2018 మినీ కూపర్ విడుదల: ధర, ఇంజన్, వేరియంట్లు, ఫీచర్లు మరియు ఫోటోలు

మినీ ఇండియా విపణిలోకి సరికొత్త 2018 మినీ కూపర్ ఎస్ మరియు కూపర్ డి లగ్జరీ కార్లను లాంచ్ చేసింది. 2018 మినీ కూపర్ శ్రేణి ప్రారంభ ధర రూ. 29.70 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. 2018 మినీ కూపర్‌లో అప్‌

By Anil Kumar

మినీ ఇండియా విపణిలోకి సరికొత్త 2018 మినీ కూపర్ ఎస్ మరియు కూపర్ డి లగ్జరీ కార్లను లాంచ్ చేసింది. 2018 మినీ కూపర్ శ్రేణి ప్రారంభ ధర రూ. 29.70 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. 2018 మినీ కూపర్‌లో అప్‌డేట్ ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌తో పాటు నూతన గేర్‌బాక్స్ పరిచయం అయ్యింది.

2018 మినీ కూపర్ విడుదల

2018 మినీ కూపర్ ఎస్ మరియు డి రెండు కూడా మూడు డోర్లు మరియు ఐదు డోర్ల వేరియంట్లలో లభ్యమవుతాయి. మినీ కూపర్ ఎస్ కన్వర్టిబుల్ వేరియంట్లో కూడా లభిస్తోంది. మినీ కూపర్ వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి...

Variant Price
3-door Cooper D (Diesel) ₹29,70,000
3-door Cooper S (Petrol) ₹33,20,000
5-door Cooper D (Diesel) ₹35,00,000
Convertible Cooper S (Petrol) ₹37,10,000
2018 మినీ కూపర్ విడుదల

డిజైన్ విషయానికి వస్తే, 2018 మినీ కూపర్‌లో సిగ్నేచర్ మినీ బాడీ డిజైన్ పలు అప్‌డేట్స్‌కు గురయ్యింది. మినీ లోగో ఇప్పుడు బానెట్ మీదకు చేరిపోయింది. ఇతర మార్పులలో రీడిజైన్ చేయబడిన పగట పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్‌ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లతో పాటు టెయిల్ ల్యాంప్ సెక్షన్ యూనియన్ జాక్ డిజైన్ శైలిలో అందివ్వడం జరిగింది.

2018 మినీ కూపర్ విడుదల

2018 మినీ కూపర్ ఇంటీరయర్‌లో సరికొత్త స్టీరింగ్ వీల్, అధునాతన సెంట్రల్ ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే, లెథర్ చెస్టర్ మ్యాట్ అప్‌హోల్‌స్ట్రే వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఆప్షనల్‌గా లభించే మినీ ఎక్సైట్‌మెంట్ ప్యాక్ 12 రకాల ఆంబియంట్ లైటింగ్ అందిస్తుంది.

2018 మినీ కూపర్ విడుదల

ఇతర కీలకమైన ఫీచర్లలో 8.8-అంగుళాల పరిమాణంలో ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 20జీబి ఇంటర్నల్ స్టోరేజ్, వైర్ లెస్ ఛార్జింగ్, హార్మన్ కార్డన్ 360వాట్ స్పీకర్ సిస్టమ్, స్పోర్ట్స్ సీట్లు మరియు లెథర్ వ్రాప్ స్టీరింగ్ వీల్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

2018 మినీ కూపర్ విడుదల

సేఫ్టీ పరంగా 2018 మినీ కూపర్ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ మరియు రన్-ఫ్లాట్ టైర్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

2018 మినీ కూపర్ విడుదల

సాంకేతికంగా 2018 మినీ కూపర్‌ ఎస్ మరియు డి వేరియంట్లలో 2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది 189బిహెచ్‌‌పి పవర్ మరియు 280ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ స్టెప్‌ట్రోనిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

2018 మినీ కూపర్ విడుదల

2018 మినీ కూపర్‌ కేవలం 3.5 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 235కిలోమీటర్లుగా ఉంది. అంతే కాకుండా మినీ ఇందులో ఆప్షనల్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ స్పోర్ట్స్ ట్రాన్స్‌మిషన్ అందిస్తోంది. ఈ గేర్‌బాక్స్ ద్వారా వేగవంతమైన యాక్సిలరేషన్ కోసం అతి తక్కువ గేర్ నిష్పత్తిని కలిగి ఉంటుంది. పెడల్ షిఫ్టర్స్ కూడా స్టీరింగ్ వీల్ మీద ఉంటాయి.

2018 మినీ కూపర్ విడుదల

సరికొత్త 2018 మినీ కూపర్ ఎస్, డి మరియు కన్వర్టిబుల్ వేరియంట్లు దేశవ్యాప్తంగా ఉన్న మినీ డీలర్ల వద్ద జూన్ 2018 నుండి అందుబాటులో ఉంటాయి. 2018 మినీ కూపర్ రేంజ్ మూడు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, ఎమరాల్డ్ గ్రే మెటాలిక్, స్టార్లిట్ బ్లూ మెటాలిక్ మరియు సోలారిస్ ఆరేంజ్. ప్రస్తుతం వీటిని పూర్తి స్థాయిలో తయారైన యూనిట్లుగా దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది.

2018 మినీ కూపర్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ గ్రూపుకు చెందిన మినీ ఇండియన్ మార్కెట్లోకి 2019 కూపర్ ఎస్, డి మరియు కన్వర్టిబుల్ వేరియంట్లను పరిచయం చేసింది. ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ మరియు ఫీచర్ల పరంగా పలు మార్పులు చేర్పులు నిర్వహించింది.

2018 మినీ కూపర్ విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ మరియు వోల్వో వి40 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Mini Cooper Launched In India; Prices Start At Rs 29.70 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X