పజేరో స్పోర్ట్ కోసం 30 కలర్ ఆప్షన్స్ పరిచయం చేసిన మిత్సుబిషి

మిత్సుబిషి ఇండియన్ ప్రీమియం ఎస్‌యూవీల మార్కెట్లో పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. తాజాగా ఎస్‌యూవీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు పజేర్ స్పోర్ట్ స్ల్పాష్ కస్టమ్ కలర్ ఆప్షన్స్‌లో పరిచయం చేసింది.

By Anil Kumar

జపాన్ దిగ్గజం మిత్సుబిషి ఇండియన్ ప్రీమియం ఎస్‌యూవీల మార్కెట్లో పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. తాజాగా ఎస్‌యూవీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు పజేర్ స్పోర్ట్ స్ల్పాష్ కస్టమ్ కలర్ ఆప్షన్స్‌లో పరిచయం చేసింది.

సరికొత్త మిత్సుబిషి పజేరో స్పోర్ట్ స్ల్పాష్ పలు రకాల కస్టమ్ కలర్ ఆప్షన్స్‌లో లభ్యమవుతోంది...

పజేరో స్పోర్ట్ కోసం 30 కలర్ ఆప్షన్స్ పరిచయం చేసిన మిత్సుబిషి

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ స్ల్పాష్ స్టాండర్డ్ పజేరో స్పోర్ట్ మరియు పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ రెండు వేరియంట్లలో కూడా లభ్యమవుతోంది. కస్టమర్లు తమ వక్తిగత ఇష్టానికి అనుగుణంగా సుమారుగా 30 రకాల రంగులు మరియు ప్యాట్రన్‌లలో ఎంచుకోవచ్చు. మిత్సుబిషి పజేరో స్పోర్ట్ స్ల్పాష్ మూడు విభిన్న డిజైన్ ప్యాట్రన్లు మరియు ఐదు రకాల డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.

పజేరో స్పోర్ట్ కోసం 30 కలర్ ఆప్షన్స్ పరిచయం చేసిన మిత్సుబిషి

కస్టమర్లు ఆన్‌లైన్ ద్వారా తమకు నచ్చిన కలర్ ఆప్షన్స్‌ ఎంచుకోవచ్చు. పజేరో స్పోర్ట్ మరియు పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ వేరియంట్లకు కూడా ఒకే తరహా కలర్ ఆప్షన్స్ మరియు ప్యాట్రన్స్ లభ్యమవుతోంది. కస్టమర్లు తమకు నచ్చిన రంగుల్లో ఎంచుకునే పజేరో స్పోర్ట్ సాధారణ పజేరో కంటే చాలా అట్రాక్టిక్‌గా మరియు విభిన్నంగా ఉంటుంది.

పజేరో స్పోర్ట్ కోసం 30 కలర్ ఆప్షన్స్ పరిచయం చేసిన మిత్సుబిషి

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీలలో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకోవడం లేదు. ఇందులో అదే మునుపటి 3.4-లీటర్ కెపాసిటి గల టుర్భోచార్జ్‌డ్ నాలుగు సిలండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇది 175బిహెచ్‌పి పవర్ మరియు మ్యాన్యువల్ వేరియంట్లో 400ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా ఆటోమేటిక్ వేరియంట్లో 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

పజేరో స్పోర్ట్ కోసం 30 కలర్ ఆప్షన్స్ పరిచయం చేసిన మిత్సుబిషి

మిత్సుబిషి పజేరో స్పోర్ట్ 4X4 మ్యాన్యువల్ మరియు 4X2 ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో అదే విధంగా పజేరో స్పోర్ట్ సెలక్ట్ ప్లస్ వేరియంట్ కేవలం 4X4 ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. నూతన కలర్ ఆప్షన్స్ మినహాయిస్తే ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు.

పజేరో స్పోర్ట్ కోసం 30 కలర్ ఆప్షన్స్ పరిచయం చేసిన మిత్సుబిషి

మిత్సుబిషి 2012లో పజేరో స్పోర్ట్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. అప్పట్లో పాత తరం ఫోర్డ్ ఎండీర్ మరియు టయోటా ఫార్చ్య్యూనర్ ఎస్‌యూవీలకు గట్టిపోటీనిచ్చేది. ఫోర్డ్ మరియు టయోటా కంపెనీలు తమ ఎస్‌యూవీలను అప్‌డేట్ చేసింది. అయితే, మిత్సుబిషి మాత్రం ఎలాంటి అప్‌డేట్స్ నిర్వహించకుండా అదే పాత మోడల్‌ను యథావిధిగా విక్రయిస్తోంది.

పజేరో స్పోర్ట్ కోసం 30 కలర్ ఆప్షన్స్ పరిచయం చేసిన మిత్సుబిషి

మిత్సుబిషి పజేరో సేల్స్ తగ్గిపోతున్నాయనే కారణంతో ఈ స్ల్పాష్ ఎడిషన్ పేరుతో పలు కాస్మొటిక్ మరియు కలర్ అప్‌డేట్స్ ఆప్షన్‌ ప్రవేశపెట్టింది. మిత్సుబిషి పజేరో స్పోర్ట్ స్ల్పాష్ ధరల శ్రేణి రూ. 28.5 లక్షల నుండి రూ. 30.50 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.

పజేరో స్పోర్ట్ కోసం 30 కలర్ ఆప్షన్స్ పరిచయం చేసిన మిత్సుబిషి

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మిత్సుబిషి విపణిలోకి పజేరే స్పోర్ట్ స్ల్పాష్ ను పరిచయం చేసింది. పజేరో స్పోర్ట్ సేల్స్ పెంచుకునేందుకు స్ల్పాష్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. మిత్సుబిషి పజేరో స్పోర్ట్ స్ల్పాష్ వేరియంట్ ద్వారా పజేరో ఎస్‌యూవీలను 30 రకాల విభిన్న కలర్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Mitsubishi Pajero Sport Splash With Custom Colour Options Launched In India
Story first published: Saturday, July 7, 2018, 18:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X