కారు వయస్సు 15 ఏళ్లు దాటితే పచ్చడి చేసేస్తాం: కేంద్రం

కాలం చెల్లిన వాహనాల అంతు చూసేందుకు కేంద్రం ఒక కొత్త విధానాన్ని సిద్దం చేసింది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే కాలం చెల్లిన వాహనాలకు కంప్లీట్‌గా బ్రేకులు పడ్డట్లే.

By Anil

కాలం చెల్లిన వాహనాలతో జరిగే ప్రమాదాలు అన్నీ ఇన్ని కావు. ప్రత్యేకించి కాలం చెల్లిన బస్సులకు పెయింట్ వేసి స్కూలు బస్సులుగా ఉపయోగిస్తున్నారు. స్కూలు బస్సులే కాదు, చాలా వరకు కాలం చెల్లిన వాహనాలు సవా లక్ష సమస్యలు ఇండియన్ రోడ్ల మీద తిరుగుతున్నాయి.

పాత కార్లను నుజ్జు నుజ్జు చేసే విధానం

ఇలాంటి కాలం చెల్లిన వాహనాల అంతు చూసేందుకు కేంద్రం ఒక కొత్త విధానాన్ని సిద్దం చేసింది. ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే కాలం చెల్లిన వాహనాలకు కంప్లీట్‌గా బ్రేకులు పడ్డట్లే.

Recommended Video

Mahindra TUV Stinger Concept First Look; Details; Specs - DriveSpark
పాత కార్లను నుజ్జు నుజ్జు చేసే విధానం

కేంద్ర రవాణా శాఖ మంత్రి, నితిన్ గడ్కరీ మాట్లాడుతూ," కాలం చెల్లిన పాత వాహనాల కోసం సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. 15 సంవత్సరాలు పైబడిన అన్ని వాహనాలను నుజ్జునుజ్జు చేస్తామని" తెలిపాడు.

పాత కార్లను నుజ్జు నుజ్జు చేసే విధానం

దేశీయంగా వాహన కాలుష్యం విపరీతంగా పెరగడం మరియు ఇండియన్ రోడ్ల ట్రాఫిక్ రోజు రోజుకీ పెరిగిపోతుండటం అదే విధంగా పాత వాహనాలతో ప్రమాదాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త స్క్రాపింగ్ పాలసీని ప్రవేశపెట్టినట్లు తెలిసింది.

పాత కార్లను నుజ్జు నుజ్జు చేసే విధానం

ఈ నూతన విధానంతో కొత్త వాహనాల తయారీ ఖర్చు కూడా గణనీంగా తగ్గనుంది. పాత వాహనాల నుండి సేకరించే లోహం, ప్లాస్టిక్, రబ్బరు మరియు ఫైబర్ వంటి పదార్థాలతో కొత్త వాహనాలకు కావాల్సిన విడి భాగాలను ఉత్పత్తి చేసుకోవచ్చు.

పాత కార్లను నుజ్జు నుజ్జు చేసే విధానం

స్వచ్ఛందంగా వాహనా సముదాయాన్ని ఆధునీకరించే అంశాన్ని(V-VMP) గురించి వివరిస్తూ రవాణా శాఖ మంత్రి కార్యదుర్శుల సంఘానికి ప్రత్యేక ప్రతిని పంపారు. అందులో తీవ్ర కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను స్క్రాంపింగ్ కోసం పంపే విధానం గురించి తన అభిప్రాయాలను వివరించాడు.

పాత కార్లను నుజ్జు నుజ్జు చేసే విధానం

భారత్‌లో 2005 మార్చి 31, దాని కంటే ముందు కొనుగోలు చేసిన మొత్తం 280 లక్షల వాహనాలు ఇండియన్ రోడ్ల మీద ఉన్నట్లు వెల్లడించాడు. ఇవన్నీ కూడా వి-విఎమ్‌పి పాలసీ క్రిందకు వస్తాయి.

పాత కార్లను నుజ్జు నుజ్జు చేసే విధానం

ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఈ నిర్ణయం పట్ల సానుకూలంగా ఉంది. ఈ సరికొత్త స్క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తే 65 శాతం కాలుష్యాన్ని తక్షణమే అదుపులోకి తీసుకురావచ్చు.

పాత కార్లను నుజ్జు నుజ్జు చేసే విధానం

కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే, ఈ విధానం ద్వారా కేంద్రానికి 10,000 కోట్ల రుపాయల ఆదాయం వస్తుందని తెలిపాడు. పాత వాహనాల నుండి సేకరించిన పదార్థంతో రీసైక్లింగ్ చేసిన ఉత్పత్తులను కొత్త వాహనాలలో ఉపయోగించడంతో తయారీ ఖర్చులు భారీగా దిగివస్తాయని తెలిపాడు.

పాత కార్లను నుజ్జు నుజ్జు చేసే విధానం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వాహన కాలుష్యాన్ని అదుపు చేయడానికి తీసుకున్న పాత కార్లను నుజ్జు నుజ్జు చేసే విధానం స్వాగతించదగినది. అయితే, పాత కార్లను కోల్పోయే వారికి ఇదొక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు.హోండా సిటి టైప్2 విటిఇసి, ఫియట్ పాలియో ఎస్10 మరియు మారుతి బాలెనో(పాత సెడాన్) ఇంకా మారుతి 800 వంటి పాత కార్లు రోడ్డెక్కి పోలీసులకు దొరికాయో అంతే సంగతి.

Most Read Articles

English summary
Read In Telugu: Old Cars Scrapping Policy Almost Complete — Says Union Transport Minister, Nitin Gadkar
Story first published: Friday, February 16, 2018, 13:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X