కొత్త తరం వోక్స్‌వ్యాగన్ పోలో రీకాల్

By Anil Kumar

జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ తమ కొత్త తరం పోలో హ్యాచ్‌బ్యాక్ మోడల్‌ను రీకాల్ చేసినట్లు ప్రకటించింది. అత్యంత అరుదుగా ఎదురయ్యే వెనుక సీట్ బెల్ట్ లాక్‌లో లోపం కారణంగా వోక్స్‌వ్యాగన్ పోలో రీకాల్‌ చేసింది.

ఇదే సమస్యతో కొత్త తరం వోక్స్‌వ్యాగన్ పోలో మోడల్‌తో పాటు సియట్ ఇబ్జియా మరియు అరోనా కార్లు కూడా రీకాల్ అయ్యాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో రీకాల్

వోక్స్‌వ్యాగన్ పోలో వెనుక వరుసలోని మధ్య సీటులో ప్రయాణిస్తున్నపుడు సీట్ బెల్ట్ ఆటోమేటిక్‌గా రిలీజ్ అవుతోంది. సడెన్‌గా లేన్ చేంజ్ అయినప్పుడు, అత్యధిక వేగం వద్ద మలుపులు తీసుకున్నపుడు సీట్ బెల్ట్ అన్‌లాక్ అవుతున్నట్లు గుర్తించారు.

వోక్స్‌వ్యాగన్ పోలో రీకాల్

వోక్స్‌వ్యాగన్ తమ కస్టమర్ల భద్రత దృష్ట్యా ఈ లోపం ఉన్నట్లు గుర్తించిన పోలో హ్యాచ్‌కార్లను రీకాల్ చేసింది. సమస్యను గుర్తించి, పరిష్కరించేందుకు రీకాల్ అయిన పోలో కార్లలోని మధ్య సీటును వినియోగించవద్దని వోక్స్‌వ్యాగన్ తమ కస్టమర్లకు సూచించింది.

వోక్స్‌వ్యాగన్ పోలో రీకాల్

వోక్స్‌వ్యాగన్ పోలో కారులోని ప్రస్తుతం రియర్ మిడల్ సీట్ బెల్ట్ లాక్ రీడిజైన్ చేస్తోంది. తుది పరీక్షలు పూర్తయితే, ప్రస్తుతం తయారవుతున్న మరియు రీకాల్ చేసిన అన్ని కొత్త తరం పోలో కార్లలో నూతన సీట్ బెల్ట్ లాక్ అందివ్వడానికి సిద్దమవుతోంది.

వోక్స్‌వ్యాగన్ పోలో రీకాల్

పూర్తి స్థాయిలో అనుమతులు లభించిన తరువాత, రీకాల్ అయిన పోలో కార్ల కోసం వోక్స్‌వ్యాగన్ ప్రత్యేక రీకాల్ క్యాంపెయిన్ సర్వీసును అధికారికంగా ప్రారంభించనుంది. పోలో కస్టమర్లు సీట్ బెల్ట్ మార్పిడి కోసం సమీపంలో ఉన్న డీలర్ వద్ద అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. వోక్స్‌వ్యాగన్ డీలర్లు సమస్యాత్మకంగా ఉన్న సీట్ బెల్ట్‌ను ఉచితంగా మార్చుతుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో రీకాల్

కొత్త తరానికి చెందిన వోక్స్‌వ్యాగన్ పోలో తొలుత 2017లో పరిచయం అయ్యింది. వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ హ్యాచ్‌బ్యాక్ ప్రేరణతో న్యూ జనరేషన్ పోలో కారును డిజైన్ చేసింది. వోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్ మీద రూపొందించిన పోలో ఎక్కువ పొడవు మరియు మరింత విశాలంగా ఉంటుంది. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే మెరుగైన ఇంటీరియర్‌తో అత్యాధునిక ఫీచర్లు పరితచమయ్యాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో రీకాల్

కొత్త తరం వోక్స్‌వ్యాగన్ పోలో హ్యాచ్‌బ్యాక్ ఫ్రంట్ డిజైన్‌లో నూతన ఫ్రంట్ గ్రిల్, ముందు మరియు వెనుక వైపున అధునాతన బంపర్‌తో పాటు పూర్తిగా రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ ఉంది. మునుపటి పోలో కారుతో పోల్చుకుంటే స్పోర్టివ్ శైలిలో ఉంటుంది.

వోక్స్‌వ్యాగన్ పోలో రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వెనుక వరుసలో మిడిల్ సీట్ బెల్ట్ లాక్ సమస్య కారణంగా వోక్స్‌వ్యాగన్ కొత్త తరం పోలో హ్యాచ్‌బ్యాక్‌ను రీకాల్ చేసింది. సమస్య చాలా చిన్నదే అయినప్పటికీ, కస్టమర్ల భద్రత దృష్ట్యా రీకాల్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. రీకాల్ అయిన పోలో కార్ల సంఖ్య ఎంత అనేది ఇంకా తెలియరాలేదు, అతి త్వరలో రీకాల్ మరియు సమస్య పరిష్కారానికి పూర్తి సమాచారాన్ని వెల్లడించనుంది.

వోక్స్‌వ్యాగన్ ఈ న్యూ జనరేషన్ పోలో హ్యాచ్‌బ్యాక్ కారును 2019 ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Read In Telugu: New-Gen Volkswagen Polo Recalled Over Seat Belt Issue
Story first published: Saturday, May 12, 2018, 16:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X