రికార్డులన్నీ బ్రేక్ చేసి లక్ష యూనిట్ల బుకింగ్స్ దిశగా స్విఫ్ట్!!

మూడవ తరం మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు విపరీతమైన డిమాండ్ లభిస్తోంది. మారుతి తమ 2018 స్విఫ్ట్ మీద జనవరి 18 న బుకింగ్స్ ప్రారంభించగా, సరిగ్గా నెల రోజుల్లో 60,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.

By Anil

Recommended Video

2018 మారుతి న్యూ స్విఫ్ట్ విడుదల | Maruti Swift 2018 - Full Specifications, Features - DriveSpark

మారుతి సుజుకి ఫిబ్రవరి 2018 ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2018 వేదికగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన మూడవ తరం స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు విపరీతమైన డిమాండ్ లభిస్తోంది. మారుతి తమ 2018 స్విఫ్ట్ మీద జనవరి 18 న బుకింగ్స్ ప్రారంభించగా, సరిగ్గా నెల రోజుల్లో 60,000 లకు పైగా బుకింగ్స్ నమోదయ్యాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ బుకింగ్స్

మరో నెలలో ఈ సంఖ్య లక్షకు చేరుకోవచ్చని అంచనా... మూడవ తరానికి సరికొత్త 2018 స్విఫ్ట్ మారుతి సుజుకి ఇండియాకు భారీ సక్సెస్ సాధించిపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా స్విఫ్ట్ మోడల్‌కు ఇండియా అతి పెద్ద మరియు అతి ముఖ్యమైన మార్కెట్.

మారుతి సుజుకి స్విఫ్ట్ బుకింగ్స్

జపాన్ దిగ్గజం సుజుకి దేశీయ సంస్థ మారుతి భాగస్వామ్యంతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన ఫస్ట్ జనరేషన్ మరియు సెకండ్ జనరేషన్ స్విఫ్ట్ ద్వారా ఏకంగా 20 లక్షలకుగా పైగా విక్రయించింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ బుకింగ్స్

పోటీ పెరుగుతున్న నేపథ్యంలో రెండవ తరం స్విఫ్ట్ కారును గత ఏడాది చివరిలో మార్కెట్ నుండి శాశ్వతంగా తొలగించింది. మూడవ తరం స్విఫ్ట్ కారును సరికొత్త డిజైన్ అంశాలతో అత్యాధునిక ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లను అందించి ధరకు తగ్గ విలువలతో లాంచ్ చేసింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ బుకింగ్స్

మారుతి సుజుకితో పాటు భారత ప్యాసింజర్ కార్ల పరిశ్రమ ఊహించని ఫలితాలు సాధిస్తూ రికార్డులు మీద రికార్డులు నెలకొల్పుతోంది. మారుతి సుజుకి గత ఏడాది విడుదల చేసిన న్యూ డిజైర్ ద్వారా భారీ విజయాన్ని అందుకుంది. అయితే, డిజైర్ మీద లభించిన ఆదరణ స్విఫ్ట్ మీద రెట్టింపు అయ్యింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ బుకింగ్స్

ప్రొడక్షన్ అవస్థలు

ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో కనీస సేల్స్ లభించని సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాటితో పోల్చితే మారుతి సుజుకి చాలా విభిన్నం. నెల రోజుల్లో 60 వేల బుకింగ్స్ అంటే డిమాండుకు తగ్గ ఉత్పత్తి చేయలేక మారుతి మీద ఒత్తిడి ఎప్పటికప్పుడు పెరుగుతోంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ బుకింగ్స్

మారుతి సుజుకి కంపెనీకి భారత్‌లో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. అందులో ఒకటి గుజరాత్‌లో మరొకటి హర్యానాలో ఉంది. ప్రస్తుతం స్విప్ట్‌ను హర్యానాలో ఉత్పత్తి చేస్తోంది. బుకింగ్స్ అధికమవుతున్న నేపథ్యంలో స్విఫ్ట్ డెలివరీకి వెయిటింగ్ పీరియడ్ సుమారుగా రెండు నెలల పాటు ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ బుకింగ్స్

మారుతి 2018 స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్లలో లభ్యమవుతోంది. సరికొత్త ఫ్రంట్ డిజైన్, విశాలమైన క్యాబిన్ స్పేస్, ఫస్ట్ ఇన్ క్లాస్ ఇంటీరియర్ ఫీచర్లు, అతి ముఖ్యమైన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్ బుకింగ్స్

మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ. 4.99 లక్షల నుండి రూ. 7.39 లక్షలు మరియు స్విఫ్ట్ డీజల్ వేరియంట్ల ధరల శ్రేణి రూ. 5.99 లక్షల నుండి 8.29 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: New Maruti Suzuki Swift races past 60,000 bookings in India
Story first published: Monday, February 26, 2018, 14:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X