మిత్సుబిషి పజేరో ఎస్‌యూవీకి శాస్వత వీడ్కోలు

మిత్సుబిషి అతి త్వరలో తమ పజేరో ఎస్‌యూవీని యూరోపియన్ మార్కెట్ నుండి శాస్వతంగా తొలగించనుంది. తక్కువ సేల్స్ మరియు కఠినమైన ఉద్గార ప్రమాణాలను పాటించలేకపోవడంతో మిత్సుబిషి పజేరో ఎస్‌యూవీ విషయంలో ఈ నిర్ణయం తీ

By Anil Kumar

జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ మిత్సుబిషి అతి త్వరలో తమ పజేరో ఎస్‌యూవీని యూరోపియన్ మార్కెట్ నుండి శాస్వతంగా తొలగించనుంది. తక్కువ సేల్స్ మరియు కఠినమైన ఉద్గార ప్రమాణాలను పాటించలేకపోవడంతో మిత్సుబిషి పజేరో ఎస్‌యూవీ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్

మిత్సుబిషికి ప్యాసింజర్ వాహన విభాగంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడళ్లలో ఒకటైన పజేరో ఎస్‌యూవీని అతి కష్టం మీద విపణి నుండి తొలగిస్తున్న నేపథ్యంలో మిత్సుబిషి పజేరో అభిమానుల కోసం ఫైనల్ ఎడిషన్ పజేరోను సిద్దం చేస్తోంది. మిత్సుబిషి 1982లో మొదటిసారిగా పజేర్ ఎస్‌యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది.

మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్

ఇప్పుడు, మిత్సుబిషి తమ పజేరో చరిత్రకు గుర్తుగా ఫైనల్ ఎడిషన్ పజేరో ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇది, మూడు మరియు ఐదు డోర్ల వేరియంట్లలో లభించనుంది. మిత్సుబిషి ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‍‌యూవీని పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. మొత్తం 1000 యూనిట్లలో 300 మూడు డోర్ల వేరియంట్లు, 700 ఐదు డోర్ల వేరియంట్లను సిద్దం చేస్తోంది.

మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్

మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్ ప్రతి యూనిట్ మీద ప్రత్యేకమైన నెంబరింగ్ ఉంటుంది. మూడు డోర్ల వెర్షన్ ఎస్‌యూవీలో ఫ్రంట్ బార్, 4ఎమ్ఎమ్ మందంతో ఉన్న అల్యూమినియం ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, ప్రత్యేకమైన ఏ/టి టైర్లు ఉన్న 18-అంగుళాల ఆఫ్ రోడ్ వీల్స్ ఉన్నాయి.

మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్

ఇతర ఫీచర్లయిన, రూఫ్ రెయిల్స్, హెడ్‌ల్యాంప్ వాషర్స్, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, హీటెడ్ ఫ్రంట్ మిర్రర్, బ్లూటూత్ కనెక్టివిటి గల ఇన్ఫోటైన్‌‌మెంట్ సిస్టమ్, ఇంజన్ మరియు గేర్‌బాక్స్‌ను రక్షించే అల్యూమినియం అండర్ బాడీ స్కిడ్ ప్లేట్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్

పజేరో ఫైనల్ ఎడిషన్ 5-డోర్ వెర్షన్ విషయానికి వస్తే, ఇందులో 20-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రియర్ స్పాయిలర్ మరియు ఇల్యూమినేటెడ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో లెథర్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు న్యావిగేషన్ గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్

మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్ లభించే 3 మరియు 5 డోర్లు గల రెండు వెర్షన్‌లలో సాంకేతికంగా 3.2-లీటర్ల కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు సూపర్ సెలెక్ట్ 4WD-II పర్మినెంట్ ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అనుసంధానం గల ఇది 187బిహెచ్‌పి పవర్ మరియు 441ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మిత్సుబిషి ఎట్టజకేలకు తమ పజేరో ఎస్‌యూవీని యూరోపియన్ మార్కెట్ నుండి శాస్వతంగా తొలగించాలని నిర్ణయించుకుంది. ఆశించిన సేల్స్ లేకపోవడం మరియు అత్యంత కఠినమైన యూరోపియన్ ఉద్గార నియమాలను పాటించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని తెలుస్తోంది. పజేరో చరిత్రను గుర్తుకు చేసుకునేందుకు చివరిగా 1000 యూనిట్ల పజేరో ఎస్‌యూవీలను ఫైనల్ ఎడిషన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దమైంది. పజేరో ప్రేమికులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

భారత్‌లో మిత్సుబిషి మోంటెరో మరియు పజేరో వాహనాలను విజయవంతంగా విక్రయిస్తోంది. కాబట్టి, దేశీయంగా ఫైనల్ ఎడిషన్ పజేరో ఊసే ఉండదని చెప్పవచ్చు.

మిత్సుబిషి పజేరో ఫైనల్ ఎడిషన్

1. టాటా నెక్సాన్ ఏఎమ్‌టి మీద బుకింగ్స్ షురూ

2.ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి నగ్న సత్యాలు

3.అంబాసిడర్ బ్రాండుకు మళ్లీ ప్రాణం పోస్తున్న ప్యూజో

4.రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

5.డీజిల్ రైలింజన్లు అస్సలు ఆఫ్ చేయరెందుకు?

Most Read Articles

English summary
Read In Telugu: Mitsubishi Pajero Final Edition Revealed
Story first published: Tuesday, April 24, 2018, 10:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X