2018 హోండా అమేజ్ రికార్డ్ సేల్స్: హోండా ఇండియా చరిత్రలో ఇదే అధికం

హోండా మోటార్స్ ఇటీవల ఇండియన్ మార్కెట్లోకి కొత్త తరానికి చెందిన సరికొత్త హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును లాంచ్ చేసింది. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తాజాగా విపణిలోకి ప్రవేశపెట్టిన అమేజ్ సెడాన్ ఇప్ప

By Anil Kumar

హోండా మోటార్స్ ఇటీవల ఇండియన్ మార్కెట్లోకి కొత్త తరానికి చెందిన సరికొత్త హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును లాంచ్ చేసింది. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తాజాగా విపణిలోకి ప్రవేశపెట్టిన అమేజ్ సెడాన్ ఇప్పుడు హోండా వారి బెస్ట్ సెల్లింగ్ మోడల్ సిటీ సెడాన్ సేల్స్‌ను దాటేసింది.

సరికొత్త హోండా అమేజ్ గడిచిన మే 2018 నెలలో ఏకంగా 9,789 యూనిట్ల సేల్స్ సాధించింది.

2018 హోండా అమేజ్ రికార్డ్ సేల్స్

ఇప్పటి వరకు హోండా ఇండియా చరిత్రలో గరిష్ట విక్రయాలు సాధించిన ఏకైక మోడల్ అమేజ్. మే 2018లో హోండా కార్స్ ఇండియా 41 శాతం మేర వృద్దిని నమోదు చేసుకోవడంలో హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ సేల్స్ ఎంతగానో దోహదపడ్డాయి.

2018 హోండా అమేజ్ రికార్డ్ సేల్స్

హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెటింగ్ విభాగాధిపతి రాజేష్ గోయెల్ మాట్లాడుతూ, " చివరి నెలలో కస్టమర్ల డిమాండుకు తగ్గట్లుగా హోండా అమేజ్ ప్రొడక్షన్‌కు అధికి విలువనిచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా, రానున్న నెలలో ఇదే తరహా విక్రయాలను కొనసాగిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు."

2018 హోండా అమేజ్ రికార్డ్ సేల్స్

హై క్లాస్ బోల్డ్ డిజైన్, సౌకర్యవంతమైన మరియు విశాలమైన ఇంటీరియర్, అత్యాధునిక ఇంజన్ టెక్నాలజీ మరియు అద్భుతమైన డ్రైవింగ్ అంశాల పరంగా సరికొత్త హోండా అమేజ్ కస్టమర్ల మన్ననలు పొందుతున్నట్లు చెప్పుకొచ్చాడు.

2018 హోండా అమేజ్ రికార్డ్ సేల్స్

పాత అమేజ్‌తో పోల్చుకుంటే ఒక కొత్త డిజైన్ శైలిలో వచ్చిన కొత్త తరం హోండా అమేజ్‌లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా భారీ మార్పులు చేటు చేసుకున్నాయి. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే పొడవు 5ఎమ్ఎమ్ మరియు వెడల్పు 15ఎమ్ఎమ్ వరకు పెరిగింది.

2018 హోండా అమేజ్ రికార్డ్ సేల్స్

సబ్-ఫోర్ మీటర్ సెగ్మెంట్లోనే అత్యంత సౌకర్యవంతమైన కాంపాక్ట్ సెడాన్‌గా నిలిచింది. 2018 హోండా అమేజ్ పాత మోడల్ కంటే తేలికగా ఉంది. దీని మొత్తం బరువు 905 నుండి 1,039 కిలోల మధ్య ఉంటుంది.

2018 హోండా అమేజ్ రికార్డ్ సేల్స్

సాంకేతికంగా హోండా అమేజ్‌లో అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌లు యథావిధిగా వచ్చాయి. వీటిలో, పెట్రోల్ వెర్షన్ 89బిహెచ్‌పి-110ఎన్ఎమ్ మరియు డీజల్ వెర్షన్ 99బిహెచ్‌పి-200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఇంజన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకోవచ్చు.

2018 హోండా అమేజ్ రికార్డ్ సేల్స్

2018 హోండా అమేజ్ నాలుగు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటిలో, పవర్ ఫోల్డింగ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2018 హోండా అమేజ్ రికార్డ్ సేల్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా అమేజ్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.59 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. సబ్-ఫోర్-మీటర్ కాంపాక్ట్ సెడాన్ విపణిలో ఉన్న మారుతి డిజైర్, ఫోర్డ్ ఆస్పైర్, వోక్స్‌వ్యాగన్ అమియో మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. హోండా అమేజ్ ఫలితాలు ఇప్పుడు సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న మారుతి డిజైర్‌కు దడ పుట్టిస్తోంది.

Most Read Articles

English summary
Read In Telugu: All-New Honda Amaze Sales Cross 9000 Units In May 2018 — Honda Registers 41 Percent Sales Growth
Story first published: Monday, June 4, 2018, 13:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X