విపణిలోకి 7-సీటర్ మారుతి సుజుకి సోలియో

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్ కోసం వ్యాగన్ఆర్ ఆధారిత సరికొత్త 7-సీటర్ సోలియో ఎమ్‌పీవీని ఖరారు చేసింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ప్రొడక్షన్ దశకు చేరుకున్న ఏడు మంది ప్రయాణించే వ్యాగన్ఆర్ వాహనాన్న

By Anil Kumar

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్ కోసం వ్యాగన్ఆర్ ఆధారిత సరికొత్త 7-సీటర్ సోలియో ఎమ్‌పీవీని ఖరారు చేసింది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, ప్రొడక్షన్ దశకు చేరుకున్న ఏడు మంది ప్రయాణించే వ్యాగన్ఆర్ వాహనాన్ని సెప్టెంబరు 2018 నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

మారుతి సోలియో

వ్యాగన్ఆర్ ఆధారిత సోలియో సబ్-4 మీటర్ మినీ ఎమ్‌పీవీ. ఇందులో 5+2 సీటింగ్ సామర్థ్యం ఉంది. 2012లో ఆటో ఎక్స్ పో ఈవెంట్ జరిగే సమయంలో మారుతి సుజుకి ఈ సోలియో మినీ ఎమ్‌పీవీని ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. ఇప్పుడు అదే మోడల్ తెర మీదకు వచ్చింది.

మారుతి సోలియో

సోలియో రియర్ మరియు ఫ్రంట్ డిజైన్ ప్రస్తుతం ఉన్న మోడల్‌నే పోలి ఉంటుంది. అంతే కాకుండా, ఇందులో ఎలక్ట్రానిక్ స్లైడింగ్ డోర్లు కూడా రానున్నాయి. మారుతి సోలియో పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ అయితే మారుతి ఎర్టిగా క్రింది స్థానాన్ని భర్తీ చేసి, డాట్సన్ గో ప్లస్ ఎమ్‌పీవీకి గట్టి పోటీనివ్వనుంది.

మారుతి సోలియో

వ్యాగన్ఆర్ ఆధారిత సోలియో ఎమ్‌పీవీ ఇప్పటికే అంతర్జాతీయంగా పలు మార్కెట్లలో అందుబాటులో ఉంది. 7-సీటర్ సోలియో ఎమ్‌పీవీ 1.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తోంది. 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది 90బిహెచ్‌‌పి పవర్ మరియు 118ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark
మారుతి సోలియో

సరికొత్త 7-సీటర్ సోలియో ఎమ్‌పీవీని మారుతి సుజుకి పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేస్తే, అంతర్జాతీయ విపణిలో సోలియో లభించే అవే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లతో లభ్యం కానుంది. మారుతి కూడా వచ్చే సెప్టెంబర్ 2018 నాటికి విడుదల చేయడానికి ఉన్న అవకాశాలను అంచనా వేస్తోంది.

మారుతి సోలియో

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో పరిచయమయ్యే మారుతి సోలియో తొలు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో విడుదలయ్యి, తరువాత కాస్త ఆలస్యంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి సోలియో

కస్టమర్లు ఎంచుకోవడానికి పలు విభిన్న వేరియంట్లలో విడుదలయ్యే 7-సీటర్ మారుతి సోలియో ఎమ్‌‌పీవీ ఎక్స్-షోరూమ్‌ ధరల శ్రేణి రూ. 4.5 లక్షల నుండి రూ. 6.5 లక్షల మధ్య ఉండవచ్చు.

మారుతి సోలియో

1. మైలేజ్ ప్రియుల కోసం ఈ ఏడాది విడుదలవుతున్న కొత్త కార్లు

2.విపణలోకి రేంజ్ రోవర్ ఎవోక్ కన్వర్టిబుల్ విడుదల: ధర రూ. 69.53 లక్షలు

3.2018 ఎడిషన్ బజాజ్ పల్సర్ 150 ధరలు లీక్

4.భారతదేశపు చీపెస్ట్ బైకు మీద మరింత తగ్గిన ధరలు

5.రాంగ్ పార్కింగ్ చేశాడని 3 కోట్లు ఖరీదైన కారును నుజ్జు నుజ్జు చేశారు

Source: Team-BHP

Most Read Articles

English summary
Read In Telugu: New Seven-Seater Maruti WagonR Confirmed For The Indian Market
Story first published: Tuesday, March 27, 2018, 17:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X