ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ అంతర్జాతీయ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

ఫోర్డ్ ఇండియా ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ కార్లను దాదాపు సిద్దం చేసింది. సుదీర్ష రహదారి పరీక్షల అనంతరం కొత్త తరం ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను ప్రొడక్షన్ వెర్షన్‌లో విడు

By Anil Kumar

ఫోర్డ్ ఇండియా ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ కార్లను దాదాపు సిద్దం చేసింది. సుదీర్ష రహదారి పరీక్షల అనంతరం కొత్త తరం ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ కార్లను ప్రొడక్షన్ వెర్షన్‌లో విడుదలకు సిద్దం చేసింది. ఈ రెండు మోడళ్ల ఇండియా విడుదల మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా ఆవిష్కరిస్తున్నట్లు తెలిసింది.

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్

దేశీయ మార్కెట్లో ఈ రెండింటి విడుదలకు కొన్ని నెలల ముందుగా ప్రపంచ ఆవిష్కరణ చేయనుంది. ఫిగో మరియు ఆస్పైర్ రెండు ఫేస్‌లిఫ్ట్ కార్లను ప్రత్యేకించి ఎగుమతుల కోసం గుజరాత్‌లోని సనంద్ ప్లాంటులో ఉత్పత్పి చేస్తోంది.

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్

ఫిగో మరియు ఆస్పైర్ రెండు ఫేస్‌లిఫ్ట్ కార్లు కూడా మునుపటి మోడళ్లతో పోల్చుకుంటే అత్యాధునిక ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్‌తో వచ్చాయి. ఫోర్డ్ డ్రాగన్ సిరీస్ ఇంజన్ ఫ్యామిలీ నుండి సేకరించిన నూతన ఇంజన్లను కూడా వీటిలో పరిచయం చేసింది.

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్

2018 ఫోర్డ్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ విషయానిక వస్తే, ఫ్రంట్ డిజైన్‌లో అధునాతన ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ హైలైట్స్, పెద్ద పరిమాణంలో ఉన్న హెడ్‌ల్యాంప్స్ మరియు రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ ఉన్నాయి. పాత మోడల్‌తో పోల్చుకుంటే ఓవరాల్ డిజైన్‌లో గుర్తించదగిన మార్పులే సంభవించాయి.

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్

ఫిగో ఇంటీరియర్‌లో ఉన్న డ్యాష్‌బోర్డ్ ఇటీవల విడుదలైన ఫ్రీస్టైల్ క్రాస్-హ్యాచ్‌ను పోలి ఉంటుంది. అంతే కాకుండా, ఫోర్డ్ సింక్3 టెక్నాలజీ, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 6.5-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఇవే మార్పులు ఆస్పైర్‌లో కూడా చోటు చేసుకున్నాయి.

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఫోర్డ్ డ్రాగన్ ఇంజన్ సిరీస్ నుండి సేకరించిన 1.2-లీటర్ కెపాసిటి గల 3-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 95బిహెచ్‌పి పవర్ మరియు 120ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్

డీజల్ ఇంజన్ విషయానికి వస్తే, అదే మునుపటి 1.5-లీటర్ ఇంజన్ యథావిధిగా వస్తోంది. ఇది గరిష్టంగా 99బిహెచ్‌పి పవర్ మరియు 215ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. అయితే, పెట్రోల్ వెర్షన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే అవకాశం ఉంది.

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్

ఈ ఏడాది ఫోర్డ్ విడుదల చేసిన ఫ్రీస్టైల్ క్రాసోవర్ కారులో కూడా ఇవే ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మైలేజ్ 19కిమీలు మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ మైలేజ్ 24.4కిమీలుగా ఉంది.

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఇండియా విపణిలో మంచి సేల్స్ సాధిస్తున్న కార్లలో పెద్దగా చెప్పుకోదగ్గ మోడళ్లు ఏవీ లేవు. ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీకి తోడుగా ఇటీవల ఫ్రీస్టైల్ కారును లాంచ్ చేసింది. పాత మోడళ్ల ప్రక్షాళనలో భాగంగా పాత తరం ఫిగో మరియు ఆస్పైర్ కార్లను భారీ మార్పులు చేర్పులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో డెవలప్ చేసింది.

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్

అతి త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న ఫిగో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఆస్పైర్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ సెడాన్ మోడళ్లు మారుతి స్విఫ్ట్ మరియు డిజైర్ కార్లకు గట్టి పోటీనివ్వనున్నాయి.

Most Read Articles

Read more on: #ford #ఫోర్డ్
English summary
Read In Telugu: New Ford Figo And Ford Aspire Facelift Unveiled — India Launch Soon
Story first published: Thursday, June 21, 2018, 17:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X