హోండా సిఆర్-వి విడుదల ఖరారు: విడుదల వివరాల కోసం...

హోండా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో కొత్త తరం సిఆర్-వి ఎస్‌యూవీని ఆవిష్కరించింది. తాజాగా అందిన సమాచారం మేరకు, హోండా సిఆర్-వి ఆక్టోబర్ 2018లో ఇండియన్ మార

By Anil Kumar

హోండా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో కొత్త తరం సిఆర్-వి ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కంపెనీ యొక్క సరికొత్త క్రాసోవర్ ఎస్‌యూవీని ప్రత్యేకించిన ఇండియన్ మార్కెట్ కోసం ఖరారు చేసినట్లు అప్పట్లోనే హోండా వెల్లడించింది.

అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, హోండా సిఆర్-వి ఆక్టోబర్ 2018లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలవుతున్నట్లు తెలిసింది.

హోండా సిఆర్-వి విడుదల ఖరారు

అతి త్వరలో విడుదల కానున్న హోండా సిఆర్-వి ఎస్‌యూవీ మునుపటి వెర్షన్ కంటే చాలా పెద్దగా ఉంటుంది. మరియు ఇందులో వస్తోన్న మరో కీలకమైన మార్పు మూడు వరుసల సీటింగ్ లేఔట్. మరో ప్రధాన హైలెట్ ఏమిటంటే కొత్త తరం హోండా సిఆర్-వి డీజల్ ఇంజన్ వేరియంట్లో కూడా పరిచయం అవ్వడం.

హోండా సిఆర్-వి విడుదల ఖరారు

హోండా సిఆర్-వి డీజల్ వేరియంట్లో 1.6-లీటర్ సామర్థ్యం టుర్భోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు. హోండా ఎర్త్ డ్రీమ్స్ ఇంజన్ ఫ్యామిలీ నుండి సేకరించిన ఈ ఇంజన్ గరిష్టంగా 118బిహెచ్‌పి పవర్ మరియు 300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హోండా సిఆర్-వి విడుదల ఖరారు

ఈ శక్తివంతమైన ఇంజన్‌కు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు, మరియు పెడల్ షిఫ్టర్స్ తప్పనిసరి ఫీచర్లుగా వచ్చాయి. హోండా సిఆర్-వి ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కూడా లభ్యమవుతోంది.

హోండా సిఆర్-వి విడుదల ఖరారు

హోండా సిఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీ పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే, సాంకేతికంగా ఇందులో 2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. సీవీటీ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇందులో పెడల్ షిఫ్టర్స్ లభ్యం కాలేదు, మరియు ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ ఫ్రంట్ వీల్స్‌కు అందుతుంది.

హోండా సిఆర్-వి విడుదల ఖరారు

ప్రస్తుతానికైతే, హోండా మోటార్స్ సిఆర్-వి క్రాసోవర్ ప్రీమియం ఎస్‌యూవీకి సంభందించిన సాంకేతిక మరియు ఇంటీరియర్ ఫీచర్ల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, సిఆర్-వి ఇంటీరియర్‌లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా సిఆర్-వి విడుదల ఖరారు

హోండా మోటార్స్ సిఆర్-వి ఎస్‌యూవీని దేశీయంగా ఉన్న ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. కాబట్టి, దిగుమతి ఖర్చులు దాదాపు ఉండవు, దీంతో మేడిన్ ఇండియా హోండా సిఆర్-వి రూ. 28 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్(ధరతో) లభించే అవకాశం ఉంది.

హోండా సిఆర్-వి విడుదల ఖరారు

హోండా సిఆర్-వి ఎస్‌యూవీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ యొక్క అత్యంత కీలకమైన మోడల్. ధర ఎక్కువగానే ఉన్నప్పటికీ హోండా సిఆర్-వి ఎస్‌యూవీకి ఆశించిన మేర కస్టమర్లు ఉన్నారు. ఎంత కాలంలో ఎదురుచూస్తున్న కొత్త తరం హోండా సిఆర్-వి ఇప్పుడు పూర్తి స్థాయిలో విడుదలకు సిద్దమైంది. ఇప్పటి వరకు పరిచయం కానటువంటి డీజల్ ఇంజన్ వేరియంట్లు మరియు మూడు వరుసల సీటింగ్ ఈ మోడల్‌తోనే పరిచయం కానున్నాయి.

Source: Autocar India

Most Read Articles

English summary
Read In Telugu: New Honda CR-V India Launch Details Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X