హ్యుందాయ్ శాంట్రోకు రహదారి పరీక్షలు

హ్యుందాయ్ మోటార్స్ కొత్త తరం శాంట్రో కారుకు రహస్య పరీక్షలు జరుపుతోంది. తాజాగా, హర్యానాలో పాత శాంట్రో కారుతో సహా, నూతన శాంట్రో కారుకు పరీక్షలు నిర్వహిస్తుండగా కెమెరా కంటికి చిక్కింది.

By Anil Kumar

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా సరిగ్గా ఇరవైయేళ్ల క్రితం సెప్టెంబరు 23 న శాంట్రో కారు విడుదలతో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. విడుదలైన దశాబ్దానికి పైగా మంచి సేల్స్ సాధించిన శాంట్రో పోటీని తట్టుకోలేక మార్కెట్ నుండి నిష్క్రమించింది. అయితే, కస్టమర్ల నుండి వస్తున్న డిమాండుకు అనుగుణంగా శాంట్రో కారును మళ్లీ రీలాంచ్ చేయాలని భావిస్తోంది.

హ్యుందాయ్ శాంట్రోకు రహదారి పరీక్షలు

ఈ నేఫథ్యంలో హ్యుందాయ్ మోటార్స్ కొత్త తరం శాంట్రో కారుకు రహస్య పరీక్షలు జరుపుతోంది. తాజాగా, హర్యానాలో పాత శాంట్రో కారుతో సహా, నూతన శాంట్రో కారుకు పరీక్షలు నిర్వహిస్తుండగా కెమెరా కంటికి చిక్కింది.

హ్యుందాయ్ శాంట్రోకు రహదారి పరీక్షలు

హ్యుందాయ్ మోటార్స్ శాంట్రో కారును ఇండియన్ మార్కెట్లోకి తొలిసారిగా విడుదల చేసిన సెప్టెంబర్ 23 కావడంతో, ఈ ఏడాది అదే రోజున సరిగ్గా పండుగ సీజన్‌లో విడుదల చేసేందుకు ఏర్పాటు పూర్తి చేసుకుంటోంది. ఈ నేఫథ్యంలోనే కొత్త తరం శాంట్రో టెస్టింగ్‌ను ముమ్మరం చేసింది.

హ్యుందాయ్ శాంట్రోకు రహదారి పరీక్షలు

మారుతి సుజుకి సెలెరియో, వ్యాగన్ ఆర్ మరియు టాటా టియాగో కార్ల నుండి ఎదురైన తీవ్ర పోటీ కారణంగా సుమారుగా 16 ఏళ్ల తరువాత 2015లో మార్కెట్ నుండి నిష్క్రమించింది.

హ్యుందాయ్ శాంట్రోకు రహదారి పరీక్షలు

ప్రస్తుతం తాజాగా పరీక్షిస్తున్న కొత్త తరం హ్యుందాయ్ శాంట్రో కారు డిజైన్ అంశాలను గుర్తించడానికి వీల్లేకుండా బ్లాక్ అండ్ వైట్ పేపరుతో కప్పేసి పరీక్షలు నిర్వహించారు. సౌకర్యవంతమైన ప్యాసింజర్ సీటింగ్ కోసం నూతన బాడీ స్టైల్లో ఉండటాన్ని గుర్తించవచ్చు.

హ్యుందాయ్ శాంట్రోకు రహదారి పరీక్షలు

హ్యుందాయ్ మోటార్స్ ఈ హ్యాచ్‌బ్యాక్ కారును ఏహెచ్2 అనే కోడ్ పేరుతో పరీక్షిస్తోంది. కంపెనీ యొక్క ఫ్లూయిడిక్ స్కల్చ్పర్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందిస్తున్నారు. దీంతో సరికొత్త శాంట్రో గ్రాండ్ ఐ10 తరహా క్యాస్కేడింగ్ గ్రిల్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ మరియు అతి పెద్ద అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టాకో మీటర్ వంటిని పొందనుంది.

హ్యుందాయ్ శాంట్రోకు రహదారి పరీక్షలు

హ్యుందాయ్ శాంట్రో క్రాష్ టెస్టుల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు కఠినమైన సేఫ్టీ నియమాలను పాటించనుంది. అందుకోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఇంకా ఎన్నో సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరిగా అందివ్వనుంది.

కానీ ఇప్పటి వరకు శాంట్రోలో ఏ ఇంజన్ అందిస్తుందో అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇందులో బహుశా 800సీసీ లేదా 1.0-లీటర్ ఇంజన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మలిదశ క్రింద ఇందులో డీజల్ ఇంజన్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అయితే పెట్రోల్ వెర్షన్ శాంట్రో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు ట్రాన్స్‌మిషన్‌లలో లభ్యం కానుంది.

Most Read Articles

English summary
Read In Telugu: New Hyundai Santro caught on test with Old Santro – Front grille revealed
Story first published: Monday, July 16, 2018, 10:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X