా మేనేజింగ్ డైరక్టర్ ఉత్తమ్ బోస్ మాట్లాడుతూ, "మిత్సుబిషి ఎస్‌యూవీల మీద దృష్టిసారిస్తోంది మరియు ఎక్లిప్స్ మరియు ఎక్స్‌ప్యాండర్ ఎస్‌యూవీలను భారత్ కోసం చేసిందని చెప్పుకొచ్చారు."

మిత్సుబిషి ప్రస్తుతం పజేరో స్పోర్ట్ మరియు ఔట్‌ల్యాండర్ ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. అయితే, ప్రస్తుతం భారత్‌కు ఖరారు చేసిన ఎక్లిప్స్ మరియు ఎక్స్‌ప్యాండర్ రెండు ఎస్‌యూవీలను కూడా 2017లో అంతర్జాతీయంగా ఆవిష్కరించింది.

మిత్సుబిషి ఎక్స్‌ప్యాండర్ ఎస్‌యూవీ శైలిలో ఉన్న ఎమ్‌పీవీ. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ లైట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

మిత్సుబిషి ఎక్స్‌ప్యాండర్ ఎమ్‌పీవీలో సాంకేతికంగా 103బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ ఉంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

మిత్సుబిషి ఎక్స్‌ప్యాండర్ పూర్తి స్థాయిలో విడుదలైతే మార్కెట్లో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా, అతి త్వరలో విడుదల కానున్న మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ మరియు మహీంద్రా మరాజొ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

మిత్సుబిషి ఎక్లిప్స్ ఫ్యూచర్ డిజైన్ లాంగ్వేజ్ కలిగి ఉన్న క్రాసోవర్ ఎస్‌యూవీ. ఇందులో అత్యాధునిక 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్ల్పే, ప్యానొరమిక్ సన్‌రూఫ్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. మిత్సుబిషి ఎక్లిప్స్ ఎస్‌యూవీ ఓవరాల్ డిజైన్ చాలా స్పోర్టివ్‌గా ఉంటుంది.

సాంకేతికంగా మిత్సుబిషి ఎక్లిప్స్ క్రాసోవర్ ఎస్‌యూవీలో 149బిహెచ్‌పి పవర్ మరియు 249ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ సామర్థ్యం గల టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు సూపర్ ఆల్-వీల్ కంట్రోల్ డ్రైవ్‌సిస్టమ్ ఉంది.

ఇందులో ఆటో, స్నో మరియు గ్రావెల్ అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. మిత్సుబిషి ఎక్లిప్స్ క్రాసోవర్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే జీప్ కంపాస్‌కు సరాసరి పోటీనిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మిత్సుబిషి ఎక్లిప్స్ మరియు ఎక్స్‌ప్యాండర్ రెండూ కూడా యుటిలిటి వాహనాల విభాగంలో మిడ్-సైజ్ మోడళ్లు. జపాన్ దిగ్గజం మిత్సుబిషి దేశీయంగా ఉన్న ఎస్‌యూవీ సెగ్మెంట్ మీద దృష్టి సారించి ఈ రెండు ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఏదేమైనప్పటికీ, కనీసం ఈ రెండు మోడళ్లతోనైనా భారత్‌లో మిత్సుబిషి తలరాత మారుతుందో లేదో చూడాలి మరి.
Source: CarandBike