15 మారుతి కార్లలో కొత్త సేఫ్టీ రూల్స్‌ పాటించినవి 9 కార్లు మాత్రమే

మారుతి సుజుకి అత్యధికంగా 15 కార్లను అందుబాటులో ఉంచింది మరియు ఇండియాలో అత్యధిక సేల్స్ సాధిస్తున్న కంపెనీ కూడా మారుతీనే. ప్రస్తుతం మారుతి వద్ద ఉన్న 15 మోడళ్లలో 9 కార్లు భారతదేశపు నూతన క్రాష్ టెస్ట్ ప్రమ

By Anil Kumar

కారు కొనాలనే ఆలోచనలో ఉన్నవారు మైలేజ్, ధర, ఇంజన్, పర్ఫామెన్స్, డిజైన్ మరియు ఫీచర్ల మీదనే ఎక్కువ దృష్టిసారిస్తారు. కానీ, కారు సేఫ్టీ మరియు భద్రత పరంగా కారులో ఉన్న సేఫ్టీ టెక్నాలజీ గురించి అస్సలు పట్టించుకోరు.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

ఇండియాలో అయితే ఈ ధోరణి మరీ దారుణంగా ఉంది. కస్టమర్ల సంగతి పక్కనపెడితే, కొత్త కార్లను విడుదల చేసేందుకు అనుమతులు మంజూరు చేసే ప్రభుత్వం కూడా వాటి భద్రతను గాలికి వదిలేస్తోంది.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

విదేశీ మరియు దేశీయ మార్కెట్లకు ఉన్నా తేడా అదే. ఇక్కడైతే, ఎలాంటి కార్లనైనా అమ్మేయొచ్చు. కానీ, అంతర్జాతీయ విపణిలో అలా కాదు, విడుదలకు సిద్దమైన ప్రతి కారు కూడా సేఫ్టీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. క్రాష్ టెస్టులో ఫెయిల్ అయిన కార్లు వెనక్కి వచ్చేయాల్సిందే.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

ఒక్కో దేశం ఒక్కోరకమైన భద్రత ప్రమాణాలను పాటిస్తోంది. కానీ, ఇండియాలో ఇప్పటి వరకు సేఫ్టీ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం(NCAP)ను భారత ప్రభుత్వం ప్రారంభించలేదు. దీంతో కనీస నిర్మాణ నాణ్యత మరియు సేఫ్టీ ఫీచర్లు లేని కార్లు కుప్పలుతెప్పలుగా విడుదలవుతున్నాయి.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

తక్కువ ధరలో లభిస్తున్నాయనే ఉద్దేశ్యంతో సొంత కారు కలను నిజం చేసుకునేందుకు భద్రత ప్రమాణాలు పాటించని, సేఫ్టీ ఫీచర్లు లేనటువంటి కార్లను కొనేస్తున్నారు. ఇండియాలో కనీస భద్రత ప్రమాణాలను పాటించని కార్లే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. దీంతో ఏ చిన్న ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడే అవకాశాన్ని కోల్పోతున్నారు.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

దేశీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అత్యధికంగా 15 కార్లను అందుబాటులో ఉంచింది మరియు ఇండియాలో అత్యధిక సేల్స్ సాధిస్తున్న కంపెనీ కూడా మారుతీనే. ప్రస్తుతం మారుతి వద్ద ఉన్న 15 మోడళ్లలో 9 కార్లు భారతదేశపు నూతన క్రాష్ టెస్ట్ ప్రమాణాలను పాటిస్తున్నట్లు పేర్కొంది.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

ముందు వైపు, ముందు వైపున మూలల్లో మరియు ప్రక్క వైపుల క్రాష్ టెస్టుకు సంభందించిన నూతన ప్రమాణాలను అక్టోబరు 1, 2017 నుండి విడుదలయ్యే కొత్త కార్లు ఖచ్చితంగా పాటించాలి, మరియు అక్టోబరు 1, 2019 నుండి భారత మార్కెట్లో ఉన్న అన్ని కార్లు కూడా ఈ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

అదే విధంగా పాదచారుల భద్రత పరమైన ప్రమాణాలను అక్టోబరు 1, 2018 నుండి విడుదలయ్యే ప్రతికారు పాటించాలి మరియు అక్టోబర్ 1, 2020 నాటికి అప్పటికే మార్కెట్లో ఉన్న మరియు అప్పటి నుండి విడుదలయ్యే ప్రతి మోడల్‌ కూడా ఈ ప్రమాణాలను పాటించాలని గడువు విధించారు.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

ఈ నేపథ్యంలో, ఎస్-క్రాస్, సియాజ్, ఎర్టిగా, వితారా బ్రిజా, బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఇగ్నిస్ మరియు సెలెరియో ఉత్పత్తులు ఇప్పటికే ఫ్రంటల్, ఆఫ్-సెట్ ఫ్రంట్ మరియు సైడ్ క్రాష్ అదే విధంగా పెడస్ట్రైన్ (పాదచారి) క్రాష్ టెస్ట్ ప్రమాణాలను పాటిస్తున్నాయని వెల్లడించింది.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

ప్రస్తుతానికి భద్రత ప్రమాణాలను పాటించని మిగతా ఆరు కార్లను గడువులోపు పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపింది. మారుతి అతి త్వరలో సియాజ్ ఫేస్‌లిఫ్ట్ మరియు ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

భద్రత ప్రమాణాలను పాటించని వ్యాగన్ఆర్, ఆల్టో కె10 మరియు ఆల్టో 800 మోడళ్ల స్థానంలోకి అత్యున్నత నిర్మాణ విలువలు మరియు ప్రమాణాలను పాటించే కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనున్న సమచారం. అయితే, ఆమ్ని, ఇకో మరియు జిప్సీ మోడళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

15 మారుతి కార్లలో 9 మాత్రమే సేఫ్

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో నూతన భద్రత ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి. భవిష్యత్తులో ఈ ప్రమాణాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నికార్లు కూడా మెరుగైన ప్రమాణాలను పాటిస్తే రోడ్డు ప్రమాద మరణాల రేటు గణనీయంగా తగ్గిపోవడం ఖాయం.

Most Read Articles

English summary
Read In Telugu: Nine of 15 Maruti Suzuki models meet new crash test norms
Story first published: Friday, July 27, 2018, 12:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X