నూతన అధ్యయనానికి సిద్దమైన హోండా మోటార్స్

హోండా మోటార్స్ విపణిలోకి సరికొత్త హోండా అమేజ్ విడుదలకు సిద్దమైంది. హోండా మోటార్స్ భారీ మార్పులు చేర్పులతో రూపొందించిన కొత్త తరం అమేజ్ కారుతో ఇండియన్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఒక నూతన

By Anil Kumar

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్స్ విపణిలోకి సరికొత్త హోండా అమేజ్ విడుదలకు సిద్దమైంది. హోండా మోటార్స్ భారీ మార్పులు చేర్పులతో రూపొందించిన కొత్త తరం అమేజ్ కారుతో ఇండియన్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఒక నూతన అధ్యయనానికి తెరలేపింది.

2018 హోండా అమేజ్

హోండా మోటార్స్ కొత్త తరం హోండా అమేజ్ కారును మే 16, 2018న విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సరికొత్త అమేజ్ మీద హోండా ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా డీలర్ల వద్ద రూ. 21,000 లు చెల్లించి హోండా అమేజ్‌ను ముందస్తుగా చెల్లించుకోవచ్చు.

2018 హోండా అమేజ్

హోండా మోటార్స్ నూతన అమేజ్‌ను ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో మొట్టమొదటిసారిగా ఆవిష్కరించింది. మునుపటి తరానికి చెందిన అమేజ్‌తో పోల్చుకుంటే డిజైన్ పరంగా ఇందులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

2018 హోండా అమేజ్

నూతన ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించడంతో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ పూర్తిగా ఒక కొత్త మరియు లగ్జరీ ఫీల్ కలిగిస్తుంది. నూతన హోండా అమేజ్ ఎక్ట్సీరియర్ డిజైన్ హోండా సిటీ నుండి పొందింది. ఈ సెడాన్‌లో పదునైన మరియు కండలు తిరిగిన డిజైన్ మరియు అగ్రెసివ్ ఫ్లాట్ బానెట్ డిజైన్ కలిగి ఉంది.

2018 హోండా అమేజ్

ప్రత్యేకించి ఫ్రంట్ డిజైన్ అచ్చం హోండా సిటీనే పోలి ఉంటుందని చెప్పవచ్చు. ముందు వైపున హోండా లోగో గల సరికొత్త క్రోమ్ గ్రిల్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడిపుంతో ఉన్న నూతన యాంగులర్ హెడ్‌ల్యాంప్స్ ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా ఉన్నాయి.

2018 హోండా అమేజ్

సరికొత్త హోండా అమేజ్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. రియర్ డిజైన్‌లో డిక్కీ మీదుగా వెళ్లే మందంగా ఉన్న క్రోమ్ పట్టీ మరియు ఇంటిగ్రేటెడ్ సి-ఆకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ లైట్లు అదే విధంగా డిక్కీ అంచు మీద చిన్న స్పాయిలర్ కూడా కలదు.

2018 హోండా అమేజ్

2018 హోండా అమేజ్ కారును నూతన ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించడంతో, ఎక్ట్సీరియర్ డిజైన్‌తో పాటు ఇంటీరియర్ కూడా మరింత విశాలంగా సౌకర్యంగా మారిపోయింది. క్యాబిన్ స్పోస్ కూడా ఎక్కువగానే ఉంది. ఇంటీరియర్‌లో అత్యంత ఆకర్షణీయమైన బీజి మరియు బ్లాక్ డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డు ఉంది.

2018 హోండా అమేజ్

టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌, క్లైమేట్ కంట్రోల్ కోసం టచ్ బటన్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, స్టార్ట్/స్టాప్ బటన్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు గల కెమెరాలు ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

2018 హోండా అమేజ్

సాంకేతికంగా కొత్త తరం హోండా అమేజ్ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యం కానుంది. పెట్రోల్ ఇంజన్ 88బిహెచ్‌పి పవర్ మరియు 109ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా, 100బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 హోండా అమేజ్

హోండా అమేజ్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. ఇప్పటి వరకు మరే ఇతర కాంపాక్ట్ సెడాన్ కార్లలో రానటువంటి పెడల్ షిఫ్టర్లు అమేజ్ ఆటోమేటిక్ వేరియంట్లో వస్తున్నాయి.

2018 హోండా అమేజ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎక్ట్సీరియర్ మరియు ఇటీరియర్ పరంగా భారీ మార్పులకు గురైన 2018 హోండా అమేజ్‌ విపణిలో ఉన్న హ్యుందాయ్ ఎక్సెంట్, మారుతి సుజుకి డిజైర్ మరియు టాటా టిగోర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. అత్యాధునిక ఇంటీరియ్ ఫీచర్లు మరియు ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. 2018 హోండా అమేజ్ రూ. 5.5 లక్షల నుండి రూ. 9 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో లభ్యం కానుంది.

Most Read Articles

English summary
Read In Telugu: New Honda Amaze 2018 Launch Date Confirmed; Expected Price, Features, Specifications & Images
Story first published: Tuesday, April 24, 2018, 20:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X