మారుతి వితారా బ్రిజాకు పోటీగా హోండా నుండి సరికొత్త ఎస్‌యూవీ

By Anil Kumar

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలోకి సరికొత్త సబ్-ఫోర్-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసే ఆలోచనలో ఉంది. తాజాగా అందిన సమాచారం మేరకు, హోండా మోటార్స్ భారతదేశపు ధీర్ఘ-కాలిక వ్యాపార ప్రణాళికల మీద దృష్టి సారించినట్లు తెలిసింది. అందులో భాగంగానే అమేజ్ సెడాన్ ఆధారంగా రూపొందించే ఎస్‌యూవీని భారత విపణి కోసం ఖరారు చేసింది.

హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ

కంపెనీ యొక్క వ్యూహాత్మక ప్రణాళికల్లో భాగంగా హోండా అమేజ్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఐదు కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వీటి రెండు మోడళ్లు ఎస్‌యూవీ వాహనాలు అని తెలుస్తోంది.

హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ

హోండా అమేజ్ కారును కంపెనీ యొక్క జీఎస్‌పీ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద ఎన్నో ఉత్పత్తులను రూపొందించారు, ఈ ఫ్లాట్‌ఫామ్ మీద తయారయ్యి ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల్లో అమేజ్, బ్రియో, డబ్ల్యూఆర్-వి మరియు మొబీలియో వంటి మోడళ్లు ఉన్నాయి.

హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ

భారత్‌లో మరియు ఆగ్నేయాసియా మార్కెట్లలో జీఎస్‌పి (GSP) కంపెనీకి లాభదాయకమైన ఫ్లాట్‌ఫామ్‌గా నిలిచింది. దాంతో జపాన్ దిగ్గజం హోండా, ఈ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఏషియన్ మార్కెట్ కోసం పలు ఉత్పత్తులను అభివృద్ది చేయాలని భావిస్తోంది.

హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ

హోండా భవిష్యత్ ప్రణాళిక మేరకు, కంపెనీ తొలుత హ్యాచ్‌బ్యాక్, సబ్-ఫోర్-మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మరియు ఫుల్-సైజ్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉంది. సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న మారుతి వితారా బ్రిజా, టాటా నెక్సాన్ మరియు ఫోర్డ్ ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీలకు సరాసరి పోటీనివ్వనుంది.

హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ

హోండా విక్రయిస్తున్న కొన్ని మోడళ్లు కొన్ని సెగ్మెంట్ల పరంగా హ్యుందాయ్ ఇండియా మార్కెట్ వాటాను కొల్లగొడుతున్నాయి. అంతే కాకుండా, ఇరు కంపెనీల మధ్య సరాసరి పోటీని సృష్టించేందుకు పలు మోడళ్లను ప్రవేశపెట్టి రెండింటి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.

హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ

జీఎస్‌పీ ఫ్లాట్‌ఫామ్ మీద తయారవుతున్న ఉత్పత్తుల కోసం దాదాపు దేశీయంగా తయారయ్యే విడి భాగాలను ఉపయోగిస్తున్నారు, కాబట్టి నూతన ఉత్పత్తులను అత్యంత పోటీతత్వముతో కూడిన ధరలతో అందించవచ్చు. ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్‌లోని ప్రొడక్షన్ ప్లాంట్లలో ఉత్పత్తి చేపడుతోంది.

హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ

హోండా తమ నూతన ఉత్పత్తుల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏదేమైనప్పటికీ, సమాచార వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు, పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ మాత్రం ఖాయం అని తెలుస్తోంది. దీనిని సుమారుగా రూ. 7 లక్షల నుండి 10 లక్షల ధరల శ్రేణిలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా మోటార్స్ జీఎస్‌పీ ఫ్లాట్‌ఫామ్ మీద తీసుకొచ్చిన ఉత్పత్తులతో మంచి ఫలితాలు కనబరుస్తోంది. ఇటీవల విడుదల చేసిన హోండా అమేజ్ అత్యధిక సేల్స్ సాధిస్తోంది. ఏదేమైనప్పటికీ, హోండా భవిష్యత్ ప్రణాళికలను చూస్తే మార్కెట్లో ఉన్న మారుతి వితారా బ్రిజా మరియు హ్యుందాయ్ క్రెటా మోడళ్లకు పోటీని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైందని తెలుస్తోంది.

Source: Livemint

Most Read Articles

English summary
Read In Telugu: Honda Amaze Based New Sub-Four-Metre SUV In The Works — To Rival The Maruti Vitara Brezza
Story first published: Monday, August 20, 2018, 19:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X