2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు

మారుతి సుజుకి తమ 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారుకు ఇండియన్ రోడ్ల మీద పలు దఫాలు రహస్యంగా పరీక్షలు నిర్వహించింది. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, సరికొత్త 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆ

By Anil Kumar

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ కారుకు ఇండియన్ రోడ్ల మీద పలు దఫాలు రహస్యంగా పరీక్షలు నిర్వహించింది. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, సరికొత్త 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆగష్టు 6, 2018 న విపణిలోకి విడుదలవుతున్న తెలిసింది.

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు

మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కాస్మొటిక్ అప్‌డేట్స్ మరియు మెకానికల్ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, కొత్త తరం 2018 మారుతి సియాజ్‌ ఫేస్‌లిఫ్ట్ డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు సంభవించలేదు.

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు

అయితే, మునుపటి సియాజ్‌తో పోల్చుకుంటే స్వల్ప మార్పులు గుర్తించే విధంగా, నూతన ఫ్రంట్ బంపర్, గ్రిల్, కొత్తగా రూపొందించిన హెడ్ ల్యాంప్స్, మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో సియాజ్ ఫ్రంట్ ఎండ్ చాలా కొత్తగా ఉంది.

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు

సరికొత్త 2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ సైడ్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. కానీ, సరికొత్త డిజైన్‌లో ఉన్న అల్లాయ్ వీల్స్ పరిచయం అయ్యే అవకాశం ఉంది. సియాజ్ ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్‌‌లో అధునాతన టెయిల్ లైట్ క్లస్టర్ మరియు స్టైలిష్ ఎల్ఈడీ లైటింగ్ ఎలిమెంట్లు ఉన్నాయి.

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్‌లో అదే మునుపటి డిజైన్ పాటిస్తూనే, పలు కీలకమైన మార్పులు సంభవించాయి. డ్యాష్‌బోర్డు మరియు డోర్లకు లోపలి వైపున కలప సొబగులను జోడించి ఇంటీరియర్‌లో లగ్జరీ ఫీల్ కలిగించారు. అదనంగా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెథర్ సీట్ అప్‌హోల్‌స్ట్రే, క్రూయిజ్ కంట్రోల్ మరియు 7-అంగుళాల పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో సియాజ్ సెడాన్ కారులో వస్తోన్న అతి ప్రధానమైన మార్పులు, నూతన ఇంజన్ పరిచయం కావడం. అవును, మారుతి సుజుకి తమ 2018 సియాజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో 1.5-లీటర్ కెపాసిటి గల సరికొత్త పెట్రోల్ ఇంజన్ అందిస్తోంది.

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు

1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మునుపటి 1.4-లీటర్ పెట్రోల్ యూనిట్ స్థానాన్ని భర్తీ చేయనుంది. 103బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల ఇది సుజుకి వారి మైల్డ్ హైబ్రిడి టెక్నాలజీతో లభించనుంది.

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ నూతన పెట్రోల్ ఇంజన్‌తో పాటు అదే మునుపటి 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌తో వస్తోంది. రెండు ఇంజన్ ఆప్షన్లను కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతాయి. గతంలో ఉన్నటువంటి 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు బదులుగా సరికొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వస్తోంది.

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పాత మోడళ్ల ప్రక్షాళనలో భాగంగా మారుతి సుజుకి తమ సియాజ్ సెడాన్ కారును ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో సిద్దం చేసింది. పైపై మెరుగులు కాకుండా, డిజైన్, ఫీచర్లు, ఇంజన్ మరియు టెక్నికల్‌గా భారీ మార్పులు చేర్పులతో సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌ను అభివృద్ది చేసింది. సుజుకి వారి హైబ్రిడ్ టెక్నాలజీతో పరిచయం అవుతున్న సియాజ్ ఈ ఏడాది పండుగ సీజన్ నాటికల్లా విడుదల కానుంది.

2018 మారుతి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఖరారు

2018 మారుతి సుజుకి సియాజ్ ఫేస్‌లిఫ్ట్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే మార్కెట్లో ఉన్న హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, టయోటా యారిస్, స్కోడా ర్యాపిడ్ మరియు వోక్స్‌‌వ్యాగన్ వెంటో వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Source: ZigWheels

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Maruti Ciaz Facelift Launch Date Revealed
Story first published: Saturday, July 14, 2018, 13:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X