కొత్త ఎర్టిగా కారు ఖరిదుకు బుక్కింగ్ ప్రారంభిచిన మారుతి సుజుకి

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇదే నవెంబర్ 21నందు తమ కొత్త ఎర్టిగా ఎంపివి కారును విడుదల చెయ్యనుంది. ఈ మూలంగా ఆసక్త గ్రాహకులు కొత్త కారు కోనేగోలు కోసం బుక్కింగ్ ప్రక్రియను ప్రారంభిచింది. కొత్త ఎర్టిగా కారు కోనేగోలు కోసం మీ సమీపం లో ఉన్న మారుతి సుజుకి డీలర్ దెగ్గిరకు వెళ్ళి బుక్కింగ్ చేసుకోవచ్చు.

కొత్త ఎర్టిగా కారు ఖరిదుకు బుక్కింగ్ ప్రారంభిచిన మారుతి సుజుకి

ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పీవీ ఫ్రంట్ డిజైన్‌లో అధునాతన ఫ్రంట్ గ్రిల్, హెడ్ లైట్లు, టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు రీడిజైన్ చేయబడిన బంపర్ గమనించవచ్చు.

కొత్త ఎర్టిగా కారు ఖరిదుకు బుక్కింగ్ ప్రారంభిచిన మారుతి సుజుకి

మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్ విషయానికి వస్తే, కొత్తగా రూపొందించిన టెయిల్ లైట్లు, స్టాప్ లైట్ మరియు సరికొత్త బంపర్ ఉన్నాయి. బంపర్ మీద ఏర్పాటు చేసిన బాక్స్ వెహికల్ యొక్క ఉద్గారాలను పరీక్షించే పరికరం. ప్రస్తుతం దీని ఉద్గార వివరాలను లెక్కబెట్టే పనిలో ఉన్నారు.

కొత్త ఎర్టిగా కారు ఖరిదుకు బుక్కింగ్ ప్రారంభిచిన మారుతి సుజుకి

సరికొత్త మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ సాంకేతికంగా 1.5-లీటర్ కెపాసిటి గల అధునాతన పెట్రోల్ ఇంజన్ రానుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి ఇటీవల విడుదల చేసిన సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా ఇదే ఇంజన్ ఉంది.

కొత్త ఎర్టిగా కారు ఖరిదుకు బుక్కింగ్ ప్రారంభిచిన మారుతి సుజుకి

ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ డీజల్ ఇంజన్ విషయానికి వస్తే, అదే మునుపటి 1.5-లీటర్ డీజల్ ఇంజన్ యథావిధిగా వస్తోంది. అయితే, దీనిని కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే ఎంచుకోవచ్చు.

కొత్త ఎర్టిగా కారు ఖరిదుకు బుక్కింగ్ ప్రారంభిచిన మారుతి సుజుకి

ప్రస్తుతం ఉన్న ఎర్టిగా పోల్చుకుంటే ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పీవీలో అత్యాధునిక ఫీచర్లు పరిచయం అవుతున్నాయి. ప్రత్యేకించి దీనిని, డిజైర్, స్విఫ్ట్ మరియు బాలెనో కార్లను నిర్మించిన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. దీంతో అత్యంత విశాలమైన క్యాబిన్ స్పేస్ సాధ్యమైంది.

కొత్త ఎర్టిగా కారు ఖరిదుకు బుక్కింగ్ ప్రారంభిచిన మారుతి సుజుకి

ఫీచర్ల విషయానికి వస్తే, సరికొత్త ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌‌పీవీలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, విలాసవంతమైన అప్‌హోల్‌స్ట్రే వంటి ఫీచర్లు వస్తున్నాయి.

కొత్త ఎర్టిగా కారు ఖరిదుకు బుక్కింగ్ ప్రారంభిచిన మారుతి సుజుకి

భద్రత పరంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటివి దాదాపు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా పరిచయం చేసే అవకాశం ఉంది.

కొత్త ఎర్టిగా కారు ఖరిదుకు బుక్కింగ్ ప్రారంభిచిన మారుతి సుజుకి

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఒక్కసారి విడుదలైతే, విపణిలో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా, అతి త్వరలో విడుదల కానున్న మహీంద్రా మరాజొ, రెనో లాజీ మరియు హోండా బిఆర్-వి వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
New Maruti Ertiga Unofficial Bookings Open Ahead Of Launch.
Story first published: Monday, October 29, 2018, 18:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X