విపణిలోకి ఈ మోడల్ తీసుకొస్తే భారత్‌లో మారుతికి తిరుగే ఉండదు

మారుతి సుజుకి తమ వితారా ఎస్‌యూవీని రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది. భారతీయ రోడ్లను తట్టుకునేలా వితారా బ్రిజా కంటే పై స్థానంలో ఖరీదైన ప్రీమియమ్ ఎస్‌యూవీ వచ్చే అవకాశం ఉంది.

By Anil Kumar

Recommended Video

నెక్సాన్ ఆటోమేటిక్ ప్రవేశపెట్టిన టాటా మోటార్స్ | Tata Nexon AMT Details, Specifications - DriveSpark

మారుతి సుజుకి తమ వితారా ఎస్‌యూవీని రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది. భారతీయ రోడ్లను తట్టుకునేలా వితారా బ్రిజా కంటే పై స్థానంలో ఖరీదైన ప్రీమియమ్ ఎస్‌యూవీ వచ్చే అవకాశం ఉంది. అయితే, మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీ విడుదల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, తాజాగా అందిన సమాచారం మేరకు మారుతి వితారా ఏ సమయంలోనైనా విపణిలోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి వితారా

పది లక్షల ధరల శ్రేణిలో అత్యంత సరసమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టి మారుతి గత నాలుగు అయిదేళ్లలో మంచి సక్సెస్ అందుకుంది. సి-సెగ్మెంట్ సెడాన్ విభాగంలో సియాజ్ కారును 2014లో మరియు కాంపాక్ట్ ఎస్‍‌యూవీ వితారా బ్రిజా ఎస్‌యూవీని 2017లో పరిచయం చేసి భారీ విజయాన్ని అందుకుంది.

మారుతి సుజుకి వితారా

ప్రస్తుతం, మారుతి వితారా ఎస్‌యూవీని బ్యాడ్జ్ పేరు కనిపించకుండా కప్పేసి ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. అంటే పరీక్షల అనంతరం దేశీయ విపణిలోకి విడుదల చేసే ప్రణాళికలో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

మారుతి సుజుకి వితారా

అయితే, మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీ విడుదల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, పరీక్షిస్తున్న మోడల్‌ను చూస్తే దీని లాంచ్ ఎంత ఆసక్తికరంగా ఉండనుందో చెప్పాల్సిన అవసరం లేదు, విపణిలో ఉన్న పోటీదారులకు చమటలు పట్టడం మాత్రం ఖాయం.

మారుతి సుజుకి వితారా

మారుతి టెస్ట్ చేస్తున్న వితారా ఎస్‌యూవీలో సాంకేతికంగా 1.6-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో గల ఇది 116బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సుజుకి వితారా

కొత్త తరం వితారా యూరోపియన్ మార్కెట్లో అమ్మకాల్లో ఉంది. యూరోపియన్ వెర్షన్ వితారా ఎస్‌యూవీ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.అవి, 1.4-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ మరియు ఫియట్ నుండి సేకరించిన 1.6-లీటర్ మల్టీజెట్ టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు.

మారుతి సుజుకి వితారా

ఇండియన్ మార్కెట్‌కు ఖరారు చేసిన వితారాలో మారుతి సుజుకి కొత్తగా డెవలప్ చేసిన 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభించే అవకాశం ఉంది. ఇవే ఇంజన్‌లు అతి త్వరలో రానున్న మారుతి సియాజ్‌లో కూడా పరిచయమయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి వితారా

బ్రిజా ఎస్‌యూవీ తరహాలోనే సుజుకి వితారా బాక్సీ ఆకారంలో ఉంటుంది. విశాలమైన ఇంటీరియర్ మరియు నిండైన ఫీచర్లతో సొగసైన డిజైనింగ్ హంగులు రానున్నాయి. మారుతి సుజుకి వితారా సుమారుగా రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షల ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి వితారా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొలతల పరంగా చూసుకుంటే మారుతి సుజుకి వితారా ఎస్‌యూవీ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి గట్టి పోటీనిస్తుంది. మారుతి సుజుకి గత రెండు మూడేళ్ల నుండి విపరీతమైన ఫలితాలను సాధించడం, మారుతి ప్రవేశపట్టే ప్రతి మోడల్‌కు మంచి ఆదరణ లభిస్తుండటంతో వితారా కూడా మారుతి సుజుకి ఇండియాకు మరో పెద్ద సక్సెస్ కానుంది.

ఇప్పటి వరకు సరైన పోటీ ఎరుగని హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు వితారా పరిచయంతో రెండింటి మధ్య పోటీ తీవ్రం కానుంది.

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
Read In Telugu: New Maruti Vitara Spied Testing In India: Expected Launch Date, Price, Specs, Features & Images
Story first published: Tuesday, March 6, 2018, 10:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X