2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌కు తుది పరీక్షలు

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అతి త్వరలో సరికొత్త 2018 ఎర్టిగా ఫేస్‍‌లిఫ్ట్ ఎమ్‌పీవీని విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గత కొన్ని నెలలుగా ఇండియన్ రోడ్ల మీద పల

By Anil Kumar

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అతి త్వరలో సరికొత్త 2018 ఎర్టిగా ఫేస్‍‌లిఫ్ట్ ఎమ్‌పీవీని విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గత కొన్ని నెలలుగా ఇండియన్ రోడ్ల మీద పలు దఫాలు రహదారి పరీక్షలు నిర్వహించిన మారుతి బృందం, ఇప్పుడు ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌కు తుది దశ పరీక్షలు నిర్వహించింది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ అంశాల గుర్తించడానికి వీల్లేకుండా, నలుపు రంగు పేపరుతో కప్పేసిన ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్‌కు తుది పరీక్షలు నిర్వహిస్తున్నపుడు రహస్యంగా పట్టుబడింది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పీవీ ఫ్రంట్ డిజైన్‌లో అధునాతన ఫ్రంట్ గ్రిల్, హెడ్ లైట్లు, టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ మరియు రీడిజైన్ చేయబడిన బంపర్ గమనించవచ్చు.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్ విషయానికి వస్తే, కొత్తగా రూపొందించిన టెయిల్ లైట్లు, స్టాప్ లైట్ మరియు సరికొత్త బంపర్ ఉన్నాయి. బంపర్ మీద ఏర్పాటు చేసిన బాక్స్ వెహికల్ యొక్క ఉద్గారాలను పరీక్షించే పరికరం. ప్రస్తుతం దీని ఉద్గార వివరాలను లెక్కబెట్టే పనిలో ఉన్నారు.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

సరికొత్త మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ సాంకేతికంగా 1.5-లీటర్ కెపాసిటి గల అధునాతన పెట్రోల్ ఇంజన్ రానుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి ఇటీవల విడుదల చేసిన సియాజ్ ఫేస్‌లిఫ్ట్‌లో కూడా ఇదే ఇంజన్ ఉంది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ డీజల్ ఇంజన్ విషయానికి వస్తే, అదే మునుపటి 1.5-లీటర్ డీజల్ ఇంజన్ యథావిధిగా వస్తోంది. అయితే, దీనిని కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే ఎంచుకోవచ్చు.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం ఉన్న ఎర్టిగా పోల్చుకుంటే ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పీవీలో అత్యాధునిక ఫీచర్లు పరిచయం అవుతున్నాయి. ప్రత్యేకించి దీనిని, డిజైర్, స్విఫ్ట్ మరియు బాలెనో కార్లను నిర్మించిన హార్టెక్ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. దీంతో అత్యంత విశాలమైన క్యాబిన్ స్పేస్ సాధ్యమైంది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

ఫీచర్ల విషయానికి వస్తే, సరికొత్త ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌‌పీవీలో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, 7-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, విలాసవంతమైన అప్‌హోల్‌స్ట్రే వంటి ఫీచర్లు వస్తున్నాయి.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

భద్రత పరంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటివి దాదాపు అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా పరిచయం చేసే అవకాశం ఉంది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

ఫ్యామిలీ అవసరాల కోసం బడ్జెట్ ధరలో అత్యంత విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లతో ఎమ్‌పీవీని అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో మారుతి సుజుకి తమ ఎర్టిగా ఎమ్‌పీవీని భారీ మార్పులు చేర్పులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో ప్రవేశపెట్టేందుకు తుది దశ పరీక్షలను పూర్తి చేసుకుని విడుదలకు ఏర్పాట్లు ప్రారంభించింది.

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్

2018 మారుతి ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఒక్కసారి విడుదలైతే, విపణిలో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా, అతి త్వరలో విడుదల కానున్న మహీంద్రా మరాజొ, రెనో లాజీ మరియు హోండా బిఆర్-వి వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Source: Rushlane

Most Read Articles

రాయల్ ఎన్ఫీల్డ్ నేడు విపణిలోకి సరికొత్త క్లాసిక్ సిగ్నల్స్ 350 బైకును విడుదల చేసింది. నూతన కలర్ ఆప్షన్స్ మరియు పలు రకాల అదనపు ఫీచర్లు గల రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిగ్నల్స్ 350 బైకు ప్రారంభ ధర రూ. 1.62 లక్షలుగా ఉన్నట్లు కంపెనీ నిర్ణయించింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిగ్నల్స్ 350 గురించి పూర్తి వివరాల కోసం....

English summary
Read In Telugu: 2018 Maruti Ertiga Facelift Spotted In India With Emission Testing Equipment
Story first published: Tuesday, August 28, 2018, 17:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X