2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఆవిష్కరణ

బిఎమ్‌డబ్ల్యూ సరికొత్త 2019 ఎక్స్5 ఎస్‌‌యూవీని ఆవిష్కరించింది. బిఎమ్‍‌డబ్ల్యూ తాజాగా నాలుగవ తరానికి చెందిన ఎక్స్5 ఎస్‌యూవీని భారీ మార్పులు మరియు చేర్పులతో సరికొత్త ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసింది.

By Anil Kumar

బిఎమ్‌డబ్ల్యూ సరికొత్త 2019 ఎక్స్5 ఎస్‌‌యూవీని ఆవిష్కరించింది. బిఎమ్‍‌డబ్ల్యూ తాజాగా నాలుగవ తరానికి చెందిన ఎక్స్5 ఎస్‌యూవీని భారీ మార్పులు మరియు చేర్పులతో సరికొత్త ఫ్లాట్‌ఫామ్ మీద అభివృద్ది చేసింది.

ప్రస్తుతం ఇండియాలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ప్రారంభ వేరియంట్ ధర రూ. 74.30 లక్షలు ఎక్స్-షోరూమ్‌(ఢిల్లీ)గా ఉంది.

2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

వచ్చే ఏడాది బిఎమ్‌డబ్ల్యూ 20వ వార్షికోత్సనాన్ని పురస్కరించుకుని ఈ సరికొత్త ఎక్స్5 ప్రీమియం ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. 2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో కిడ్నీ గ్రిల్, కండలు తిరిగిన రూపంలో ఉన్న ఫ్రంట్ బంపర్ మరియు లార్జ్ ఎయిర్ ఇంటేకర్ ఉన్నాయి.

2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, మునుపటి మోడల్ కంటే చాలా క్లియర్‌గా ఉన్న క్యారెక్టర్ లైన్స్ ఉన్నాయి. సరికొత్త ఎక్స్5 మునుపటి వెర్షన్ కంటే 35ఎమ్ఎమ్ పొడవు, 32ఎమ్ఎమ్ వెడల్పు మరియు 11ఎమ్ఎమ్ ఎత్తుగా ఉంది.

2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 రియర్ డిజైన్‌లో రీడిజైన్ చేయబడిన న్యూ టెయిల్ ల్యాంప్స్ మరియు బంపర్ ఉన్నాయి. స్పాయిలర్ మరియు షార్క్ ఫిని యాంటెన్నా చాలా చక్కగా ఫిక్స్ చేశారు.

2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీని అల్యూమినియంతో ధృడంగా నిర్మించారు. గత మోడల్ కంటే 33 ఎక్కువ ధృడత్వాన్ని కలిగి ఉంది. నాయిస్, వైబ్రేషన్స్ మరియు హార్ష్‌నెస్ లెవల్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి.

2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

కొత్త తరం ఎక్స్5 ఎస్‍‌‌‌యూవీని నిర్మించిన ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద మూడవ తరానికి చెందిన అప్‌కమింగ్ ఎక్స్6 మరియు ఎక్స్7 ఎస్‌యూవీలను నిర్మించనుంది. సరికొత్త ఎక్స్5 ఎస్‌యూవీ 2019 మొదటి త్రైమాసికంలో ప్రపంచ విపణిలోకి విడుదలయ్యే అవకాశం ఉంది. దేశీయ విడుదల కూడా మొదటి రెండు మూడు నెలల్లోపే ఉండనుంది.

2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

ఇంటీరియర్‌లో డ్యాష్‌బోర్డ్ చాలా మోడ్రన్‌గా మరియు అసాధారణంగా ఉంటుంది. అంతే కాకుండా, బిఎమ్‌డబ్ల్యూ లైనప్‌లో లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్ యూనిట్‌ వస్తున్న తొలి మోడల్ కూడా ఇదే. ఇందులో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన 12.3-అంగుళాల హెచ్ డిస్ల్పే ఉంది.

2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

ఎక్స్5 లోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 20జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, యూఎస్‌బి మరియు బ్లూటూత్ కనెక్టివిటిని సపోర్ట్ చేస్తుంది. మరియు వెహికల్‌కు సంభందించిన రియల్ టైమ్ డాటాను అందిస్తుంది.

2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌5 ఎస్‌యూవీలోని ఇతర ఫీచర్లు...

  • ఆప్షనల్ ఆఫ్-రోడ్ ప్యాకేజి
  • టు-పీస్ టెయిల్ గేట్ కోసం ఆప్షనల్ ఎలక్ట్రానిక్ కంట్రోల్స్
  • ఆప్షనల్ లేజర్ హెడ్‌ల్యాంప్స్
  • అత్యుత్తమ అండర్ బాడీ ప్రొటెక్షన్
  • బోయర్స్ అండ్ విల్కిన్స్ ఆడియో సిస్టమ్
  • స్పీచ్ రికగ్నిషన్ మరియు గెస్చర్ కంట్రోల్స్
  • అప్‌గ్రేడెడ్ ఎక్స్‌డ్రైవ్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్
  • 2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

    సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీ తొలుత ఎక్స్‌డ్రైవ్40ఐ వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది. సాంకేతికంగా ఇందులో 340బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 3.0-లీటర్ కెపాసిటి గల 6-సిలిండర్ ఇన్-లైన్ పెట్రోల్ ఇంజన్ ఉంది.

    2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

    అయితే, ఇండియన్ మార్కెట్లో ఇది వరకే అందుబాటులో ఉన్న ఇన్-లైన్ ఆరు సిలిండర్ల 3.0-లీటర్ డీజల్ ఇంజన్ రానుంది. ఇది 265బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లు కూడా 8-స్పీడ్ జడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

    2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

    బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఒక్కసారి లాంచ్ అయితే ఆడి క్యూ7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్, జాగ్వార్ ఎఫ్-పేస్ మరియు వోల్వో ఎక్స్‌సి 90 మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది. దీని ప్రారంభ ధర రూ. 80 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉండవచ్చు.

    2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

    అప్‌కమింగ్ 2019 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ పనితీరు దాదాపు అన్ని అంశాల పరంగా భారీ మార్పులకు గురయ్యింది. దేశీయ విపణిలో నాలుగవ తరానికి చెందిన ఎక్స్5 అతి ముఖ్యమైన ఎస్‌యూవీగా నిలుస్తోంది. అంతే కాకుండా, దీనిని డీజల్ మరియు హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్‌‌లలో కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: New BMW X5 2019 Unveiled: Specs, Features, Changes, Launch Details & More
Story first published: Saturday, June 9, 2018, 18:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X