పక్కా ప్రణాళికతో 2018 మారుతి స్విఫ్ట్‌కు చెక్ పెట్టిన ఫోర్డ్

ఫోర్డ్ తమ ఫిగో ఫేస్‌లిఫ్ట్(Ford Figo Facelift) ఫోటోలను అధికారికంగా రివీల్ చేసింది. ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా ఎన్నో మార్పులకు గురైన ఫిగో ఫేస్‌లిఫ్ట్‌ను అంతర్జాతీయ విపణిలో కెఎ+ పేరుతో విక్రయిస్తోంది.

By Anil

Recommended Video

Auto Rickshaw Explodes In Broad Daylight

ఫోర్డ్ ఇండియా విభాగం తమ ఫిగో ఫేస్‌లిఫ్ట్ ఫోటోలను అధికారికంగా రివీల్ చేసింది. ఎక్ట్సీరియర్ డిజైన్ పరంగా ఎన్నో మార్పులకు గురైన ఫిగో ఫేస్‌లిఫ్ట్‌ను అంతర్జాతీయ విపణిలో కెఎ+ పేరుతో విక్రయిస్తోంది.

ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి అతి త్వరలో విడుదల చేయనున్న కొత్త తరం 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లక్ష్యంగా చేసుకుని మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కారుకు గట్టి పోటీనిచ్చేలా రూపొందించింది.

ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న హెడ్ ల్యాంప్స్, క్రోమ్ పట్టీ గల సరికొత్త ఫ్రంట్ గ్రిల్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో అధునాతన అప్‌డేటెడ్ డ్యాష్‌బోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‍‌కు ఒక సరికొత్త రూపాన్ని తీసుకొచ్చింది.

ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో ఫోర్డ్ ఇటీవల ఆవిష్కరించిన ఫ్రీస్టైల్ క్రాసోవర్‌లో ఉన్న సరికొత్త 6.5-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చింది. ఇది ఫోర్డ్ సింక్3 టెక్నాలజీ, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి కనెక్టివిటి ఫీచర్లను కలిగి ఉంది.

ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ ఆవిష్కరించిన సరికొత్త ఫిగో హ్యాచ్‌బ్యాక్ 69బిహెచ్‌పి మరియు 84బిహెచ్‌పి రెండు రకాలుగా పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు యూరోపియన్ మార్కెట్ కోసం 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లను అందించింది.

ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్

ఇండియన్ మార్కెట్ కోసం ఫోర్డ్ తమ ఫిగో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో 95బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించే అవకాశం ఉంది. ఫిగో ఫేస్‌లిఫ్ట్ విపణిలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10(82బిహెచ్‌పి) మరియు న్యూ మారుతి స్విఫ్ట్( 82బిహెచ్‌పి) కంటే అత్యంత శక్తివంతమైన క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్.

ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ తమ ఫిగో ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను 2018 మధ్య భాగానికి విక్రయాలకు సిద్దంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. సెగ్మెంట్ లీడర్‌గా నిలిచేందుకు అత్యంత పోటీతత్వమున్న ధరలో అన్ని వేరియంట్లను రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షల మధ్య రేంజ్‌లో ఉండేలా విడుదల చేయనుంది.

ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్

ఫోర్డ్ అంతర్జాతీయ విపణిలో కెఎ+ ఆధారిత క్రాసోవర్ వెర్షన్ కెఎ+ యాక్టివ్ కారును ఆవిష్కరించింది. ఇది దేశీయంగా ఇటీవల ఆవిష్కరించిన ఫ్రీస్టైల్ క్రాసోవర్ హ్యాచ్‌బ్యాక్‌ను తలపిస్తుంది. స్విఫ్ట్ మరియు గ్రాండ్ ఐ10 లను ఎలాగైనా ఎదుర్కునేందుకు యూరోపియన్ వెర్షన్ కెఎ+ ప్లస్ ఫిగో ఫేస్‌లిఫ్ట్ రూపంలో పరిచయం చేస్తోంది.

ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త ఫోర్డ్ ఫిగో ఫేస్‌లిఫ్ట్ రెగ్యులర్ ఫిగోతో పోల్చుకుంటే అత్యంత పదునైన డిజైన్ మరియు స్పోర్టివ్ లక్షణాలను కలిగి ఉంది. అత్యాధునిక స్టైలింగ్ మార్పులతో పాటు ప్రీమియమ్ ఫీల్ కలిగించే ఇంటీరియర్ మరియు చాలా వరకు నూతన ఫీచర్లతో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఫిగో ఫేస్‌లిఫ్ట్ సిద్దమైంది.

పోటీని తట్టుకుని నిలబడేందుకు వివిధ వేరియంట్ల ఆధారంగా ధరలను ఆచితూచి నిర్ణయిస్తే సక్సెస్ అందుకోవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Ford Figo Facelift (New Maruti Swift Rival) Revealed — Expected Launch Date, Features & Specs
Story first published: Tuesday, February 6, 2018, 14:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X