Just In
- 1 hr ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 1 hr ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 2 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 4 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
Don't Miss
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Movies Prince yawar: ప్రిన్స్ యావర్‌కు హ్యాండిచ్చిన నయని పావని.. స్టేజీమీదే కన్నీరు పెట్టుకున్న కుర్రాడు!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వస్తోన్న నిస్సాన్ కిక్స్
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ సరికొత్త కిక్స్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఇండియన్ వెర్షన్ నిస్సాన్ కిక్స్ ఎస్
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ సరికొత్త కిక్స్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఇండియన్ వెర్షన్ నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ, భారతీయు రోడ్లకు అనుగుణంగా జనవరి 2019లో విడుదలవుతున్నట్లు తెలిసింది.
హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీకి గట్టి పోటీనివ్వనున్న నిస్సాన్ కిక్స్ ఎస్యూవీ గురించి మరిన్ని వివరాలు...
నిస్సాన్ కిక్స్ అత్యంత విశాలమైన క్యాబిన్ మరియు అధునాతన కనెక్టివిటి ఫీచర్లతో వస్తోంది. సాంకేతికంగా పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అయితే, నిస్సాన్ కిక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్ గురింటి ఎలాంటి సమాచారం లేదు.
నిస్సాన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డిజైన్ డైరక్టర్, అల్ఫాన్సో అల్బాసియా మాట్లాడుతూ, "ఇండియన్ వెర్షన్ నిక్సాన్ కిక్స్ ఎస్యూవీ ఇంటర్నేషనల్ మోడల్‌తో పోల్చుకుంటే చాలా విభన్నంగా ఉంటుంది. ఇండియన్ కస్టమర్ల కోసం విశాసమైన క్యాబిన్, పెద్ద పరిమాణంలో ఉన్న బాడీ అదే విధంగా అత్యాధుక ఫీచర్లతో ప్రవేశపెడుతున్నట్లు తెలిపాడు"
దేశీయ మార్కెట్లో జపాన్ దిగ్గజం నిస్సాన్ కంపెనీకి అత్యంత ముఖమైన మోడల్‌గా నిలవనుంది. నిస్సాన్ కిక్స్ పూర్తి స్థాయిలో విడుదలైతే, విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ మరియు మహీంద్రా స్కార్పియో వంటి మోడళ్ల నోరు మూయించనుంది.
సాంకేతికంగా నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్లు రానున్నాయి. పెట్రోల్ యూనిట్ 104బిహెచ్పి-142ఎన్ఎమ్ అదే విధంగా, డీజల్ యూనిట్ 108బిహెచ్పి-240ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.
తొలుత నిస్సాన్ కిక్స్ పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్, అదే విధంగా డీజల్ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యం కానున్నాయి. బహుశా మలి దశలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విడుదల చేయవచ్చు. అంతర్జాతీయ విపణిలో ఉన్న ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఇండియన్ వెర్షన్ కిక్స్లలో మిస్సయ్యే అవకాశం ఉంది.
కిక్స్ ఎస్యూవీ నిస్సాన్ ఇండియాకు అత్యంత కీలకమైన ఉత్పత్తి, దేశీయ మార్కెట్లో తననితాను నిరూపించుకోవడానికి ఉన్న ఏకైక ఆప్షన్ నిస్సాన్ కిక్స్ మాత్రమే. ప్రపంచ శ్రేణి నాణ్యత, అత్యుత్త నిర్మాణ విలువలు, అత్యాధునిక ఫీచర్లతో ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి నిస్సాన్ ప్రయత్నిస్తోంది. నిస్సాన్ కిక్స్ ధరల శ్రేణి రూ. 11 లక్షల నుండి రూ. 16 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.
Source: CarandBike