మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

By Anil Kumar

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ సరికొత్త స్విఫ్ట్ మరియు బాలెనో కార్లను రీకాల్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. రీకాల్‌కు గురైన కార్ల కోసం ప్రత్యేక సర్వీస్ క్యాంపెయిన్ కూడా ప్రారంభించినట్లు పేర్కొంది. స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సమస్యాత్మకంగా ఉన్న బ్రేక్ వాక్యూమ్ హోస్‌ రీకాల్‌కు అసలు కారణం అని తెలిసింది.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

రీకాల్ గురైన కార్ల కోసం ప్రారంభించిన సర్వీస్ క్యాంపెయిన్ వివరాలను మారుతి సుజుకి నెక్సా అఫీషియల్ వెబ్‌సైట్లో జోడించింది. మొత్తం 52,686 యూనిట్ల స్విఫ్ట్ మరియు బాలెనో కార్లు రీకాల్ అయ్యాయి.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

డిసెంబర్ 1, 2017 నుండి మార్చి 16, 2018 మధ్య కాలంలో తయారైన కార్లలో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. మే 14, 2018 నుండి దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి అధీకృత డీలర్లు తమ కస్టమర్లకు ఫోన్ చేసి, రీకాల్ మరియు సర్వీస్ క్యాంపెయిన్ గురించి వివరిస్తారు.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

ఈ సర్వీస్ క్యాంపెయిన్‌లో భాగంగా రీకాల్ అయిన కార్లలో బ్రేక్ వాక్యూమ్ హోస్‌ను పరీక్షించి మరియు సమస్య ఉన్నట్లయితే కొత్త దానిని అమర్చుతారు. ఈ సర్వీసును పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నారు. కస్టమర్లు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

కస్టమర్లు తమ స్విఫ్ట్ లేదా బాలెనో కారు ఈ రీకాల్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే నెక్సా వెబ్‌సైట్లో ఆ కారు ఛాసిస్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

మారుతి సుజుకి ఈ మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ యొక్క గుజరాత్ ప్లాంటులో తయారు చేస్తోంది. అయితే, రీకాల్ అయిన కార్లు ఇక్కడే తయారైనవా... కాదా అనే విషయం ఇంకా తెలియరాలేదు.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

బ్రేక్ వ్యాక్యూమ్ హోస్ అనే బ్రేక్ బూస్టర్ సిస్టమ్‌లో ఒక భాగం. ఇది బ్రేక్ ఫోర్స్‌ను పెంచి, బ్రేకులు ప్రయోగించిన తరువాత అతి తక్కువ దూరంలో కారు ఆగడానికి సహాయపడుతుంది.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

ఏదేమైనప్పటికీ, బ్రేక్ వాక్యూమ్ ఫెయిల్ అయితే, బ్రేక్ సిస్టమ్ మొత్తం పూర్తి స్థాయిలో ఫెయిల్ అవ్వదు. కానీ, బ్రేక్ పవర్‌ను కొద్ది మేర తగ్గిస్తుంది. ఎలాంటి వాహనంలోనైనా బ్రేకింగ్ వ్యవస్థ చాలా ముఖ్యమైనది.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

మారుతి సుజుకి బ్రేకింగ్ సిస్టమ్‌లో తలెత్తిన లోపాన్ని గుర్తించి తమ పాపులర్ కార్లు అయిన స్విఫ్ట్ మరియు బాలెనో హ్యాచ్‌బ్యాక్ కార్లను కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రీకాల్ చేసింది.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

నూతన మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా లభిస్తున్నాయి. మారుతి బాలెనో భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారుగా బాగా రాణిస్తోంది.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్ల విక్రయాలకు, మారుతి సుజుకి ప్రకటించిన ఈ రీకాల్ గొడ్డలిపెట్టుగా మారింది. ఈ భారీ రీకాల్ అనంతరం వీటి సేల్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి మరి.

మారుతి స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సాంకేతిక లోపం: భారీ సంఖ్యలో రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సాంకేతక లోపం ఉన్న కార్లను గుర్తించి రీకాల్ చేసిన మారుతి సుజుకి రీకాల్ అయిన కార్ల కోసం ప్రత్యేక సర్వీస్ క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. బ్రేకింగ్ వ్యవస్థలో బ్రేక్ వ్యాక్యూమ్ హోస్ కీలకమైన భాగం. సమర్థవంతమైన బ్రేకింగ్ విషయంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. కస్టమర్ల భద్రత దృష్ట్యా రీకాల్ అయిన స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో సమస్యను పరిష్కరించేందుకు మారుతి ముందుకొచ్చింది.

Most Read Articles

English summary
Read In Telugu: New Maruti Swift And Baleno Recalled In India — Here’s Why
Story first published: Tuesday, May 8, 2018, 13:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X