క్విడ్ ఆధారిత 7-సీటర్ మినీ ఎమ్‌పీవీ కారును సిద్దం చేస్తున్న రెనో

రెనో సిద్దం చేసిన సరికొత్త సబ్-4-మీటర్ ఎమ్‌పీవీని పరీక్షిస్తుండగా తొలి స్పై ఫోటోలు రహస్యంగా లీక్ అయ్యాయి. ఈ రెనో ఎమ్‌పీవీ కారుకు తమిళనాడులోని జాతీయ రహదారి మీద పరీక్షలు నిర్వహిస్తుండగా పట్టుబడింది.

By N Kumar

రెనో సిద్దం చేసిన సరికొత్త సబ్-4-మీటర్ ఎమ్‌పీవీని పరీక్షిస్తుండగా తొలి స్పై ఫోటోలు రహస్యంగా లీక్ అయ్యాయి. ఈ రెనో ఎమ్‌పీవీ కారుకు తమిళనాడులోని జాతీయ రహదారి మీద పరీక్షలు నిర్వహిస్తుండగా పట్టుబడింది.

క్విడ్ ఆధారిత 7-సీటర్ మినీ ఎమ్‌పీవీ

రెనో ఈ ఎమ్‌పీవీ వాహనాన్ని క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపొదించినట్లు అనేక కథనాలు చెబుతున్నాయి. తాజాగా పట్టుబడిన మోడల్ కూడా క్విడ్ ఆధారిత మినీ ఎమ్‌పీవీగా దర్శనమిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

క్విడ్ ఆధారిత 7-సీటర్ మినీ ఎమ్‌పీవీ

రెనో తమ సబ్-4-మీటర్ మినీ ఎమ్‌పీవీ వాహనాన్ని 2019లో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, మార్కెట్లో ఉన్న రెనో లాడీ ఎమ్‌పీవీ క్రింది స్థానాన్ని భర్తీ చేయనుంది. అంతే కాకుండా ధరలను కూడా అత్యంత పోటీతత్వంతో నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.

క్విడ్ ఆధారిత 7-సీటర్ మినీ ఎమ్‌పీవీ

ఈ ఎమ్‌పీవీని కంపెనీ యొక్క సిఎమ్‌ఎఫ్-ఎ+ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మిస్తోంది. రెనో ఇండియా లైనప్‌లో ఉన్న క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌ను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించారు. అయితే, ఈ ఎమ్‌పీవీ నాలుగు మీటర్ల లోపు క్విడ్ కంటే పొడవుగా ఉంటుంది. వీల్ బేస్ కూడా పొడవుగానే ఉంటుంది కాబట్టి ఇందులో గరిష్టంగా 7 మంది వరకు ప్రయాణించవచ్చని తెలిసింది.

క్విడ్ ఆధారిత 7-సీటర్ మినీ ఎమ్‌పీవీ

క్విడ్ ఆధారిత ఎమ్‌పీవీని నలుపు మరియు తెలుపు రంగు చారలున్న పేపరుతో పూర్తిగా కప్పేసి టెస్టింగ్ నిర్వహించారు. ఏదేమైనప్పటికీ, ఇది వరకు ఉన్న ఇతర మోడళ్లతో పోల్చితే దీని డిజైన్ చాలా విభిన్నంగా ఉంటుందిని రెనో పేర్కొంది.

క్విడ్ ఆధారిత 7-సీటర్ మినీ ఎమ్‌పీవీ

సరికొత్త రెనో ఎమ్‌పీవీలో పెద్ద పరిమాణంలో ఉన్న రిమ్ములు ఉన్నాయి. ఇంటీరియర్‌లో సరికొత్త డ్యాష్‌బోర్డ్ మరియు ఏసి వెంట్స్ అదే విధంగా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి మరెన్నో ఫీచర్లను క్విడ్ నుండి సేకరించారు.

క్విడ్ ఆధారిత 7-సీటర్ మినీ ఎమ్‌పీవీ

రహస్యంగా సేకరించిన రెనో ఎమ్‌పీవీలో రియర్ వైపర్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. అదనంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు రానున్నాయి.

క్విడ్ ఆధారిత 7-సీటర్ మినీ ఎమ్‌పీవీ

రెనో క్విడ్ ఆధారిత ఎమ్‌పీవీ సాంకేతికంగా 1.0-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమయ్యే అవకాశం ఉంది. అయితే, అధిక పవర్ కోసం టుర్భోఛార్జ్‌డ్ వెర్షన్‌లో రానుంది. కానీ, ఇప్పటి వరకు డీజల్ వెర్షన్ గురించి ఎలాంటి సమాచారం లేదు.

క్విడ్ ఆధారిత 7-సీటర్ మినీ ఎమ్‌పీవీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెనో శరవేగంగా సిద్దం చేస్తున్న మినీ ఎమ్‌పీవీని అత్యంత చౌక ధరతో పరిచయం చేయనుంది. రెనో గతంలో ప్రవేశపెట్టిన లాజీ ఎమ్‌పీవీని ఇండియన్ కస్టమర్లను ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.

క్విడ్ ఆధారిత 7-సీటర్ మినీ ఎమ్‌పీవీ

అయితే, ఈ మినీ ఎమ్‌పీవీ సబ్-4-మీటర్ కెటగిరీ క్రింద వస్తోంది కాబట్టి, అధిక సంఖ్యలో సేల్స్ సాధించే అవకాశం ఉంది. రెనోకు ఇండియాలో భారీ విజయాన్ని సాధించిపెట్టిన చివరి మోడల్ క్విడ్. దీని కంటే ముందుగా వచ్చిన డస్టర్ కూడా రెనోకు మంచి ఖ్యాతిని తీసుకొచ్చింది.

Picture Courtesy: HVKForum

Most Read Articles

English summary
Read In Telugu: New Renault MPV Based On Kwid Spotted Testing - Launch Details Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X