లెక్సస్ ఇఎస్ 300హెచ్ విడుదల: ధర రూ. 59.13 లక్షలు

లెక్సస్ ఇండియా విభాగం తాజాగ విపణిలోకి సరికొత్త ఇఎస్ 300హెచ్ లగ్జరీ సెడాన్ కారును లాంచ్ చేసింది. కొత్త తరం లెక్సస్ ఇఎస్300హెచ్ ధర రూ. 59.13 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. ఇప్పటికే లెక్సస్ ఇఎస్ 300

By Anil Kumar

లెక్సస్ ఇండియా విభాగం తాజాగ విపణిలోకి సరికొత్త ఇఎస్ 300హెచ్ లగ్జరీ సెడాన్ కారును లాంచ్ చేసింది. కొత్త తరం లెక్సస్ ఇఎస్300హెచ్ ధర రూ. 59.13 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. ఇప్పటికే లెక్సస్ ఇఎస్ 300హెచ్ మీద దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

లెక్సస్ ఇఎస్ 300హెచ్

సరికొత్త లెక్సస్ ఇఎస్ 300హెచ్ లగ్జరీ సెడాన్ కారును కంపెనీ యొక్కే గ్లోబల్ ఆర్కిటెక్చర్-కె (GA-K)ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. దీనిని లెక్సస్ మాతృ సంస్థ టయోటా కంపెనీకి చెందిన టయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా డెవలప్ చేసారు.

లెక్సస్ ఇఎస్ 300హెచ్

కొత్త తరం లెక్సస్ ఇఎస్ 300హెచ్ లగ్జరీ సెడాన్‌లో ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంతే కాకుండా, అత్యంత శక్తివంతమైన ఇంజన్ ఇందులో పరిచయం అయ్యింది.

లెక్సస్ ఇఎస్ 300హెచ్

సాంకేతికంగా లెక్సస్ ఇఎస్ 300హెచ్ సెడాన్‌లో 2.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు, తదుపరి ఈ ఇంజన్‌కు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం కలదు. పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా 214బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

లెక్సస్ ఇఎస్ 300హెచ్

లెక్సస్ ఇఎస్ 300హెచ్ సెడాన్‌లో ఉన్న నాలుగవ తరానికి చెందిన హైబ్రిడ్ డ్రైవ్ సిస్టమ్ యూరో-VI ఉద్గార ప్రమాణాలను పాటిస్తుంది. మరియు ఇది లీటరుకు 22.37 కిలోమీటర్ల మైలేజ్‌నిస్తుంది.

లెక్సస్ ఇఎస్ 300హెచ్

లెక్సస్ ఇఎస్ 300హెచ్ ఎక్ట్సీరియర్ డిజైన్‌లో అత్యాధునిక లెక్సస్ ట్రేడ్‌మార్క్ గల స్పిండిల్ ఫ్రంట్ గ్రిల్, ఎల్-ఆకారంలో గల మార్కర్ లైట్ల జోడింపుతో ఉన్న స్లిమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. సెడాన్‌లో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు మరియు 9-రకాల ఎక్ట్సీరియర్ పెయింట్ స్కీమ్స్‌‌లో దీనిని ఎంచుకోవచ్చు.

లెక్సస్ ఇఎస్ 300హెచ్

ఇఎస్ 300హెచ్ సెడాన్ ఇంటీరియర్‌లో డార్క్-బ్రౌన్ రంగులో ఉన్న డ్యాష్‌బోర్డు, 12.3-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్లస్టర్, ఫుల్జీ అడ్జస్టబుల్ హెడ్స్-అప్ డిస్ల్పే, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్-రీక్లైనింగ్ ఫంక్షన్ గల సీట్లు మరియు 17-స్పీకర్లు ఉన్న మార్క్ లెవిన్‌సన్ ప్యూర్ ప్లే సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లెక్సస్ ఇఎస్ 300హెచ్

లెక్సస్ ఇఎస్ 300హెచ్ నాలుగు రకాల ఇంటీరియర్ పెయింట్ స్కీమ్స్(Black, Chateau, Topaz Brown and Rich Cream) మరియు మూడు క్యాబిన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. సరికొత్త లెక్సస్ ఇఎస్ 300హెచ్ సెడాన్‌లో తొమ్మిది ఎయిర్ బ్యాగులు, స్టెబిలిటి కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

లెక్సస్ ఇఎస్ 300హెచ్

లెక్సస్ ఇఎస్ 300హెచ్ విడుదల సందర్భంగా లెక్సస్ఇండియా ఛైర్మన్ ఎన్ రాజా మాట్లాడుతూ, "అత్యాధునిక అవిష్కరణ, రెట్టించిన ఉత్సాహం మరియు కస్టమర్ల అభిరుచితో ఆకర్షణీయమైన ఉత్పత్తులను లెక్సస్ నిర్మిస్తోంది. అందులో భాగంగానే లగ్జరీ లక్షణాలు ఏ మాత్రం తీసిపోకుండా, విలాసవంతమైన లెక్సస్ ఇఎస్ 300హెచ్ సెడాన్ కారును రీ లాంచ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు."

లెక్సస్ ఇఎస్ 300హెచ్

లెక్సస్ ఇఎస్ 300హెచ్ మోడల్ మీద దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లెక్సస్ విక్రయ కేంద్రాలలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇది విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Lexus ES 300h Launched In India; Priced At Rs 59.13 Lakh
Story first published: Monday, July 23, 2018, 17:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X