నిస్సాన్ కిక్స్ విడుదల ఈ ఏడాదిలోనే

నిస్సాన్ అంతర్జాతీయ విపణిలో ప్రవేశపెట్టిన కిక్స్ ఎస్‌యూవీని ఈ ఏడాదిలోనే మరికొన్ని నెలల్లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. భారీ అంచనాలతో నిస్సాన్ సిద్దం చేస్తున్న కిక్స్ ఎస్‌యూవీ హ్యుంద

By Anil Kumar

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ అంతర్జాతీయ విపణిలో ప్రవేశపెట్టిన కిక్స్ ఎస్‌యూవీని ఈ ఏడాదిలోనే మరికొన్ని నెలల్లో దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. భారీ అంచనాలతో నిస్సాన్ సిద్దం చేస్తున్న కిక్స్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా మరియు రెనో క్యాప్చర్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

నిస్సాన్ కిక్స్ విడుదల ఈ ఏడాదిలోనే

నిస్సాన్ కంపెనీ గ్లోబల్ ఉద్యోగి ఒకరు మీడియాకు తెలిపిన కథనం మేరకు, నిస్సాన్ వారి తరువాత మోడల్ కిక్స్ ఎస్‌యూవీ అని తెలిసింది. అంతర్జాతీయ విపణిలో వి-ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన కిక్స్ అందుబాటులో ఉంది.

నిస్సాన్ కిక్స్ విడుదల ఈ ఏడాదిలోనే

అయితే, ఇండియన్ మార్కెట్ కోసం బిఒ ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తున్నట్లు తెలిపారు. రెనో డస్టర్, క్యాప్చర్ మరియు నిస్సాన్ టెర్రానో మోడళ్లను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తున్నారు.

నిస్సాన్ కిక్స్ విడుదల ఈ ఏడాదిలోనే

నిస్సాన్ భాగస్వామ్యపు సంస్థ రెనో వారి డస్టర్ డిజైన్ అంశాలతో రూపొందించిన టెర్రానో తరహాలో కాకుండా పూర్తిగా తమ సొంత డిజైన్ అంశాలతో కిక్స్ ఎస్‌యూవీని డెవలప్ చేసింది. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత నిస్సాన్ ఇండియాలో ఒక కొత్త మోడల్‌ను విడుదల చేస్తోంది.

నిస్సాన్ కిక్స్ విడుదల ఈ ఏడాదిలోనే

ఇండియన్ వెర్షన్ నిస్సాన్ కిక్స్ సాంకేతికంగా 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభించనుంది. ఈ రెండు ఇంజన్‌లు కూడా రెనో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీలో గుర్తించవచ్చు.

నిస్సాన్ కిక్స్ విడుదల ఈ ఏడాదిలోనే

1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 110బిహెచ్‌పి పవర్ మరియు 142ఎన్ఎమ్ టార్క్, అదే విధంగా 1.5-లీటర్ కె9కె డీజల్ ఇంజన్ 110బిహెచ్‌పి పవర్ మరియు 240ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు డీజల్ వేరియంట్లు 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభ్యమవుతాయి.

నిస్సాన్ కిక్స్ విడుదల ఈ ఏడాదిలోనే

నిస్సాన్ కిక్స్ గ్లోబల్ మోడల్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడా లభ్యమవుతోంది. అయితే, ఇండియన్ వెర్షన్ కిక్స్ టాప్ ఎండ్ వేరియంట్ ఆప్షనల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించే అవకాశం ఉంది. అదే విధంగా డిమాండును బట్టి కాస్త ఆలస్యంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేయనున్నారు.

నిస్సాన్ కిక్స్ విడుదల ఈ ఏడాదిలోనే

నిస్సాన్ కిక్స్ విపణిలో టెర్రానో పై స్థానాన్ని భర్తీ చేయనుంది. సరికొత్త నిస్సాన్ కిక్స్ పూర్తి స్థాయిలో విడుదలైతే.. ఇదే సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, రెనో క్యాప్చర్, మారుతి సుజుకి ఎస్-క్రాస్ మరియు హోండా బిఆర్-వి వంటి మోడళ్లకు సరాసరి పోటీనివ్వనుంది.

నిస్సాన్ కిక్స్ విడుదల ఈ ఏడాదిలోనే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీకి డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రతి కార్ల తయారీ సంస్థ కూడా ఈ సెగ్మెంట్లోకి తమ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ బరిలోకి ప్రవేశిస్తున్న నిస్సాన్ కిక్స్ ధరల శ్రేణి రూ. 9 లక్షల నుండి రూ. 14 లక్షల మధ్య ఉండవచ్చు.

Source: BusinessStandard

Most Read Articles

English summary
Read In Telugu: Nissan kicks india launch details revealed rival hyundai creta
Story first published: Thursday, May 31, 2018, 10:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X