2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. 2018 జాజ్ ఫేస్‌లిఫ్ట్‌ ఇండియ

By Anil Kumar

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తమ జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. 2018 జాజ్ ఫేస్‌లిఫ్ట్‌ ఇండియా విడుదలను హోండా అధికారికంగా ఖాయం చేసింది. అయితే, ఈ నేపథ్యంలో జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు వాటి ఫీచర్లు రహస్యంగా లీక్ అయ్యాయి.

కొత్త తరం హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ కారులో వస్తున్నకొత్త ఫీచర్లు మరియు వేరియంట్ల వివరాలు మీద ఓ లుక్కేసుకుందాం రండి...

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ ఈ జూలై 19, 2018న అధికారిక విడుదలవ్వనున్నట్లు సమాచారం. జాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ జరిగాయి. ప్రత్యేకించి రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ మరియు గ్రిల్ అదే విధంగా అప్‌డేటెడ్ టెయిల్ లైట్లతో పాటు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ వస్తున్నాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

ఏదేమైనప్పటికీ, సరికొత్త హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ అవే మునుపటి ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతాయి. హోండా జాజ్‌‌ను 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఛాయిస్‌లో ఎంచుకోవచ్చు.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్‌లోని 1.2-లీటర్ ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ 89బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా 1.5-లీటర్ ఐ-డిటిఇసి డీజల్ యూనిట్ 98బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సీవీటీ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు. ఏదేమైనుప్పటికీ, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యమవుతుంది.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

రహస్యంగా లీక్ అయిన సమాచారం మేరకు, హోండా జాజ్ ఒక్కసారి విడుదలైతే ఎస్, వి మరియు విఎక్స్ అనే మూడు విభిన్న వేరియంట్లలో లభించనుంది. కానీ పెట్రోల్ ఇంజన్ కేవలం వి మరియు విఎక్స్ వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతుంది.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ వేరియంట్ "ఎస్" కేవలం డీజల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ వేరియంట్లో ఫ్రంట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, రియర్ పార్కింగ్ సెన్సార్ మరియు డ్రైవర్ మరియు అసిస్టెంట్ సైడ్ వ్యానిటీ మిర్రర్ వంటి నూతన ఫీచర్లు పరిచయం అయ్యాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ ఎస్ వేరియంట్లో లభ్యమయ్యే ఇతర స్టాండర్డ్ ఫీచర్లలో బాడీ కలర్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు డోర్ హ్యాండిల్స్, రియర్ విండ్ షీల్డ్ డీఫాగర్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, ఫ్రంట్ మరియు రియర్ పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ లాకింగ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు స్టీరింగ్ ఆధారిత ఆడియో కంట్రోల్స్ వంటివి ఉన్నాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ "వి" వేరియంట్ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లతో లభ్యమవుతుంది. ఈ మిడ్ వేరియంట్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో సీవీటీ ట్రాన్స్‌మిషన్‌ కూడా లభిస్తుంది.

ఎస్ వేరియంట్లో ఇది వరకు పేర్కొన్న అన్ని ఫీచర్లకు అదనంగా, వి వేరియంట్లో వన్ టచ్ పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, కీ లెస్ ట్రంక్ రిలీజ్ (ఢిక్కీ ఓపెన్) గల స్మార్ట్ ట్రంక్ లాక్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పెడల్ షిఫ్టర్స్ ఉన్నాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

మిడ్ వేరియంట్ "వి" లో ఉన్న ఇతర స్టాండర్డ్ ఫీచర్లలో ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్, 5-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, మల్టీ-వ్యూవ్ రియర్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, రియర్ వైపర్లు మరియు ప్రీమియం బీజీ ఫ్యాబ్రిక్ సీట్లు మరియు అప్‌హోల్‌స్ట్రే ఉంది.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

జాజ్ ఫేస్‌లిఫ్ట్ టాప్ ఎండ్ వేరియంట్ విఎక్స్ కూడా రెండు ఇంజన్ ఆప్షన్‌లతో లభ్యమవుతుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే అప్లికేన్లను సపోర్ట్ చేయగల 6.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. అదనంగా, వాయిస్ కమాండ్, స్టీరింగ్ ఆధారిత వాయిస్ కంట్రోల్స్, సిగ్నేచర్ రియర్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు మరియు లెథర్ తొడుగు గల స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ అన్ని వేరియంట్లు కూడా ఎంచుకోదగిన ఐదు విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, రేడియంట్ రెడ్, లునార్ సిల్వర్, ఆర్చిడ్ వైట్, గోల్డెన్ బ్రౌన్ మరియు మోడ్రన్ స్టీల్.

2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు మరియు ఫీచర్లు లీక్

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త తరం 2018 హోండా జాజ్ ఫేస్‌లిఫ్ట్ విడుదలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న జాజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఒక్కసారి విడుదలైతే మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఐ20 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Source: Team bhp

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Honda Jazz Facelift Variants In Detail — Leaked Ahead Of Launch
Story first published: Wednesday, July 11, 2018, 13:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X