నిస్సాన్ మైక్రా కారుకు క్రాష్ పరీక్షలు

నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారుకు ల్యాటిన్ ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ టెస్ట్ ఫలితాలు తాజాగా రివీల్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మార్చ్ అనే పేరుతో లభ్యమవుతున్న నిస్సాన్ మైక్రా అత్యంత

By Anil Kumar

నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారుకు ల్యాటిన్ ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ టెస్ట్ ఫలితాలు తాజాగా రివీల్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మార్చ్ అనే పేరుతో లభ్యమవుతున్న నిస్సాన్ మైక్రా అత్యంత దారుణమైన ఫలితాలు నమోదు చేసుకుంది.

నిస్సాన్ మైక్రా కారుకు క్రాష్ పరీక్షలు

మునుపటి తరానికి చెందిన నిస్సాన్ మైక్రా తాజాగా జరిగిన నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో 1 స్టార్ రేటింగ్‌కే పరిమితమైంది. ఇదే మోడల్ అంతర్జాతీయ విపణితో పాటు ఇండియన్ మార్కెట్లో కూడా లభ్యమవుతోంది.

నిస్సాన్ మైక్రా కారుకు క్రాష్ పరీక్షలు

ఫ్రంట్ క్రాష్ టెస్టులో నిస్సాన్ మైక్రా డ్రైవర్ మరియు ప్యాసింజర్ల తల మరియు మెడ భాగాల్లో వీలైనంత భద్రత కల్పించినట్లు గుర్తించడం జరిగింది. కానీ, ఛాతీ భాగానికి భద్రత కల్పించడంలో ఫెయిల్ అయ్యింది.

నిస్సాన్ మైక్రా కారుకు క్రాష్ పరీక్షలు

మోకాలి భద్రత విషయంలో కూడా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. నిస్సాన్ మైక్రా బాడీ స్టెబుల్‌గా లేకపోవడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ప్రయాణికుల మోకాళ్లు ప్రమాదంలో పడ్డట్లేనని ఎన్‌సిఏపి గుర్తించింది.

నిస్సాన్ మైక్రా కారుకు క్రాష్ పరీక్షలు

సైడ్ క్రాష్ టెస్ట్‌లో నిస్సాన్ మైక్రా ప్యాసింజర్ తల విషయంలో మంచి భద్రతనే కల్పించినప్పటికీ, ఛాతీ భద్రతలో మళ్లీ అవే ఫలితాలు సాధించింది. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారులోని అన్ని వేరియంట్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు తప్పనిసరిగా వచ్చాయి. అయితే, స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఐఎస్ఒ ఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ మిస్సయ్యాయి.

నిస్సాన్ మైక్రా కారుకు క్రాష్ పరీక్షలు

అడల్ట్ సీట్ బెల్ట్ సహాయంతో చైల్డ్ రీస్టైన్ సిస్టమ్ (CRS) అందివ్వడంతో చిన్న పిల్లల భద్రత విభాగంలో ఐదింటికి గాను రెండు స్టార్ల రేటింగ్ సాధించింది. పెద్దల భద్రత విషయంలో ఐదింటికి గాను మూడు స్టార్ల రేటింగ్ దక్కించుకుంది. 2016లో జరిగిన క్రాష్ టెస్టులో ఇదే విభాగంలో నాలుగు స్టార్ల రేటింగ్ లభించింది.

నిస్సాన్ మైక్రా కారుకు క్రాష్ పరీక్షలు

ల్యాటిన్ అమెరికా కోసం నిస్సాన్ తమ మైక్రా లేదా మార్చ్ హ్యాచ్‌బ్యాక్ కారును మెక్సికో మరియు బ్రెజిల్‌లో తయారు చేస్తోంది. మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారు యొక్క భద్రత పాళ్లు పెంచాలని ల్యాటిన్ ఎన్‌సిఎపి నిస్సాన్‌కు సూచించింది.

నిస్సాన్ మైక్రా కారుకు క్రాష్ పరీక్షలు

నిస్సాన్ మైక్రా ఇండియన్ మార్కెట్లో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఇవి వరుసగా, 76బిహెచ్‌పి పవర్ మరియు 104ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 63బిహెచ్‌పి పవర్ మరియు 160ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి.

నిస్సాన్ మైక్రా కారుకు క్రాష్ పరీక్షలు

ఇండియన్ వెర్షన్ నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారులో భద్రత పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, సెంట్రల్ డోర్ లాకింగ్ మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

నిస్సాన్ మైక్రా కారుకు క్రాష్ పరీక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నిస్సాన్ తమ మునుపటి తరానికి చెందిన మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారుకు ల్యాటిన్ ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ పరీక్షల్లో అత్యంత దారుణంగా కేవలం 1-స్టార్ రేటింగ్‌కే పరిమితమైంది. ఇదే మోడల్ ఇండియన్ మార్కెట్లో కూడా అమ్ముడవుతోంది. ఈ ఫలితాలను పరిగణలోకి తీసుకుని కారు యొక్క నిర్మాణ నాణ్యతను మెరుగుపరచడం మీద దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిస్సాన్ మైక్రా లేదా మార్చ్ హ్యాచ్‌బ్యాక్ కారుకు ల్యాటిన్ ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రాష్ పరీక్షలను వీడియో ద్వారా వీక్షించగలరు...

Most Read Articles

English summary
Read In Telugu: Nissan Micra Latin NCAP Crash Test Results Revealed
Story first published: Monday, August 6, 2018, 14:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X